యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టేన్‌జింగ్ నార్గే అవార్డు 2021 నామినేషన్లకు 16 జూన్ 2022 ఆఖరు తేదీ
Posted On:
03 JUN 2022 11:50AM by PIB Hyderabad
సాహస రంగంలో వ్యక్తులు సాధించిన విజయాలను రగుర్తించి, యువతలో ఓర్పు, రిస్క్ తీసుకోవడం, సహకార స్ఫూర్తితో కలిసి పని చేయడం, సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో శీఘ్రంగా, ప్రభావవంతమైన ప్రతిక్రియల స్ఫూర్తిని పెంపొందించడం కోసం కేంద్ర యువ వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ టేన్‌జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం (టేన్‌జింగ్ నార్గే నేషనల్ అడ్వంచర్ అవార్డ్ - టిఎన్ఎన్ఎఎ) అందిస్తోంది. ఈ అవార్డులో భాగంగా ఒక కాంస్య విగ్రహాన్ని, ఒక సర్టిఫికెట్‌ను, సిల్క్ టైతో కూడిన బ్లేజర్‌ను / చఈరను, రూ. 15 లక్షల అవార్డు నగదును ఇస్తారు. అర్జున అవార్డు గ్రహీతలతో పాటుగా విజేతలకు భారత ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తుంది.
సాధారణంగా, ఒక అవార్డును నాలుగు విభాగాల్లో అందిస్తారు. అవి- ల్యాండ్ అడ్వెంచర్ (భూమిపై సాహసం) వాటర్ అడ్వంచర్ (సముద్రంలో సాహసం) ఎయిర్ అడ్వంచర్ ( గగనతలంలో సాహసాలు)కు, ఈ మూడింటిపై సాహసాలు చేసిన వారికి లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు (జీవన సాఫల్య అవార్డుల)ను ప్రకటిస్తారు. గత మూడు సంవత్సరాలలో ఈ 3 విభాగాలలో, అంటే ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ (సీ) అడ్వంచర్, ఎయిర్ అడ్వంచర్‌లను పరిగనణనలోకి తీసుకుని వారి మొత్తం కెరీర్‌లో అతి పెద్ద విజయంగా భావించే జీవన సాఫల్య అవార్డును ప్రకటిస్తారు.
టిఎన్ఎన్ఎఎ 2021కి నామినేషన్లను https://awards.gov.in అన్న పోర్టల్ ద్వారా 18మే 2022 నుంచి 16 జూన్ 2022 వరకు ఆహ్వానిస్తున్నారు. అవార్డుకు సంబంధించిన మార్గదర్శకాలు యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో URL: https://yas.nic.in/youth-affairs/inviting-nominations-tenzing-norgay-national-adventure-award-2021 అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు. అద్భుతమైన పనితీరు, అత్యధ్భుతమైన నాయకత్వ లక్షణాలు, సాహస స్ఫూర్తి, క్రమశిక్షణ, ఒక సాహస రంగంలో - భూమి, సముద్రం, గగనతలంలో నిరంతర విజయాలను సాధిస్తూ వచ్చిన వారు ఆఖరు తేదీ 16 జూన్ 2022లోపు పైన పేర్కొన్న పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
***
(Release ID: 1830868)