ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్17వ మరియు జూన్ 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


వడోదరా లో ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో ప్రధాన మంత్రి పాల్గొంటారు

ప్రధాన మంత్రి 21,000 కోట్ల రూపాయల విలువ కలిగిన అభివృద్ధి పథకాల కుప్రారంభోత్సవం/శంకుస్థాపన చేస్తారు

పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా 1.4 లక్షల గృహాల కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన లు

ఆ ప్రాంతం లో 16,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టులద్వారా రైల్వే కనెక్టివిటీ కి పెద్ద ప్రోత్సాహం లభించనుంది

సామాన్య మానవుల కు జీవన సౌలభ్యాన్ని పెంచడం కోసం ఉద్దేశించిన అనేక అభివృద్ధి పనులు

రాష్ట్రం లో మాత శిశు స్వస్థత కు దన్ను గా నిలచే పథకాల ను ప్రారంభించడంజరుగుతుంది

పునరభివృద్ధి పరచిన పావాగఢ్ గుట్ట మీది శ్రీ కాళిక మాత ఆలయాన్ని ప్రారంభించనున్నప్రధాన మంత్రి

Posted On: 16 JUN 2022 3:01PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 17వ తేదీ మరియు 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్నారు. పావాగఢ్ గుట్ట మీద పునర్ అభివృద్ధి పనులు పూర్తి అయిన శ్రీ కాళిక మాత ఆలయాన్ని ప్రధాన మంత్రి జూన్ 18వ తేదీ నాడు ఉదయం సుమారు 9గంటల 15 నిమిషాల వేళ కు సందర్శించి, ఆ ఆలయాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం సుమారు 11:30 గంటల వేళ లో విరాసత్ వన్ ను ఆయన సందర్శించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం పూట దాదాపు 12గంటల 30 నిమిషాల వేళ కు ఆయన వడోదరా లో గుజరాత్ గౌరవ్ అభియాన్లో పాలుపంచుకొని, 21,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల లో కొన్నిటి ని ప్రారంభించడమే కాక మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు చేస్తారు.

గుజరాత్ గౌరవ్ అభియాన్

వడోదరా లో జరిగే గుజరాత్ గౌరవ్ అభియాన్ లో ప్రభుత్వాని కి చెందిన వివిధ పథకాల లబ్ధిదారులు పాలుపంచుకోనున్నారు. ప్రధాన మంత్రి 16,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన వేరు వేరు రైల్ వే ప్రాజెక్టుల లో కొన్ని ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడమే కాకుండా, మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రాజెక్టుల లో న్యూ పాలన్ పుర్ - మదార్ సెక్షన్ లోని 357 కి. మీ. పొడవైన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్; అహమదాబాద్-బోటాద్ సెక్షన్ లో 166 కి. మీ. మేర గేజ్ కన్వర్శన్ లతో పాటు 81 కి. మీ. పొడవైన పాలన్ పుర్-మీఠా సెక్షన్ విద్యుదీకరణ సహా ఇతర ప్రాజెక్టు లు ఉన్నాయి. ప్రధాన మంత్రి సూరత్, ఊద్ నా, సోం నాథ్ మరియు సాబర్ మతీ స్టేశన్ ల పునర్ అభివృద్ధి పనుల కు శంకు స్థాపన చేయడం తో పాటుగా రైల్ వే రంగం లో ఇతర కార్యక్రమాల కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం లో తోడ్పడడం తో పాటు గా ఆ ప్రాంతం లో వ్యవసాయ రంగాని కి మరియు పారిశ్రామిక రంగాని కి వెన్నుదన్ను గా నిలువనున్నాయి. అవి ఆ ప్రాంతం లో సంధానాన్ని కూడా మెరుగు పరచి, ప్రయాణికుల కు సౌకర్యాల ను పెంచుతాయి.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా, మొత్తం 1.38 లక్షల గృహాల ను ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. వీటిలో, పట్టణ ప్రాంతాల లో దాదాపు గా 1,800 కోట్ల రూపాయల విలువైన ఇళ్ళు, అలాగే గ్రామీణ ప్రాంతాల లో 1,530 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ఇళ్ళు కలసి ఉన్నాయి. వీటికి అదనం గా, 310 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన సుమారు 3000 గృహాల కు ఖత్ ముహూర్తం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది.

