వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జులై 4న రాష్ట్రాల స్టార్ట్-అప్ ర్యాంకింగుల ప్రకటన


ఏడు సంస్కరణల అంశాలు, 26 యాక్షన్ పాయింట్లతో మూడోసారి జరిగిన స్టార్ట్-అప్ ర్యాంకింగ్ కోసం పోటీ పడిన 24 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు

గత ఆరు సంవత్సరాల కాలంలో నాలుగు నుంచి 30 కి చేరిన స్టార్ట్-అప్ ల కోసం విధానం రూపొందించి అమలు చేస్తున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య

స్టార్ట్-అప్ పోర్టల్ నిర్వహిస్తున్న 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు

12 భాషల్లో 7200 మంది లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ

Posted On: 01 JUL 2022 12:49PM by PIB Hyderabad

అంకుర సంస్థ (స్టార్ట్-అప్) ల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్ ఇచ్చేందుకు మూడవసారి నిర్వహించిన అధ్యయన నివేదిక ఫలితాలను  వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ జూలై  4, 2022న న్యూఢిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో  విడుదల చేయనున్నారు. 

సహకార స్ఫూర్తి, పోటీతత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం దేశంలో మూడవసారి అంకుర సంస్థల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్ ఇచ్చేందుకు అధ్యయనం నిర్వహించింది. అంకుర  సంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు నిబంధనలను సరళీకృతం చేసి సహకారం అందించేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించేందుకు 2018 నుంచి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతోంది. 

ఈ ఏడాది జరిగిన పోటీలో 24 రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి. గత ఏడాది మొత్తం 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అధ్యయనం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద  స్టార్ట్-అప్   దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో రెండు,మూడవ  తరహా నగరాలు గా గుర్తింపు పొందిన  ప్రాంతాల్లో వ్యవస్థాపక వ్యవస్థను ప్రోత్సహించవలసిన అవసరం  ఉంది. 2016 నాటికి దేశంలో నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే అంకుర సంస్థల కోసం ప్రత్యేక విధానం అమలులో ఉంది. ప్రస్తుతం అంకుర సంస్థల కోసం ప్రత్యేక  విధానం 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు జరుగుతోంది. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక పోర్టల్ నిర్వహిస్తున్నాయి. 

 అంకుర సంస్థలు, సంబంధిత వర్గాలను ప్రోత్సహించేందుకు  అవసరమైన నియంత్రణ, విధానం మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం లాంటి  26 యాక్షన్ పాయింట్‌లతో కూడిన 7 విస్తృత సంస్కరణ అంశాల ప్రాతిపదికన ప్రస్తుత అధ్యయనం జరిగింది.  సంస్కరణ రంగాలలో  సంస్థాగత సహకారం, వినూత్నత, వ్యవస్థాపకతను  ప్రోత్సహించడం, మార్కెట్‌ అవకాశాలు కల్పించడం,  ఇంక్యుబేషన్ సహకారం, నిధుల సమీకరణ, అభివృద్ధికి సహకారం అందించి, సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం లాంటి అంశాలు ఉన్నాయి.

1 అక్టోబర్ 2019 నుండి  31 జూలై 2021 వరకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంకుర సంస్థలకు  అందించిన సహకారం ఆధారంగా ప్రస్తుత అధ్యయనం జరిగింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన ఆరు నెలల నివేదికలను పరిశీలించి, 13 భాషల్లో 7200 మంది లబ్ధిదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా నివేదికను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అంకుర సంస్థలకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన తోడ్పాటు ఆధారంగా రూపొందిన నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. 

2021 సంబంధించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లభించిన రాంకులు, ప్రోత్సాహం, సలహా సూచనలు, సుస్థిర అభివృద్ధి  పోర్టల్ కోసం సలహాదారులను ఆహ్వానించేందుకు ఏర్పాటైన కార్యక్రమం  4 జూలై 2022 సోమవారం ఉదయం  11:30 గంటలకు న్యూఢిల్లీ లోని  అశోక్ హోటల్ లో జరుగుతుంది. అధ్యయనం జరిగిన  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు. 

***


(Release ID: 1838633) Visitor Counter : 270