ఆర్థిక మంత్రిత్వ శాఖ
మొత్తం ఇప్పటివరకు (మే 31, 2022) వరకు చెల్లించాల్సిన మొత్తం జిఎస్టీ పరిహారాన్ని విడుదల చేసిన కేంద్రం
Posted On:
31 MAY 2022 5:08PM by PIB Hyderabad
రూ.86,912 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం ద్వారా 31 మే, 2022 వరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తం జిఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రాలు తమ వనరుల నిర్వహణలో మరియు ఆర్థిక సంవత్సరంలో తమ కార్యక్రమాలను ముఖ్యంగా మూలధన వ్యయం విజయవంతంగా నిర్వహించడంలో సహాయపడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు జీఎస్టీ పరిహార నిధిలో దాదాపు రూ.25,000 కోట్లు మాత్రమే ఉన్నప్పటికి, సెస్ వసూలు పెండింగ్‌లో ఉన్న తన సొంత వనరుల నుండి మిగిలిన మొత్తాన్ని కేంద్రం విడుదల చేస్తోంది.
వస్తు సేవల పన్ను దేశంలో జూలై, 2017న కేంద్రం ప్రవేశపెట్టబడింది. ఐదేళ్ల కాలానికి జిఎస్టీ (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 లో నిబంధనల ప్రకారం జిఎస్టీని అమలు చేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా రాబడికి నష్టపరిహారం కోసం రాష్ట్రాలకు హామీ కేంద్రం. రాష్ట్రాలకు పరిహారం అందించడం కోసం, నిర్దిష్ట వస్తువులపై సెస్ విధిస్తున్నారు. సేకరించిన సెస్ మొత్తాన్ని పరిహార నిధికి జమ చేస్తున్నారు. రాష్ట్రాలకు పరిహారాన్ని పరిహార నిధి 1 జూలై, 2017 నుండి చెల్లిస్తున్నారు.
2017-18, 2018-19 కాలానికి రాష్ట్రాలకు ద్వైమాసిక జిఎస్టీ పరిహారం కంపెన్సషన్ ఫండ్ నుండి సకాలంలో విడుదల చేశారు. రాష్ట్రాల రక్షిత ఆదాయం 14% సమ్మిళిత వృద్ధితో పెరుగుతోంది, అయితే సెస్ సేకరణ అదే నిష్పత్తిలో పెరగలేదు, కోవిడ్-19 రక్షిత రాబడి,సెస్ సేకరణలో తగ్గింపుతో సహా వాస్తవ ఆదాయ రశీదు మధ్య అంతరాన్ని మరింత పెంచింది.
నష్టపరిహారం తక్కువగా విడుదల చేయడం వల్ల రాష్ట్రాల వనరుల అంతరాన్ని పూడ్చేందుకు, సెస్ వసూలు లోటులో కొంత భాగం కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు అప్పుగా తీసుకుని విడుదల చేసింది. పై నిర్ణయానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. అదనంగా, కొరతను తీర్చడానికి కేంద్రం ఫండ్ నుండి రెగ్యులర్ జిఎస్‌టి పరిహారాన్ని కూడా విడుదల చేస్తోంది.
కేంద్రం, రాష్ట్రాల సమిష్టి ప్రయత్నాలతో, సెస్‌తో సహా స్థూల నెలవారీ జిఎస్టీ వసూళ్లు చెప్పుకోదగ్గ పురోగతిని చూపుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరాలకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే కాలానికి చెల్లించాల్సిన జిఎస్టీ పరిహారం వివరాలు క్రింది పట్టిక ప్రకారం విడుదలయ్యాయి : -
(i)
|
ఏప్రిల్ మరియు మే నెలల బకాయిలు, 2022
|
రూ. 17,973 కోట్లు
|
(ii)
|
ఫిబ్రవరి మరియు మార్చి, 2022 నెలల బకాయిలు
|
రూ. 21,322 కోట్లు
|
(iii)
|
జనవరి 2022 వరకు చెల్లించాల్సిన పరిహారం
|
రూ.47,617 కోట్లు
|
|
మొత్తం
|
రూ. 86,912 కోట్లు *
|
*రాష్ట్రాల వారీ వివరాలు వేరే పొందుపరిచారు
ఈ విడుదలతో రూ. 86,912 కోట్లు, మే 2022 వరకు రాష్ట్రాలకు పరిహారం పూర్తిగా చెల్లించినట్టు. జూన్ 2022కి పరిహారం మాత్రమే మిగిలి ఉంటుంది.
రాష్ట్రాల వారీగా వివరాలు (రూ. కోట్లలో )
వ. సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
విడుదలైన నిధులు
|
(1)
|
(2)
|
(3)
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
3199
|
2
|
అస్సాం
|
232
|
3
|
ఛత్తీస్గఢ్
|
1434
|
4
|
ఢిల్లీ
|
8012
|
5
|
గోవా
|
1291
|
6
|
గుజరాత్
|
3364
|
7
|
హర్యానా
|
1325
|
8
|
హిమాచల్ ప్రదేశ్
|
838
|
9
|
ఝార్ఖండ్
|
1385
|
10
|
కర్ణాటక
|
8633
|
11
|
కేరళ
|
5693
|
12
|
మధ్యప్రదేశ్
|
3120
|
13
|
మహారాష్ట్ర
|
14145
|
14
|
పుదుచ్చేరి
|
576
|
15
|
పంజాబ్
|
5890
|
16
|
రాజస్థాన్
|
963
|
17
|
తమిళనాడు
|
9602
|
18
|
తెలంగాణ
|
296
|
19
|
ఉత్తరప్రదేశ్
|
8874
|
20
|
ఉత్తరాఖండ్
|
1449
|
21
|
పశ్చిమ బెంగాల్
|
6591
|
|
మొత్తం
|
86912
|
****
(Release ID: 1830112)
Visitor Counter : 190