ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

197.61 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.66 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,04,555

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 18,819

ప్రస్తుత రికవరీ రేటు 98.55%

వారపు పాజిటివిటీ రేటు 3.72%

Posted On: 30 JUN 2022 9:43AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 197.61 కోట్ల ( 1,97,61,91,554 ) డోసులను అధిగమించింది. 2,57,19,005 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.66 కోట్లకు పైగా ( 3,66,66,548 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,940

రెండో డోసు

1,00,65,670

ముందు జాగ్రత్త డోసు

56,98,268

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,23,903

రెండో డోసు

1,76,26,198

ముందు జాగ్రత్త డోసు

1,02,61,333

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,66,66,548

రెండో డోసు

2,34,21,049

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,04,32,621

రెండో డోసు

4,87,75,997

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,82,52,205

రెండో డోసు

50,13,99,508

ముందు జాగ్రత్త డోసు

29,16,874

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,46,086

రెండో డోసు

19,34,61,532

ముందు జాగ్రత్త డోసు

25,54,148

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,58,069

రెండో డోసు

12,08,35,500

ముందు జాగ్రత్త డోసు

2,42,87,105

ముందు జాగ్రత్త డోసులు

4,57,17,728

మొత్తం డోసులు

1,97,61,91,554

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,04,555. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.24 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 13,827 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,28,22,493 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 18,819 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,52,430 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.23 కోట్లకు పైగా ( 86,23,75,489 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.72 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.16 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1838228) Visitor Counter : 108