ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిహెచ్)తో ఎన్‌హెచ్‌ఎ అందిస్తున్న ఉచిత టెలిమెడిసిన్ సేవ 'ఈసంజీవని' అనుసంధానం
'ఈసంజీవని' వినియోగదారులు తమ 14-అంకెల ప్రత్యేకమైన ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాను (ఎబిహెచ్‌ఎ) తెరిచి దానిలో వారి ప్రస్తుత ఆరోగ్య రికార్డులు భద్ర పరుచుకోవచ్చు
Posted On:
03 JUN 2022 1:05PM by PIB Hyderabad
ప్రధాన కార్యక్రమంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం)తో ఈ-సంజీవనిని విజయవంతంగా అనుసంధానం చేసినట్టు నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఎ) ప్రకటించింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉచితంగా అందిస్తున్న టెలిమెడిసిన్ సేవ అయిన 'ఈ-సంజీవని ప్రస్తుత వినియోగదారులు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఎబిహెచ్‌ఎ)ని సులభంగా సృష్టించుకోవడానికి మరియు ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్ట్‌లు వంటి వారి ప్రస్తుత ఆరోగ్య రికార్డులను లింక్ చేయడానికి మరియు నిర్వహించడానికి వాటిని ఉపయోగించడానికి ఈ అనుసంధానం వీలు కల్పిస్తుంది. వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను ఈ-సంజీవని ద్వారా వైద్యులతో పంచుకో గలుగుతారు. ఇది మెరుగైన వైద్య పరమైన నిర్ణయం తీసుకోవడంలో మరియు నిరంతర సంరక్షణను అందించేందుకు సహాయపడుతుంది.
అనుసంధాన ప్రాధాన్యతను నేషనల్ హెల్త్ అథారిటీ సిఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ వివరించారు. “భారతదేశంలో డిజిటల్ విధానంలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అందిస్తున్నవారు, సేవలు పొందుతున్న వారి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఒక డిజిటల్ వ్యవస్థను నెలకొల్పాలని ఎబిడిఎం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఎబిడిఎంతో 'ఈ-సంజీవని'ని అనుసంధానం చేయడం జరిగింది. 'ఈ-సంజీవని' ద్వారా ఎబిహెచ్‌ఎ ఖాతాలు పొందిన దాదాపు 22 కోట్ల మంది వారి ఆరోగ్య రికార్డులను నేరుగా తమకు నచ్చిన ఆరోగ్య లాకర్ తో అనుసంధానం చేసుకుని వాటిని చేసి భద్ర పరచుకునేందుకు వీలవుతుంది. వినియోగదారులు గతంలో లింక్ చేసిన ఆరోగ్య రికార్డులను ఈ-సంజీవనిలోని వైద్యులతో పంచుకోవచ్చు. కాగిత రహిత కార్యక్రమంగా సేవలు అందుతాయి '' అని డాక్టర్ శర్మ వివరించారు.
ఈ-సంజీవని సేవలు రెండు విధాలుగా అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఈ-సంజీవని ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ (ఎబి-హెచ్‌డబ్ల్యుసి) - డాక్టర్-టు-డాక్టర్ టెలిమెడిసిన్ సేవ. దీని ద్వారా హెచ్‌డబ్ల్యుసిని సందర్శించే లబ్ధిదారులు మెరుగైన ఉండే ఆరోగ్య సంరక్షణ /ఆసుపత్రి/వైద్య కళాశాల హబ్‌లోని వైద్యులు/నిపుణులను వర్చువల్ విధానంలో సంప్రదించవచ్చు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు మరియు ప్రాంతాలకు చెందిన వారికి సాధారణ మరియు ప్రత్యేక ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వాన్ని అవకాశం కలుగుతుంది. రెండవ విధానం- ఈ-సంజీవని ఒపిడి. ఈ విధానం దేశవ్యాప్తంగా ఉన్న రోగులను వారి ఇళ్ల నుంచి వైద్యులకు అనుసంధానం చేసి వైద్య సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఎబిడిఎంతో ఈసంజీవని ఎబి-హెచ్‌డబ్ల్యుసి మరియు ఎబి-హెచ్‌డబ్ల్యుసి సేవలు అనుసంధానించబడ్డాయి.
ఎబిడిఎంతో అనుసంధానం అయిన 40 డిజిటల్ ఆరోగ్య సేవల సరసన ఇప్పుడు ఈసంజీవని టెలిమెడిసిన్ వ్యవస్థ చేరింది. సాంకేతికతతో ముడిపడిన ఈ వైద్య సేవలు దేశానికి ఒక దృఢమైన, ఒకదానితో ఒకటి ముడి పడిన మరియు సమగ్ర డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను నిర్మిస్తున్నాయి. ఎబిడిఎంకి చెందిన ఇంటిగ్రేటెడ్ యాప్‌లపై మరింత సమాచారం : https://abdm.gov.in/our-parters లో అందుబాటులో ఉంది .
***
(Release ID: 1830879)
Visitor Counter : 307