ఆర్థిక మంత్రిత్వ శాఖ
రెండవ బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
06 JUN 2022 6:44PM by PIB Hyderabad
బ్రిక్స్ చైనా అధ్యక్షతన జరిగిన రెండవ బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసిబిజి) సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వర్చువల్ మోడ్ ద్వారా పాల్గొన్నారు. బ్రిక్స్ ఆర్థిక సహకార ఎజెండా 2022 ఫలితాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల ఉమ్మడి ప్రకటన, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, కొత్త అభివృద్ధి బ్యాంక్, బ్రిక్స్ థింక్ ట్యాంక్ నెట్‌వర్క్‌పై సమాలోచనలు జరుపుతారు.
సుస్థిరమైన, సమ్మిళితమైన వృద్ధి పథాన్ని పునర్నిర్మించడం కోసం బ్రిక్స్.. విభిన్న అంశాలపై చర్చలు, అనుభవాలు, సవాళ్ళను పరస్పరం పంచుకునే విధానాలు సులభతరం చేయడానికి ఒక వేదికగా బ్రిక్స్ కొనసాగాలని శ్రీమతి సీతారామన్ చెప్పారు.
భారతదేశ వృద్ధి దృక్పథం పై మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి భారత ఆర్థిక వృద్ధికి పెట్టుబడులతో పాటు సరైన ఆర్థిక వ్యయం మద్దతుగా కొనసాగుతుందని, సూక్ష్మ స్థాయిలో అందరినీ కలుపుకొని పోయే సంక్షేమం ద్వారా స్థూల స్థాయిలో వృద్ధి ఆలోచన ఆధారంగా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతోంది అన్నారు.
బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లు ఇతర వారసత్వ బ్రిక్స్ ఫైనాన్స్ సమస్యలైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి), బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సిఆర్‌ఎ) మొదలైన వాటిపై కూడా చర్చించారు.
****
(Release ID: 1831780)
Visitor Counter : 183