కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఐఎంటి/ 5జి టెలికాం సేవల కోసం స్పెక్ట్రం వేలం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటననను (ఎన్ఐఎ)ను జారీ చేసిన డిఒటి
Posted On:
15 JUN 2022 12:37PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పౌరులందరికీ అత్యాధునిక, అందుబాటు ధరలో ఉన్నత నాణ్యత కలిగిన టెలికాం సేవలను అందించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. విస్త్రత స్థాయిలో 4జి సేవలను ప్రారంభించి విజయాన్ని సాధించిన భారత్ ఇప్పుడు దేశంలో 5జి సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
త్వరలోనే 5జి సేవలను ప్రారంభించేందుకు, ఉనికిలో ఉన్న టెలికాం సేవలను పెంచేందుకు, టెలికాం శాఖ స్పెక్ట్రమ్ వేలానికి శ్రీకారం చుడుతూ, దరఖాస్తులను ఆహ్వానించేందుకు 15.06జ.2022న నోటీసును జారీ చేసింది.
స్పెక్ట్రం వేలం ముఖ్యాంశాలు:
వేలం వేయనున్న స్పెక్ట్రం: వేలంలో భాగంగా అందుబాటులో ఉన్న 600 మెగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్,800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్, 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లు సహా అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్.
సాంకేతిక: యాక్సెస్ లైసెన్స్ పరిధిలో ఈ వేలం ద్వారా కేటాయించిన స్పెక్ట్రమ్‌ను 50 (ఐఎంటి-2020) లేదా మరేదైనా సాంకేతిక కోసం ఉపయోగించవచ్చు.
వేలం ప్రక్రియ: ఈ వేలం ఏకకాలంలో బహుళ దశల అసెండింగ్ (ఆరోహణ) (ఎస్ ఎంఆర్ ఎ ) ఇ-ఆక్షన్‌గా ఉండనుంది.
పరిమాణం: మఒత్తం 72097.85 మెగాహెర్ట్జ్‌ల స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు.
స్పెక్ట్రం వ్యవధి: స్పెక్ట్రంను ఇరవై (20) ఏళ్ళకాలానికి కేటాయించనున్నారు.
చెల్లింపు: వఇజయవంతమైన బిడ్డర్లు 20 సమాన వాయిదాలలో చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తారు. ఈ కాలంలో 7.2% వడ్డీతో ఎన్‌పివిని సక్రమంగా కాపాడతారు.
స్పెక్ట్రంను తిరిగి అప్పగించడం: ఈ వేలం ద్వారా కొనుగోలు చేసిన స్పెక్ట్రంను కనీసం పది ఏళ్ళ తర్వాత తిరిగి అప్పగించవచ్చు.
స్పెక్ట్రం వినియోగ ఛార్జి: ఈ వేలం ద్వారా కొనుగోలు చేసిన స్పెక్ట్రంపై స్పెక్ట్రం వినియోగ చార్జీలు ఉండవు.
బ్యాంకు గ్యారంటీలు: వఇజయవంతమైన బిడ్డరు ఆర్థిక బ్యాంకు గ్యారంటీని (ఎఫ్‌బిజి)ని, పనితీరు బ్యాంకు గ్యారంటీని (పిబిజి)ని సమర్పించవలసి ఉంటుంది.
క్యాప్టివ్ నాన్- పబ్లిక్ నెట్‌వర్క్: ఈ వేలం ద్వారా కొనుగోలు చేసిన స్పెక్ట్రంను వినియోగిస్తున్న పరిశ్రమలు వివిక్త కాప్టివ్ నాన్- పబ్లిక్ నెట్‌వర్క్స్ ( సార్వజనికం కాని బద్ధమైన నెటవర్క్) లైసెన్సులను ఏర్పాటు చేసుకోవచ్చు.
స్పెక్ట్రం వేలానికి సంబంధించిన ఇతర వివరాలు, అనగా నిల్వ లేక ప్రత్యేక ధరలు, పూర్వ అర్హతల నిబంధనలు, ముందుగా చెల్లించే డిపాజిట్లు ( ఇఎండి), వేలం నియమాలు తదితరాలు, ఎన్ఐఎలో పైన పేర్కొన్న ఇతర నిర్దేశించిన ఇతర నిబంధనలు, షరతులను డిఒటి వెబ్‌సైట్ లింక్ https://dot.gov.in/spectrum-management/2886 ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
స్పెక్ట్రం వేలం 26.07.2022 నుంచి ప్రారంభం అవుతుంది.
***
(Release ID: 1834503)
Visitor Counter : 186