ప్రధాన మంత్రి కార్యాలయం

పార్లమెంటు నూతన భవనం పై కప్పు మీదఅమర్చినజాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి


పార్లమెంటు నిర్మాణం లోభాగంపంచుకొన్న శ్రమజీవుల ను కలసి వారితో మాట్లాడిన ప్రధాన మంత్రిPosted On: 11 JUL 2022 2:32PM by PIB Hyderabad

పార్లమెంటు నూతన భవనం పై కప్పు మీద అమర్చిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉదయం ఆవిష్కరించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పార్లమెంట్ నూతన భవనం పై కప్పు మీద అమర్చిన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే గౌరవం ఈ రోజు న ఉదయం పూట నాకు లభించింది.’’ అని పేర్కొన్నారు.

 

This morning, I had the honour of unveiling the National Emblem cast on the roof of the new Parliament. pic.twitter.com/T49dOLRRg1

— Narendra Modi (@narendramodi) July 11, 2022

కొత్త పార్లమెంటు నిర్మాణ పనుల లో పాలుపంచుకొన్న శ్రమజీవుల తో ప్రధాన మంత్రి భేటీ అయ్యి, వారితో మాట్లాడారు.

‘‘పార్లమెంటు నిర్మాణం లో భాగం పంచుకొన్న శ్రమజీవుల తో నేను జరిపినభేటీ అపురూపమైనటువంటిదిగా ఉంది. వారి ప్రయాసల ను చూసుకొని మనం గర్వపడుతున్నాం; మరి మన దేశ ప్రజల కోసం వారు అందించినటువంటి తోడ్పాటు ను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకొంటాం.’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

I had a wonderful interaction with the Shramjeevis who have been involved in the making of the Parliament. We are proud of their efforts and will always remember their contribution to our nation. pic.twitter.com/p4LUFmCTDx

— Narendra Modi (@narendramodi) July 11, 2022

జాతీయ చిహ్నాన్ని కాంస్యం తో రూపొందించారు. దీని మొత్తం బరువు 9500 కిలోగ్రాములు ఉంది. కంచు లోహాన్ని కరగించి పోత పోసి దీనిని తయారు చేయడం జరిగింది. జాతీయ చిహ్నం ఎత్తు 6.5 మీటర్లు ఉంది. పార్లమెంట్ నూతన భవనం యొక్క కేంద్రీయ రంగశాల కు అగ్రభాగాన ఈ సూచక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిహ్నానికి ఊతం గా ఉండటం కోసం దాదాపు గా 6500 కిలోగ్రాముల బరువు కలిగిన ఒక ఉక్కు సహాయక నిర్మాణాన్ని కూడా చేపట్టి పూర్తి చేయడమైంది.

 

పార్లమెంటు నూతన భవనం యొక్క పై కప్పు మీద జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలి అనే భావన తో పాటు సంబంధిత రేఖాచిత్రాలు మరియు ప్రక్రియ లు ఎనిమిది వివిధ దశ ల గుండా సాగాయి. బంకమట్టి నమూనా ను తీర్చిదిద్దడం/ కంప్యూటర్ గ్రాఫిక్ ను తయారు చేయడం మొదలుకొని కంచు ను కరిగించి పోత పోయడం మరియు మెరుగులు పెట్టడం వరకు ఆ దశల లో భాగం అయ్యాయి.

 

***

 (Release ID: 1840816) Visitor Counter : 312