ప్రధాన మంత్రి కార్యాలయం
‘భూమి ని కాపాడే ఉద్యమం’ అంశం పై జూన్ 5న ఏర్పాటైన కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి
Posted On:
04 JUN 2022 9:37AM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భూమి ని కాపాడే ఉద్యమం’ అనే అంశం పై జూన్ 5వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.
‘భూమి ని కాపాడే ఉద్యమం’ అనేది క్షీణిస్తున్న భూమి స్వస్థత ను గురించిన చైతన్యాన్ని అధికం చేసేటందుకు మరియు భూమి స్వస్థత ను మెరుగుపరచడం కోసం ఒక జాగృత ప్రతిస్పందన ను వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించినటువంటి ప్రపంచ వ్యాప్తం గా సాగుతున్న ఉద్యమం. ఈ ఉద్యమాన్ని సద్గురు 2022వ సంవత్సరం మార్చి నెల లో మొదలుపెట్టారు. దీనిలో భాగం గా 100 రోజు ల పాటు మోటార్ సైకిల్ పై చేసేటటువంటి ఒక యాత్ర. ఈ యాత్ర 27 దేశాల గుండా సాగుతున్నది. జూన్ 5వ తేదీ ఈ యాత్ర లో 75వ రోజు. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోవడం భారతదేశం లో భూమి యొక్క స్వస్థత ను మెరుగుపరచే దిశ లో ఉమ్మడి ఆలోచనల కు మరియు నిబద్ధత కు అద్దం పడుతున్నది.
***
(Release ID: 1831450)
Visitor Counter : 157
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam