కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"అగ్నివీర్స్' సర్వీస్ అనంతర కొనసాగింపు - వారి సేవలు వినియోగించుకుంటామన్న టెలికాం శాఖ"
Posted On:
15 JUN 2022 4:49PM by PIB Hyderabad
'అగ్నిపథ్ పథకం' కింద సాయుధ దళాలలో 'అగ్నివీర్స్' లను నాలుగేళ్ల పాటు నియామకంపై ప్రభుత్వం 14 జూన్ 2022న పరివర్తనాత్మక ప్రకటన చేసిన తర్వాత, టెలికాం శాఖ (DoT) అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో (TSPs) నేడు సమావేశాన్ని నిర్వహించింది. సాయుధ దళాలతో 4 సంవత్సరాల పాటు సేవలందించి బయటకు రానున్న శిక్షణ పొందిన 'అగ్నివీర్'ల ప్రతిభ, క్రమశిక్షణ మరియు నైపుణ్యాలను సాధారణంగా టెలికాం రంగం మరియు ముఖ్యంగా టీఎస్‌పీలు ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై వివిధ మార్గాలను సమావేశంలో చర్చించారు. టెలికాం శాఖ సీనియర్ అధికారులతో పాటు మొత్తం 4 టీఎస్‌పీల (ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా) ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. దిల్లీలోని సంచార్ భవన్‌లో సభ్యులు (టెక్నాలజీ) అధ్యక్షతన సమావేశం జరిగింది.
సమావేశ చర్చల్లో భాగంగా, 'అగ్నివీర్స్' నియామకం చేపట్టిన అనంతరం వారు చేయగలిగే ప్రాంతాలను గుర్తించారు. వీటిలో ఆప్టికల్ ఫైబర్ మెయింటెనెన్స్, ఎయిర్ కండిషనింగ్ పరికరాలు, మౌలిక సదుపాయాల సదుపాయం ముఖ్యంగా చివరి మైలు కనెక్టివిటీ, ఫైబర్ టు హోమ్ (FTTH), కస్టమర్ ఇంటర్‌ఫేస్ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ పథకం ఫలితంగా అందుబాటులోకి వచ్చే శిక్షణ పొందిన/నైపుణ్యం కలిగిన మరియు క్రమశిక్షణ కలిగిన యువత ప్రతిభను టెలికాం రంగంతో సహా దేశానికి ఒక ఆస్తిగా ఉండవచ్చని టీఎస్‌పీలు అంగీకరించాయి. టీఎస్‌పీలు వారికి కావల్సిన నిర్దిష్ట నిపుణత కలిగిన వాటికోసం త్వరలో తిరిగి చెప్పేందుకు నిర్ణయించారు. ఈ 'అగ్నివీర్లు' సాయుధ దళాలలో పనిచేసిన సమయంలో వారికి ఈ నిర్దిష్ట అంశాలు/ప్రాంతాల్లో శిక్షణ అందించగలిగితే, వారు తమ అగ్నిపథ్ సేవను పూర్తి చేసినప్పుడు వారు పరిశ్రమకు సిద్ధంగా ఉంటారని వారు తెలిపారు.
***
(Release ID: 1834310)
Visitor Counter : 190