ప్రధాన మంత్రి కార్యాలయం

నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 13 JUL 2022 6:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

ఇద్దరు నేత లు జలం అంశం లో వ్యూహాత్మక భాగస్వామ్యం, కీలక రంగం అయినటువంటి వ్యవసాయ రంగం లో సహకారం, ఉన్నత సాంకేతిక విజ్ఞానం మరియు కొత్త గా ఉనికి లోకి వస్తున్న రంగాల లో ద్వైపాక్షిక సహకారాని కి గల అవకాశాలు సహా భారతదేశం-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల పై చర్చించారు. భారతదేశం-యూరోపియన్ యూనియన్ (ఇయు) ల సంబంధాలు, ప్రాంతీయ అంశాలు మరియు ప్రపంచ అంశాల పట్ల ఉభయ నేతలు వారి వారి అభిప్రాయాల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు. ఇంకా ఇండో-పసిఫిక్ రంగం లో సమానమైన దృష్టికోణం మరియు సహకారం వంటి అంశాలు కూడా వారి మధ్య ప్రస్తావన కు వచ్చాయి.

ఉన్నత స్థాయి సందర్శన లు మరియు పరస్పర సంభాషణల ను క్రమం తప్పక కొనసాగిస్తూ ఉండడం ద్వారా భారతదేశం-నెదర్లాండ్స్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాల లో ప్రగాఢం అయ్యాయి. ప్రధాన మంత్రులు ఇద్దరి మధ్య 2021వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ నాడు వర్చువల్ మాధ్యమం ద్వారా ఒక శిఖర సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడమైంది ఇక అప్పటి నుంచి వారు ఇద్దరి మధ్య తరచు గా సంభాషణ లు జరుగుతూ వస్తున్నాయి. వర్చువల్ సమిట్ సందర్భం లోనే ‘జలం అంశం లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ ప్రారంభించడమైంది.

ఈ సంవత్సరం లో, భారతదేశం మరియు నెదర్లాండ్స్ పరస్పర దౌత్య సంబంధాల స్థాపన తాలూకు 75 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకొంటున్నాయి. భారతదేశం రాష్ట్రపతి 2022వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ నుంచి 7వ తేదీ ల మధ్య కాలం లో నెదర్లాండ్స్ ను ఆధికారికం గా సందర్శించడం ద్వారా ఈ ప్రత్యేక సన్నివేశాన్ని ఘనం గా నిర్వహించడమైంది.

***



(Release ID: 1841463) Visitor Counter : 115