హోం మంత్రిత్వ శాఖ
చత్తీస్గఢ్ రాష్ట్రం లోని బీజాపుర్,దంతెవాడమరియు సుక్మా జిల్లాల కు చెందిన మారుమూల ప్రాంతాల లో ఒక రిక్రూట్ మెంట్ ర్యాలీద్వారా సిఆర్ పిఎఫ్ లో కానిస్టేబుల్స్ గా స్థానిక ఆదివాసీ యువత ను భర్తీ చేయడంకోసం కానిస్టేబుల్ ఉద్యోగ విద్యార్హత లో సడలింపున కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
01 JUN 2022 4:38PM by PIB Hyderabad
దక్షిణ చత్తీస్ గఢ్ లో బీజాపుర్, దంతెవాడ మరియు సుక్ మా జిల్లా ల నుంచి సిఆర్ పిఎఫ్ లో కానిస్టేబుల్ (సాధారణ విధి) పోస్టు లకు గాను 400 మంది అభ్యర్థుల నియామకాని కై అవసరమైన కనీస విద్యార్హత ను 10వ తరగతి ఉత్తీర్ణత స్థాయి నుంచి 8వ తరగతి కి సడలించాలని దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ మూడు జిల్లాల లోని మారుమూల ప్రాంతాల లో జరిగే ఈ ర్యాలీ కోసం స్థానిక వార్తా పత్రికల లో ప్రకటన ను ఇవ్వడం తో పాటు గా విస్తృత ప్రచారానికి గాను అన్ని మార్గాల ను సిఆర్ పిఎఫ్ అనుసరించి, తదనంతరం కొత్త గా చేర్చుకొన్న ఈ శిక్షణార్థుల కు అర్హత నిర్ణక్ష్ కాలం లో లాంఛనం గా విద్య ను బోధించనుంది.
చత్తీస్ గఢ్ రాష్ట్రం లోని బీజాపుర్, దంతెవాడ, ఇంకా సుక్మా.. ఈ మూడు జిల్లాల మారుమూల ప్రాంతాల నుంచి 400 మంది ఆదివాసీ యువత ఉద్యోగ అవకాశాల ను దక్కించుకోనున్నారు. నియామకం కోసం ఉద్దేశించిన శారీరిక ప్రమాణాల లో దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సముచిత సడలింపు ను కూడా ఇవ్వనుంది.
సిఆర్ పిఎఫ్ అనేది కేంద్రీయ సాయుధ రక్షక భట బలగాల లో ఒకటి గా ఉంది. మౌలికం గా ఇది చట్టం మరియు వ్యవస్థ యొక్క నిర్వహణ వంటి కర్తవ్యాల ను పాలించడం తో పాటు గా, చొరబాటు ను నిరోధించడం మరియు ఆంతరంగిక భద్రత ను సంబాళించడం చేస్తుంది. ప్రతిపాదిత వ్యవహారం లో, సిఆర్ పిఎఫ్ 400 మంది స్థానిక ఆదివాసీ యువత ను ఛత్తీస్ గఢ్ లో సాపేక్షం గా వెనుబడిన ప్రాంతాల నుంచి కానిస్టేబుల్స్ (సాధారణ విధి) ఉద్యోగాల లోకి భర్తీ చేసుకోవాలనుకొంది. వారి ని నిర్దేశిత కనీస విద్యార్హత అయినటువంటి 10వ తరగతి లో ఉత్తీర్ణత సాధించిన తరువాతనే సర్వీసు లో ఖాయపరచడం జరుగుతుంది. తద్వారా ఈ అభ్యర్థుల కు అర్హత నిర్ణయ కాలం లో లాంఛనప్రాయమైన విద్య ను బోధించడం తో పాటుగా అధ్యయన సామగ్రి ని, పుస్తకాల ను మరియు కోచింగ్ సంబంధి సహాయాన్ని అందించడం వంటి సాధ్యమైన అన్ని విధాలు గాను సమర్థన ను ఇవ్వడం జరుగుతుంది. కొత్త గా భర్తీ అయిన వారు నిర్ణీత విద్యార్హత ను సాధఇంచడం కోసం అవసరమైతే, అర్హత నిర్ణయ కాలాన్ని తగిన మేర కుపొడిగించేందుకూ అవకాశం ఉంది. వారు 10వ తరగతి పరీక్ష కు హాజరు అయ్యేలా, వారి ని కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందినటువంటి నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ లో నమోదు చేయడం జరుగుతుంది.
సిఆర్ పిఎఫ్ 2016-2017 లో ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్, దంతెవాడ, నారాయణపుర్, ఇంకా సుక్ మా.. ఈ నాలుగు జిల్లాల నుంచి షెడ్యూల్డు తెగ కు చెందిన అభ్యర్థుల ను భర్తీ చేసుకోవడం ద్వారా ఒక బస్తరియా పటాలాన్ని ఏర్పాటు చేసింది. ఏమైనా, అది ఆశించినటువంటి ఫలితాల ను ఇవ్వలేక పోయింది. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతాల కు చెందిన స్థానిక యువత అవసరమైన విద్యార్హత ను, అంటే ఇక్కడ 10వ తరగతి లో ఉత్తీర్ణత ను, సాధించలేకపోవడం వల్ల నియామక ప్రక్రియ లో పోటీ పడలేకపోయారు.
***
(Release ID: 1830155)
Visitor Counter : 182