ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కెకె అనే పేరు తో ప్రజాదరణ కు పాత్రుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నాథ్మృతి కి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2022 12:30AM by PIB Hyderabad

కెకె అనే పేరు తో ప్రజాదరణ కు పాత్రుడైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నాథ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆయన పాడిన పాట లు అన్ని వయోవర్గాల కు చెందిన ప్రజల భావన ల తాలూకు ఒక విస్తృత శ్రేణి ని ప్రతిబింబిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కెకె పేరు తో ప్రజాదరణ కు పాత్రుడు అయినటువంటి ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నాథ్ అకాలిక మృతి వల్ల దుఃఖిస్తున్నాను. ఆయన పాడిన పాట లు అన్ని వయోవర్గాల ప్రజల భావనల తాలూకు ఒక విస్తృత శ్రేణి ని ప్రతిబింబించాయి. మనం ఆయన ను ఆయన యొక్క పాట ల మాధ్యమం ద్వారా ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటాం. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/ST

 

 


(రిలీజ్ ఐడి: 1830015) సందర్శకుల సూచీ సంఖ్య : : 201
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam