యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
క్రీడాకారులకు నగదు అవార్డులు, జాతీయ సంక్షేమం మరియు పెన్షన్ యొక్క సవరించిన పథకాలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
ఆన్‌లైన్‌లోకి వచ్చిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ క్రీడాకారులకు జాతీయ సంక్షేమం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెన్షన్ పథకాలు
సవరించిన పథకాలు తక్కువ సమయంలో క్రీడాకారులకు ప్రయోజనం చేకూర్చేందుకు మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని అందిస్తాయి: శ్రీ అనురాగ్ ఠాకూర్
వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్ సంస్థలు నేరుగా ఎన్ఎస్‌డీఎఫ్ పోర్టల్ ద్వారా క్రీడాకారులు, క్రీడా సౌకర్యాలు, క్రీడా కార్యక్రమాలకు సహకారం అందిచవచ్చు.
క్రీడా మంత్రిత్వ శాఖ dbtyas-sports.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది, ఇది క్రీడాకారులకు నగదు అవార్డుల ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఎన్ఎస్‌డీఎఫ్ కోసం nsdf.yas.gov.in అనే ఇంటరాక్టివ్ వెబ్‌సైట్‌ను కూడా క్రీడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
Posted On:
08 JUL 2022 3:08PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ నేడు దిల్లీలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు నగదు పురస్కారాలు, జాతీయ సంక్షేమం పెన్షన్, వెబ్ పోర్టల్ (dbtyas-sports.gov.in) ప్రారంభించారు. అదేవిధంగా జాతీయ క్రీడా అభివృద్ధి నిధి కోసం పోర్టల్ (nsdf.yas.gov.in) ను ప్రారంభించారు.
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ క్రీడా పోటీలలో పతకాలు సాధించిన వారికి, వారి కోచ్‌లకు నగదు అవార్డు పథకానికి పలు ముఖ్యమైన సవరణలను తీసుకువచ్చిందని కేంద్రమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జాతీయ క్రీడాకారుల సంక్షేమం (PDUNWFS) ఈ పథకాలను మరింత వినియోగదారు-స్నేహపూర్వకంగా, సులభంగా సమాచారం పొందేందుకు వీలుగా పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతో క్రీడా విభాగం తీసుకొచ్చింది.
డిజిటల్ ఇండియా దిశగా పౌరులకు సాధికారత కల్పించడం కోసం ప్రభుత్వానికి, పౌరుల మధ్య అంతరాన్ని తగ్గించడం కోసం తీసకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ వ్యవస్థ మరియు సౌకర్యాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు కోసం ప్రధానమంత్రి దార్శనికత కనిష్ట ప్రభుత్వం - గరిష్ట పాలన ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సవరించిన పథకాలు రికార్డు సమయంలో క్రీడాకారులకు ప్రయోజనం చేకూర్చేందుకు మరింత పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని అందజేస్తాయని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం వ్యక్తిగత క్రీడాకారుడు ఎవరైనా, అతని/ఆమె అర్హత ప్రకారం మూడు పథకాలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. “ఇంతకుముందు ప్రతిపాదనలు స్పోర్ట్స్ ఫెడరేషన్లు/స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా స్వీకరించబడ్డాయి. ఇది ప్రతిపాదనల సమర్పణకు ఎక్కువ సమయం తీసుకునేది. కొన్నిసార్లు ప్రతిపాదనను ఆమోదించడానికి 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టేది. సకాలంలో సమర్పణ, నగదు అవార్డ్ యొక్క తదుపరి ఆమోదాన్ని నిర్ధారించడానికి, దరఖాస్తుదారు ఇప్పుడు నిర్దిష్ట పోటీ ముగిసిన చివరి తేదీ నుండి ఆరు నెలలలోపు నగదు అవార్డు పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించేందుకు మూడు పథకాలలో వెరిఫికేషన్ ప్రక్రియ సడలించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కోచ్(లు) వారి నగదు పురస్కారాన్ని సకాలంలో పొందేలా చేయడానికి, పథకంలో అవసరమైన మార్పులు చేయబడ్డాయి. డెఫ్లింపిక్స్ క్రీడాకారులకు కూడా పెన్షన్ ప్రయోజనాలు విస్తరించబడ్డాయి. "ఈ పథకాలలో పై మార్పలను అమలు చేయడానికి, క్రీడల శాఖ పైన పేర్కొన్న పథకాల ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు క్రీడాకారులను సులభతరం చేయడానికి dbtyas-sports.gov.in వెబ్ పోర్టల్‌ను క్రీడా విభాగం అభివృద్ధి చేసింది" అని మంత్రి తెలిపారు.
ఈ ఆన్‌లైన్ పోర్టల్ క్రీడాకారులు తమ నమోదు చేయబడ్డ మొబైల్ నంబర్‌కు పంపిన వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా దరఖాస్తులను రియల్ టైంలో ట్రాకింగ్ చేయడానికి మరియు ధృవీకరణను సులభతరం చేస్తుందని శ్రీ అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దరఖాస్తుదారులు మంత్రిత్వ శాఖకు భౌతికంగా దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదు. పోర్టల్ DBT-MISతో అనుసంధానించబడింది. ఇది భారత ప్రభుత్వ DBT మిషన్ యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి క్రీడాకారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ పోర్టల్ డిపార్ట్‌మెంట్‌కు అన్ని దరఖాస్తులను సకాలంలో త్వరితగతిన పరిష్కరించడంలో సహాయపడటమే కాకుండా వివిధ రకాల అవసరమైన నివేదికలు మరియు క్రీడాకారుల డేటా నిర్వహణకు కూడా ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్ క్రీడాకారుల అవసరాలకు మరియు ప్రబలంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయబడుతుంది.
'నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్' (ఎన్‌ఎస్‌డిఎఫ్) కోసం క్రీడా శాఖ ప్రత్యేక ఇంటరాక్టివ్ వెబ్‌సైట్ nsdf.yas.gov.in ని కూడా అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఫండ్ దేశంలో క్రీడల ప్రచారం మరియు అభివృద్ధి కోసం కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రరంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు మరియు వ్యక్తులు మొదలైన వాటి నుండి సీఎస్ఆర్ సహకారంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత, సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు పోర్టల్ ద్వారా క్రీడాకారులు, క్రీడా సౌకర్యాలు మరియు క్రీడా కార్యక్రమాలకు నేరుగా సహకారం అందించవచ్చని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఎన్‌ఎస్‌డిఎఫ్ కార్పస్ టార్గెట్ ఒలింపిక్ పోడియం (TOP) పథకం, ప్రముఖ క్రీడాకారులు మరియు క్రీడా సంస్థలచే మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలైన వాటి కోసం ఉపయోగించబడుతుంది. “ఈ అంకితమైన వెబ్‌సైట్ క్రీడాకారులకే కాకుండా CSR కంట్రిబ్యూటర్లకు కూడా సులభమైన మరియు పారదర్శక ప్రాప్యతను అందిస్తుంది. దేశంలో క్రీడల అభివృద్ధికి ఎన్‌ఎస్‌డిఎఫ్‌ను గొప్ప విజయాన్ని సాధించడంలో ఈ వెబ్‌సైట్ సహాయం చేస్తుంది” అని మంత్రి తెలిపారు.
*****
(Release ID: 1840306)
Visitor Counter : 201