ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


రోటేరియ‌న్లు విజ‌యం, సేవ రెండింటి నిజ‌మైన క‌ల‌యిక‌
బుద్ధుడు, మ‌హాత్మా గాంధీల పుణ్య‌భూమి మ‌న‌ది,ఇత‌రుల కోసం జీవించ‌డ‌మంటే ఏమిటో వారు ఆచ‌ర‌ణ‌లో మ‌న‌కు చూపారు

ప్ర‌కృతితో స‌హ‌జీవ‌నం చేసే శ‌తాబ్దాల నాటి మ‌న విలువ‌ల ప్రేర‌ణ‌తో, 1.4 బిలియ‌న్ల మంది భార‌తీయులు మ‌న భూమి, ప‌రిశుభ్రంగా, హ‌రిత‌మ‌యంగా ఉండేలా చూసేందుకు వీలైన అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నారు

Posted On: 05 JUN 2022 9:53PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రోటేరియ‌న్లు విజ‌య్ం, సేవ ల నిజ‌మైన క‌ల‌యిక‌కు ప్ర‌తిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్ర‌తి రోట‌రీ స‌మావేశం ఒక మినీ గ్లోబ‌ల్ అసెంబ్లీ వంటిద‌ని అన్నారు. ఇందులో వైవిధ్య‌త‌, చైత‌న్యం రెండూ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.
రోట‌రీ సంస్థ రెండు మొటోలు  వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న పెట్టి సేవ చేయ‌డం,  అత్యుత్త‌మ సేవ చేసేవారు అధికంగా లాభ‌ప‌డ‌తార‌న్న వాటిని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, మొత్తం మాన‌వాళి సంక్షేమానికి ఈ సూత్రాలు అత్యంత ముఖ్య‌మైన‌వ‌ని అన్నారు. ఇవి మ‌న రుషులు, మ‌హాత్ముల ప్ర‌బోధాల‌ను ప్ర‌తిధ్వ‌నింప చేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. మ‌నం బుద్ధుడు, మ‌హాత్మాగాంధీ జ‌న్మించిన పుణ్య‌భూమికి చెందిన వారం. ఇత‌రుల కోసం జీవించ‌డ‌మంటే ఏమిటో వారు మ‌న‌కు ఆచ‌ర‌ణ‌లో చూపించారు అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
స్వామి వివేకానంద గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, మ‌నం అంద‌రం ప‌ర‌స్ప‌ర ఆధారిత‌మైన‌, ప‌ర‌స్ప‌ర సంబంధ‌మైన‌, ప‌ర‌స్ప‌ర అనుసంధానిత‌మైన ప్ర‌పంచంలో ఉన్నామ‌ని అందువ‌ల్ల వ్య‌క్తులు, సంస్థ‌లు ప్ర‌భుత్వాలు ఈ భూమండ‌లాన్ని మ‌రింత సుస్థిరంగా, సుసంప‌న్న‌మైన‌దిగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. భూ గోళంపై సానుకూల ప్ర‌భావం చూపే ప‌లు కార్య‌క్ర‌మాల విష‌యంలో రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌ష్టించి ప‌నిచేస్తున్న‌ద‌ని  ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణకు సంబంధించి న కృషికి ఇండియా నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. సుస్థిరాభివృద్ధి ప్ర‌స్తుత అవ‌స‌రం. శ‌తాబ్దాల త‌ర‌బ‌డిమ‌న ప్రాచీన విలువ‌లు ప్ర‌కృతితో స‌హ‌జీవ‌నానికి ప్రేర‌ణ‌గా నిలిచాయి. 1.4 బిలియ‌న్ భార‌తీయులు  మ‌న భూగోళాన్ని ప‌రిశుభ్ర‌మైన‌దిగా, హ‌రిత‌మ‌య‌మైన‌దిగా చేయ‌డానికి సాధ్య‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నారు అని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.
అంత‌ర్జాతీయ సౌర కూట‌మి, ఒక సూర్యుడు, ఒక ప్ర‌పంచం, ఒక గ్రిడ్ , లైఫ్‌- లైఫ్‌స్ట‌యిల్ ఫ‌ర్ ఎన్విరాన్ మెంట్ వంటి వాటిగురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. 2070 నాటికి నెట్ జీరో కు ఇండియా క‌ట్టుబ‌డిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి తెలియ‌జేశారు. దీనిని ప్ర‌పంచం అభినందిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

మంచినీరు, పారిశుధ్యం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త వంటి వాటి విష‌యంలో రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ చేస్తున్న సేవ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు. ఐదుసంవ‌త్స‌రాల వ్య‌వధిలో పూర్తి పారిశుధ్య క‌వ‌రేజ్‌ని సాధించ‌డంలో స్వ‌చ్చ‌భార‌త్ మిష‌న్ సాధించిన ప్ర‌యోజ‌నాల‌ను గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. జ‌ల సంర‌క్ష‌ణ‌, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ వంటివి నూత‌న చైత‌న్యం, వాస్త‌వాల ఆధారంగా రూపుదిద్దుకున్నాయ‌ని అన్నారు. ఇండియాలో అద్భుత‌మైన చైత‌న్య‌వంత‌మైన స్టార్ట‌ప్ రంగం ఉండ‌డం గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

మాన‌వాళిలో ఏడో వంతుమంది ఇండియా నివాస‌స్థ‌ల‌మ‌ని, ఇంత పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు గ‌ల దేశంలో ఇండియా సాధించే ఏ విజ‌య‌మైనా అది ప్ర‌పంచంపై సానుకూల ప్ర‌భావం చూపుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఇందుకు సంబంధించి కోవిడ్ -19 వాక్సిన్ విజ‌య‌గాధ‌ను, 2025 నాటికి అంటే ప్ర‌పంచ ల‌క్ష్య‌మైన 2030 కంటే 5 సంవ‌త్స‌రాల ముందే  టిబిని దేశం నుంచి త‌రిమివేసేందుకు జ‌రుగుతున్న కృషిని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. క్షేత్ర‌స్థాయిలో ఈ కృషికి త‌మ మ‌ద్ద‌తునివ్వాల్సిందిగా రోట‌రీ కుటుంబాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోరారు. అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా యోగా దినోత్స‌వాన్ని పెద్ద ఎత్తున‌ పాటించాల్సిందిగా
 ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు.


(Release ID: 1831540) Visitor Counter : 147