ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్ 30వ తేదీ న ‘ఉద్యమి భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి


ఎమ్ఎస్ఎమ్ఇ రంగాని కి దన్నుగా నిలచేందుకు కీలక కార్యక్రమాల ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు

‘రైజింగ్ ఎండ్ ఏక్సెలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఇ  పర్ ఫార్మెన్స్’ (ఆర్ఎఎమ్ పి) పథకం, ‘కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్ టైమ్ఎక్స్ పోర్టర్స్’ (సిబిఎఫ్ టిఇ) పథకం లతో పాటు ‘ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం’ (పిఎమ్ఇజిపి) లో కొత్తఅంశాల ను కూడా ప్రధాన మంత్రి ప్రవేశపెడతారు

పిఎమ్ఇజిపి లబ్ధిదారుల కు సహాయాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా బదలాయించనున్న ప్రధానమంత్రి

ఎమ్ఎస్ఎమ్ఇ ఐడియా హ్యాకథన్, 2022 యొక్క ఫలితాల ను ప్రధాన మంత్రి ప్రకటిస్తారు; ఎమ్ఎస్ఎమ్ఇ జాతీయ పురస్కారాలు, 2022 ను కూడా ఆయన ప్రదానం చేస్తారు

Posted On: 28 JUN 2022 7:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జూన్ 30వ తేదీ న ఉదయం సుమారు 10:30 గంటల వేళకు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఉద్యమి భారత్కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం లో, ప్రధాన మంత్రి రైజింగ్ ఎండ్ ఏక్సెలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఇ పర్ ఫార్మెన్స్’ (ఆర్ఎఎమ్ పి) పథకాన్ని ,కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్-టైమ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఎక్స్ పోర్టర్స్’ (సిబిఎఫ్ టిఇ) పథకాన్ని, అలాగే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం’ (పిఎమ్ఇజిపి) లో కొత్త అంశాలను ప్రారంభిస్తారు. పిఎమ్ఇజిపి లబ్ధిదారుల కు 2022-23 సంవత్సరానికి గాను ఉద్దేశించిన సహాయాన్ని ప్రధాన మంత్రి డిజిటల్ మాధ్యమం ద్వారా బదలాయించనున్నారు; అలాగే ఎమ్ఎస్ఎమ్ఇ ఐడియా హ్యాకథన్, 2022 యొక్క ఫలితాల ను ఆయన ప్రకటిస్తారు; ఎమ్ఎస్ఎమ్ఇ జాతీయ అవార్డులు, 2022 ను ప్రదానం చేస్తారు; సెల్ఫ్ రిలయంట్ ఇండియా (ఎస్ఆర్ఐ) ఫండ్ లో భాగం గా 75 సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపార సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) కు డిజిటల్ ఎక్విటీ సర్టిఫికెట్స్ ను ప్రధాన మంత్రి జారీ చేయనున్నారు.

 

ఉద్యమి భారత్అనేది ఎమ్ఎస్ఎమ్ఇ ల సశక్తీకరణ దిశ లో పాటుపడేందుకు గాను ప్రభుత్వం ఆది నుంచి చాటుతున్న వచనబద్ధత కు అద్దం పడుతోంది. ఎమ్ఎస్ఎమ్ఇ రంగాని కి అవసరమైన సమర్ధన ను సకాలం లో అందించడం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముద్ర యోజన, ఇమర్జెన్సి క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీము, స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫార్ రీజనరేశన్ ఆఫ్ ట్రెడిశనల్ ఇండస్ట్రీస్ (ఎస్ఎఫ్ యుఆర్ టిఐ) ల వంటి అనేక కార్యక్రమాల ను తీసుకు వచ్చింది. ఈ పథకం దేశవ్యాప్తం గా కోట్ల కొద్దీ మంది కి ప్రయోజనాన్ని చేకూర్చింది.

 

రైజింగ్ ఎండ్ ఏక్సెలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఇ పర్ ఫార్మెన్స్’ (ఆర్ఎఎమ్ పి) పథకాన్ని సుమారు 6,000 కోట్ల రూపాయల వ్యయం తో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పథకం ఇప్పటికే రాష్ట్రాల లో అమలవుతున్న ఎమ్ఎస్ఎమ్ఇ పథకాల ప్రభావాన్ని విస్తరింప జేయడంతో పాటు ఎమ్ఎస్ఎమ్ఇ ల సామర్ధ్యాన్ని అధికం చేయాలి అనే లక్ష్యం తో వస్తోంది. ఈ పథకం ఎమ్ఎస్ఎమ్ఇ లను పోటీ తత్వం తో కూడినవి గా, స్వయం సమృద్ధం అయినవి గా తీర్చిదిద్దడం కోసం నూతన ఆవిష్కరణల ను ప్రోత్సహించడం, నాణ్యత పరమైన ప్రమాణాల ను అభివృద్ధి పరచడం ద్వారా కొత్త వ్యాపారాల కు, నవ పారిశ్రామికత్వాని కి తగిన ఊతాన్ని అందించడం, మార్కెట్ లభ్యత ను పెంపొందింప చేయడం, సాంకేతిక పరమైన ఉపకరణాల ను మోహరించడం తో పాటు ఇండస్ట్రీ 4.0 వంటి చర్య ల ద్వారా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు పూరకం గా ఉండబోతోంది.

