ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా 4వ రాష్ట్ర ఆహార భద్రత సూచికను విడుదల చేశారు.
నగరాలు మరియు జిల్లాల్లో ఈట్ రైట్ ఛాలెంజ్ విజేతలకు సత్కారం, ఫుడ్ సేఫ్టీ & న్యూట్రిషన్ మరియు ఈట్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్‌లో పరిశోధన కోసం ఈట్ రైట్ రీసెర్చ్ అవార్డులు మరియు గ్రాంట్లు
దేశం మరియు పోషకాహారం అనుసంధానించబడి ఉన్నాయి. దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది- డాక్టర్ మన్సుఖ్ మాండవియా
కొత్త కార్యక్రమాలు, వనరులు మరియు పుస్తకాలతో పాటు ఆయుష్ ఆహార్ లోగో ఆవిష్కరణ
Posted On:
07 JUN 2022 1:44PM by PIB Hyderabad
పౌరులకు సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) యొక్క 4వ రాష్ట్ర ఆహార భద్రత సూచిక (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)ని విడుదల చేశారు. ఆహార భద్రతకు చెందిన ఐదు ఆంశాల్లో రాష్ట్రాల పనితీరుగా ఇది రూపొందించబడింది. దేశంలోని ఆహార భద్రతకు చెందిన పర్యావరణ వ్యవస్థలో పోటీతత్వ మరియు సానుకూల మార్పును సృష్టించే లక్ష్యంతో ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ 2018-19 నుండి ప్రారంభించబడింది. ఈ సూచిక మన పౌరులకు సురక్షితమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ..భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు మరియు ప్రజలు తీసుకున్న ప్రయత్నాలను గుర్తించడంలో ఇటువంటి అవార్డులు సహాయపడతాయని చెప్పారు. దేశం మరియు పోషకాహారం లోతుగా అనుసంధానించబడి ఉన్నాయని మరియు సమృద్ధి భారత్ కోసం మనకు స్వాస్థ్య భారత్ మరియు స్వాస్థ్య భారత్ కోసం మనకు స్వాస్థ్య నాగ్రిక్ అవసరమని డాక్టర్ మాండవ్య నొక్కి చెప్పారు. గత కొన్నేళ్లుగా దేశంలో ఆరోగ్య సంరక్షణ కూడా సమగ్ర అభివృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు.
దేశంలోని ప్రతి పౌరునికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని, దీని కోసం ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణ రంగాలపై దృష్టి సారిస్తోందని అందులో భాగంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లు మరియు జాతీయ స్థాయిలో జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేయడం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని డాక్టర్ మాండవ్య అన్నారు. మన దేశ పౌరులకు ఆరోగ్యకరమైన మరియు పౌష్టికాహారాన్ని అందించడంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. “ఆహార భద్రత మరియు ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను నిర్ధారించడంలో రాష్ట్రాలకు ముఖ్యమైన పాత్ర ఉందని గమనించడం ముఖ్యం. ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్థారించడానికి మనం కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి 2021-22 సంవత్సరానికి ర్యాంకింగ్ ఆధారంగా గెలుపొందిన రాష్ట్రాలు/యుటిలను పారామీటర్‌లలో ఆకట్టుకునే పనితీరుకు సత్కరించారు. ఈ సంవత్సరం పెద్ద రాష్ట్రాలలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా గుజరాత్, మహారాష్ట్ర తరువాతి స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలలో గోవా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత మణిపూర్ మరియు సిక్కిం ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, ఢిల్లీ మరియు చండీగఢ్ మొదటి, రెండు,మరియు మూడవ ర్యాంక్‌లను పొందాయి. రాష్ట్ర ఆహార భద్రత సూచికలో గణనీయమైన అభివృద్ధిని కనబరిచిన రాష్ట్రాలను కూడా డాక్టర్ మాండవ్య సత్కరించారు.
