వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమక్షంలో వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP 2020) అమలు ఆధారంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కార్యాచరణ ప్రణాళికను రేపు విడుదల చేయనున్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


రంగాల వారీగా BRAP 2020లో మొదటిసారిగా 9 కీలక రంగాల్లో 72 సంస్కరణలు అమలు

BRAP 2020లో 15 వ్యాపార నియంత్రణ అంశాలకు సంబంధించి 301 సంస్కరణలు

Posted On: 29 JUN 2022 2:58PM by PIB Hyderabad

వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP)ను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రేపు గురువారం 2022 జూన్ 30న వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమక్షంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ విడుదల చేయనున్నారు. 

BRAP 2020లో 301 సంస్కరణ అంశాలు ఉన్నాయి. సమాచార అందుబాటు, ఏకగవాక్ష విధానం,కార్మిక, పర్యావరణ, లాంటి ప్రధాన అంశాలకు సంబంధించి సంస్కరణలు అమలు కానున్నాయి. సాధారణ వ్యాపారం జరిగే సమయంలో  15 వ్యాపార నియంత్రణ అంశాల్లో ఈ సంస్కరణలు అమలు జరుగుతాయి. 

BRAP 2020లో మొదటిసారిగా 9 కీలక రంగాల్లో 72 సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. వ్యాపార లైసెన్సులు, ఆరోగ్య సంరక్షణ, తూనికలు కొలతలు,సినిమా హాళ్లు, ఆతిధ్య రంగంఅగ్ని ప్రమాద నిరభ్యంతర సర్టిఫికెట్సినిమా చిత్రీకరణపర్యాటక రంగాల్లో అమలు చేసేందుకు అవకాశం ఉన్న 72 సంస్కరణలు తొమ్మిది రంగాల్లో  గుర్తించబడ్డాయి.

  దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల-స్నేహపూర్వక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి వ్యాపార  సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP)ని పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం 2014 నుంచి విడుదల చేస్తున్నది.  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి  ఇప్పటివరకు 4 నివేదికలు   విడుదల చేయబడ్డాయి. తాజాగా విడుదల కానున్న నివేదికలో 2020 అంశాలను  మదింపు వేయడం జరిగింది. 

 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టిన సంస్కరణలు అమలు జరుగుతున్న తీరు, వాటి నాణ్యతపై వ్యాపార వర్గాల నుంచి     పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం అభిప్రాయాలను సేకరించి నివేదిక సిద్ధం చేసింది.    సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ల వాస్తవ వినియోగదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అంచనా నివేదికను సిద్ధం చేశారు. 

సులభతర వ్యాపార నిర్వహణ అంశంలో  పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం పాత్ర కీలకంగా ఉంటుంది. రాఅస్త్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి సమన్వయము సాధించి వ్యాపార నిర్వహణ సులభతరం అయ్యేలా చూసేందుకు  పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం చర్యలు అమలు చేస్తున్నది. 

***



(Release ID: 1838114) Visitor Counter : 126