ఈ కార్యక్రమం లో భాగం గా, ఖేడా, ఆణంద్, వడోదరా, ఛోటా ఉదేపుర్ మరియు పంచమహల్ లలో 680 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన వివిధ అభివృద్ధి పనుల లో కొన్నింటిని ప్రధాన మంత్రి ప్రజల కు అంకితం చేస్తారు; మరి కొన్ని పనుల కు శంకుస్థాపన చేస్తారు. ఆ ప్రాంతం లో ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందింప చేయడం అనేది ఈ పథకాల లక్ష్యం గా ఉంది.

ప్రధాన మంత్రి గుజరాత్ లోని దభోయి తాలూకా లో ఉన్న కుంధేలా గ్రామం లో గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాని కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని వడోదరా నగరాని కి దాదాపు 20 కిలో మీటర్ ల దూరం లో సుమారు 425 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడం జరుగుతుంది; ఈ విశ్వవిద్యాలయం 2,500 మంది కి పైగా విద్యార్థుల కు ఉన్నత విద్య బోధన ను అందుబాటు లోకి తీసుకు రానుంది

తల్లి మరియు బిడ్డ ల ఆరోగ్యాన్ని మెరుగు పరచడం పై శ్రద్ధ వహించే ముఖ్యమంత్రి మాతృశక్తి యోజనను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పథకాని కి 800 కోట్ల రూపాయలు వ్యయం కానుంది. ఈ పథకం లో గర్భిణుల కు, బాలింతల కు 2 కిలోల శనగల ను, ఒక కిలో కందిపప్పు ను, ఒక కిలో వంట నూనె ను ఉచితం గా ప్రతి నెల ఆంగన్ వాడీ కేంద్రాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రం లోని ఆదివాసీ లబ్ధిదారులు అందరికీ వర్తింప చేస్తున్న పోషణ్ సుధ్ యోజనకోసం దాదాపు గా 120 కోట్ల రూపాయల ను ప్రధాన మంత్రి వితరణ చేయనున్నారు. ఆదివాసులు నివసిస్తున్న జిల్లాల లో గర్భవతుల కు మరియు బిడ్డల కు పాలు ఇచ్చే తల్లుల కు ఐరన్ మాత్రల ను మరియు కాల్షియమ్ మాత్రల ను అందజేయడం తో పాటుగా పోషణ విజ్ఞ‌ానం సంబంధి అవగాహన ను ప్రచారం చేసే ప్రయోగం సఫలం అయిన దరిమిలా ఈ చర్య ను చేపట్టడం జరుగుతోంది.

శ్రీ కాళికా మాత ఆలయం లో ప్రధాన మంత్రి

పావాగఢ్ గుట్ట పైన ఉన్నటువంటి శ్రీ కాళిక మాత ఆలయాన్ని పునర్ అభివృద్ధి చేసిన అనంతరం ఆ ఆలయాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఆ ప్రాంతం లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల లో ఒకటి గా ఉన్న ఈ ఆలయం పెద్ద సంఖ్య లో యాత్రికుల ను ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని రెండు దశల లో పునర్ అభివృద్ధి పరచడం జరిగింది. ఒకటో దశ పునర్ అభివృద్ధి పనుల అనంతరం ప్రధాన మంత్రి ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఆ ఆలయ భాగాన్ని ప్రారంభించారు. రెండో దశ పునర్ అభివృద్ధి పనుల కు 2017వ సంవత్సరం లో ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రెండో దశ ఆలయ భాగాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ దశ లో ఆలయ ఆధారం విస్తరణ పనులు మరియు మూడు స్థాయిల లో పరిసరంపునర్ నిర్మాణ పనులు, వీధి దీపాలు, సిసి టివి వ్యవస్థ మొదలైన సదుపాయాలు వంటివి భాగం గా ఉన్నాయి.

***



(Release ID: 1834551) Visitor Counter : 177