 

కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్-టైమ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఎక్స్ పోర్టర్స్ ’ (సిబిఎఫ్ టిఇ) పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ప్రపంచ బజారు కోసం అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఉత్పాదనల ను మరియు సేవల ను అందించేటట్లు గా ఎమ్ఎస్ఎమ్ఇ లను ప్రోత్సహించాలి అనేది ఈ పథకం ధ్యేయం. ఈ పథకం గ్లోబల్ వేల్యూ చైన్ లో భారతదేశ ఎమ్ఎస్ఎమ్ఇ లు మరింత ఎక్కువ సంఖ్య లో పాల్గొనేటట్లు చేయడం తో పాటు గా అవి వాటి యొక్క ఎగుమతి అవకాశాల ను అందుకోవడం లో కూడాను తోడ్పడుతుంది.

 

‘ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్ మెంట్ జనరేశన్ ప్రోగ్రామ్’ (పిఎమ్ఇజిపి) లో కొత్త అంశాల ను కూడా ప్రధాన మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశాల లో.. తయారీ రంగం లో ప్రాజెక్టు గరిష్ఠ వ్యయాన్ని ఇప్పుడు ఉన్న 25 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల కు పెంచడం, సేవా రంగం లో ఇప్పుడు ఉన్నటువంటి 10 లక్షల రూపాయల ప్రాజెక్టు గరిష్ఠ వ్యయాన్ని 20 లక్షల రూపాయల కు పెంచడం తో పాటుగా ఆకాంక్షభరిత జిల్లాల మరియు ట్రాన్స్ జెండర్స్ దరఖాస్తుల ను ఆయా కేటగిరీలు అధిక సబ్సిడీల ను పొందేందుకు వీలు గా ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులలో చేర్చడం వంటి చర్య లు.. భాగం గా ఉన్నాయి. దీనికి తోడు, దరఖాస్తుదారుల కు / నవపారిశ్రామికుల కు బ్యాంకింగ్ నిపుణుల, సాంకేతిక నిపుణుల , మార్కెటింగ్ నిపుణుల సేవ ల ద్వారా అవసరపడ్డ మద్దతు ను అందించే ఏర్పాటు లు సైతం జరుగుతున్నాయి.

 

ఇదే కార్యక్రమం లో ఎమ్ఎస్ఎమ్ఇ ఐడియా హ్యాకథన్, 2022 తాలూకు ఫలితాల ను ప్రధాన మంత్రి ప్రకటించనున్నారు. 2022వ సంవత్సరం లో మార్చి నెల 10వ తేదీ నాడు మొదలైన ఈ హ్యాకథన్ వ్యక్తుల లో ఇంతవరకు బయటకు రానటువంటి సృజనాత్మకత కు సమర్థన ను అందించడానికి, ప్రోత్సహించడాని కి, అలాగే ఎమ్ఎస్ఎమ్ఇ రంగం లో నూతన ఆవిష్కరణల ను మరియు అత్యధునాతన సాంకేతికతల ను ప్రోత్సహించడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఇది. ఎంపికైన ఇంక్యూబేటీ సరికొత్త ఆలోచనల కు ఒక్కొక్క ఆలోచన కు 15 లక్షల రూపాయల వరకు నిధుల పరమైన మద్దతు ను అందించడం జరుగుతుంది.

 

ఎమ్ఎస్ఎమ్ఇ జాతీయ పురస్కారాలు, 2022 ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు. భారతదేశం లోని హుషారైన ఎమ్ఎస్ఎమ్ఇ రంగం యొక్క అభివృద్ధి కి మరియు వృద్ధి కి ఎమ్ఎస్ఎమ్ఇ లు, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆకాంక్షభరిత జిల్లాలు మరియు బ్యాంకులు అందించినటువంటి ప్రశంసాయోగ్యమైన పనితీరు కు గుర్తింపు గా ఈ పురస్కారాలను అందించడం జరుగుతుంది.

 

***

 

 



(Release ID: 1837977) Visitor Counter : 160