ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపుర్ లో కొండ చరియలు విరిగిపడటం వల్ల తలెత్తిన స్థితి ని సమీక్షించినప్రధాన మంత్రి


కేంద్రం నుంచి అన్ని విధాలైన సహాయం అందుతుందంటూ ప్రధాన మంత్రి హామీ నిఇచ్చారు

నాడు పోస్టు చేయడమైనది: 30 JUN 2022 3:53PM by PIB Hyderabad

మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింహ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మాట్లాడారు; ఆ రాష్ట్రం లో కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటన కారణం గా తలెత్తిన స్థితి ని సమీక్షించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ @NBirenSingh గారితో మాట్లాడాను; కొండచరియలు విరిగిపడ్డ దుర్ఘటన కారణం గా తలెత్తిన స్థితి ని సమీక్షించడం జరిగింది. కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలు గాను మద్దతు అందుతుందంటూ హామీ ని ఇచ్చాను. బాధితులు క్షేమంగా ఉండాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.

ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకొందురు గాక.’’ అని పేర్కొన్నారు.

*****************

DS

 


(రిలీజ్ ఐడి: 1838245) సందర్శకుల సూచీ సంఖ్య : : 145