ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రేపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా అన్ని జిల్లాల్లో క్రెడిట్ ఔట్రీచ్ కార్యక్రమం

Posted On: 07 JUN 2022 7:12AM by PIB Hyderabad

అమృత మహోత్సవాల్లో భాగంగా రేపు, 8 జూన్, 2022 రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా భారీ క్రెడిట్ ఔట్‌రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని జిల్లాలు క్రెడిట్ సౌకర్యం, వివిధ ప్రభుత్వ పథకాలలో నమోదుపై వారి సందేహాలతో వినియోగదారులకు, ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమాలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు (ఎస్ఎల్‌బీసీ లు) సమన్వయం చేస్తున్నాయి.

 

అమృత మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ వేడుకలను జూన్ 6 నుంచి 12 వరకు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించారు.

 

ఈ జిల్లా స్థాయి అమృత మహోత్సవాల వేడుకను దేశంలోని అన్ని ప్రాంతాలకు సిబ్బంది, కస్టమర్లు, పెద్ద సంఖ్యలో ప్రజల భాగస్వామ్యంతో తీసుకెళ్లేందుకు ఉద్దేశించబడ్డాయి. క్రెడిట్ ఔట్రీచ్ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, మరియు అటల్ పెన్షన్ యోజనలోని జన్ సురక్ష పథకాలలో నమోదువినియోగదారులకు అవగాహన మరియు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు నిర్వహించనుంది.

***

 


(Release ID: 1831769) Visitor Counter : 164