వివిధ ఈట్ రైట్ ఇండియా కార్యక్రమాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు స్థిరమైన ఆహార వాతావరణానికి మద్దతు ఇచ్చే ప్రణాళికను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి స్మార్ట్ సిటీలను ప్రోత్సహించడానికి ఆరోగ్య మంత్రి గత సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ( ఎంఓహెచ్‌యూఏ) ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీస్ మిషన్‌తో అనుబంధంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రారంభించిన ఈట్ స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్‌లో 11 విజేత స్మార్ట్ సిటీలను సత్కరించారు. నగరాలు మరియు జిల్లాల కోసం ఈట్ రైట్ రీసెర్చ్ ఛాలెంజ్ మరియు ఈట్ రైట్ రీసెర్చ్ అవార్డులు మరియు గ్రాంట్‌ల విజేతలను కూడా ఆయన సత్కరించారు.
ఈట్ రైట్ రీసెర్చ్ అవార్డ్స్ మరియు గ్రాంట్స్ - ఫేజ్ IIతో సహా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ద్వారా వివిధ వినూత్న కార్యక్రమాలను డాక్టర్ మాండవ్య ప్రారంభించారు. ఈట్ రైట్ క్రియేటివిటీ ఛాలెంజ్ - ఫేజ్ III, పాఠశాల స్థాయిలో జరిగే పోటీ మరియు ఆయుర్వేదఆహర్ కోసం లోగో, ఇందులో ఆయుర్వేదం మరియు ఆహారానికి సంబంధించిన మొదటి అక్షరాలు 5 ఆకులు ఉన్నాయి. ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి ప్రత్యేకమైన గుర్తింపు, సులభమైన గుర్తింపు మరియు నిరూపితమైన ప్రయోజనాలను సృష్టించడంలో ఈ లోగో ప్రయోజనకరంగా ఉంటుంది.
నూనె రహిత వంట మరియు చక్కెర రహిత డెజర్ట్‌ల గురించి వినూత్న వంటకాలను సూచించే మరియు సంగ్రహించే వివిధ ఈబుక్‌లను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి విడుదల చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు చెందిన రాజ్‌భాషా విభాగం ప్రచురించిన త్రైమాసిక పత్రిక అయిన ఖాద్యంజలితో సహా వివిధ వనరుల పుస్తకాలను కూడా ప్రారంభించారు; ఆహారం ద్వారా వచ్చే వ్యాధి వ్యాప్తి పరిశోధన మరియు మైక్రోబయోలాజికల్ ప్రక్రియ నియంత్రణ, చేపలు మరియు మత్స్య ఉత్పత్తుల నమూనా మరియు పరీక్ష మొదలైన వాటిపై మార్గదర్శక పత్రం వీటిలో ఉన్నాయి.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ కార్యక్రమంలో పాల్గొనేవారిని ప్రోత్సహిస్తూ వారికి అభినందనలు తెలుపారు. ఆహార సంబంధిత వ్యాధుల భారాన్ని నివారించడానికి మరియు ఆహార భద్రతను నిర్ధారించడానికి, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగాలతో కూడిన బహుముఖ మరియు బహుళ వాటాదారుల విధానం, నియంత్రకాలు మొదలైనవి అవసరం మరియు సమాజంలోని ప్రతి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) శ్రీ అరుణ్ సింఘాల్ మాట్లాడుతూ దేశంలో ఆహార పరీక్షల నమూనాను మిషన్ మోడ్ మరియు మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండ్‌లో మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.
శ్రీ రాజీవ్ కుమార్ జైన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి ఇతర ప్రముఖులు; రాష్ట్ర ఆహార భద్రతా విభాగాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లు/స్మార్ట్ సిటీ కార్యాలయాల నుండి సీనియర్ అధికారులు; ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లోని నిపుణులు, డెవలప్‌మెంట్ ఏజెన్సీలు, ఫుడ్ బిజినెస్‌లు మరియు ఇతర వాటాదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1832121)
Visitor Counter : 250