ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఖరీఫ్ పంటల మార్కెట్ సీజన్ 2022-23లోకనీస మద్దతు ధరలకు మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం
Posted On:
08 JUN 2022 4:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) మార్కెట్ సీజన్ 2022-23కు సంబంధించి నిర్దేశిత ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు ప్రతిపాదనను ఆమోదించింది. ఆయా పంటలు పండించిన అన్నదాతలకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు పంటల వైవిధ్యం దిశగా వారిని ప్రోత్సహించడంలో భాగంగా మార్కెట్ సీజన్ 2022-23కుగాను ఖరీఫ్ పంటలకు ‘ఎమ్మెస్పీ’ని ప్రభుత్వం కింది పట్టికలో చూపిన విధంగా పెంచింది.
మార్కెట్ సీజన్ 2022-23కుగాను ఖరీఫ్ పంటలకు
కనీస మద్దతు ధరలు (కింటాలుకు రూ.లలో)
పంట
|
ఎమ్మెస్పీ
2014-15
|
ఎమ్మెస్పీ
2021-22
|
ఎమ్మెస్పీ
2022-23
|
2022-23లో *ఉత్పత్తి వ్యయం
|
ఎమ్మెస్పీ
(మొత్తం) పెరుగుదల
|
ఉత్పత్తి వ్యయంపై రాబడి (శాతం)
|
వరి (సాధారణ)
|
1360
|
1940
|
2040
|
1360
|
100
|
50
|
వరి (గ్రేడ్-ఎ)^
|
1400
|
1960
|
2060
|
-
|
100
|
-
|
జొన్న(హైబ్రిడ్)
|
1530
|
2738
|
2970
|
1977
|
232
|
50
|
జొన్న(మాల్దండి)^
|
1550
|
2758
|
2990
|
-
|
232
|
-
|
సజ్జ
|
1250
|
2250
|
2350
|
1268
|
100
|
85
|
రాగి
|
1550
|
3377
|
3578
|
2385
|
201
|
50
|
మొక్కజొన్న
|
1310
|
1870
|
1962
|
1308
|
92
|
50
|
కంది (అర్హర్)
|
4350
|
6300
|
6600
|
4131
|
300
|
60
|
పెసర
|
4600
|
7275
|
7755
|
5167
|
480
|
50
|
మినప
|
4350
|
6300
|
6600
|
4155
|
300
|
59
|
వేరుసెనగ
|
4000
|
5550
|
5850
|
3873
|
300
|
51
|
సన్‌ఫ్లవర్ గింజలు
|
3750
|
6015
|
6400
|
4113
|
385
|
56
|
సోయాబీన్స్ (పసుపు)
|
2560
|
3950
|
4300
|
2805
|
350
|
53
|
నువ్వు
|
4600
|
7307
|
7830
|
5220
|
523
|
50
|
గడ్డి నువ్వులు
|
3600
|
6930
|
7287
|
4858
|
357
|
50
|
పత్తి (మధ్యరకం పింజ)
|
3750
|
5726
|
6080
|
4053
|
354
|
50
|
పత్తి (పొడుగు పింజ)^
|
4050
|
6025
|
6380
|
-
|
355
|
-
|
* వ్యవసాయ కూలీలు, మడక/కూలీ/యంత్రాల కిరాయి, కౌలుకింద భూమికి చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు, కంపోస్టు, నీటిపారుదల రుసుములు వంటి వస్తుపరమైన ఉత్పాదకాల వినియోగ వ్యయం వగైరాలన్నీ చెల్లించిన మొత్తం. పరికరాలు, వ్యవసాయ భవనాలపై తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ ఖర్చు తదితరాలతోపాటు కుటుంబ శ్రమ విలువ ఇందులో భాగంగా ఉంటాయి.
^ వరి (గ్రేడ్-ఎ), జొన్న (మాల్దండి), పత్తి (పొడుగు పింజ) పంటల సాగుపై ఖర్చుల సమాచారం విడిగా సేకరించబడదు.
మార్కెట్ సీజన్ 2022-23లో ఖరీఫ్ పంటలకు ‘ఎమ్మెస్పీ’ పెరుగుదల 2018-19 కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా, సహేతుక లక్ష్యంతో, అఖిలభారత సమీకృత సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అధికంగా రైతుకు న్యాయమైన ధర లభించేలా నిర్ణయించబడింది. ఈ నేపథ్యంలో సజ్జ, కంది, మినప, సన్‌ఫ్లవర్ గింజలు, సోయాబీన్స్, వేరుసెనగ పంటలకు ఎమ్మెస్పీ 50 శాతం కన్నా అధికం కావడం గమనార్హం. ఈ మేరకు ఆయా పంటలకు ఉత్పత్తి వ్యయంపై వరుసగా 85 శాతం, 60 శాతం, 59 శాతం, 56 శాతం, 53 శాతం, 51 శాతం వంతున ఎక్కువగా ఎమ్మెస్పీ నిర్ణయించబడింది.
నూనె గింజలు, పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలకు అనువైన రీతిలో ‘ఎమ్మెస్పీ’ని సరిచేయడానికి కొన్నేళ్లుగా సంయుక్త కృషి కొనసాగుతోంది. ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచేవిధంగా రైతులను ప్రోత్సహించడంతోపాటు మెరుగైన సాంకేతికత పరిజ్ఞానాలు, వ్యవసాయ పద్ధతులు అనుసరించేలా చేయడం సహా డిమాండ్-సరఫరాలో అసమతౌల్యం సరిదిద్దడానికీ ప్రయత్నాలు సాగుతున్నాయి.
దేశంలో 2021-22కి సంబంధించి 3వ ముందస్తు లెక్కల ప్రకారం- ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 314.51 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా వేయబడింది. కాగా, ఇది 2020-21నాటి ఆహార ధాన్యాల ఉత్పత్తికన్నా 3.77 మిలియన్ టన్నులు అధికం. ఈ నేపథ్యంలో గడచిన ఐదేళ్ల (2016-17 నుంచి 2020-21)లో ఆహారధాన్యాల సగటు ఉత్పత్తికన్నా 2021-22లో ఉత్పత్తి 23.80 మిలియన్ టన్నులు ఎక్కువ కావడం విశేషం.
(Release ID: 1832353)
Visitor Counter : 6828
Read this release in:
Assamese
,
Hindi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
English
,
Punjabi
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Odia