రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పిఎంబిజేపి) అమలు చేసే ఏజెన్సీ అయిన ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ) తొలిసారిగా మే, 2022 నెలలో రూ. 100 కోట్ల అమ్మకాలు జరిపింది


మార్చి 2024 నాటికి జనఔషధి కేంద్రాల సంఖ్యను 10,000కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గత ఐదేళ్లలో ఈ పరియోజన కింద సాధారణ ప్రజలకు రూ.15,000 కోట్లకు పైగా ప్రయోజనం కలిగింది.

Posted On: 31 MAY 2022 1:59PM by PIB Hyderabad

సామాన్యులకు ముఖ్యంగా పేదలకు అందుబాటు ధరలో నాణ్యమైన మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్చి 2024 నాటికి ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల (పిఎంబిజెకె) సంఖ్యను 10,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 31.05.2022 నాటికి స్టోర్‌ల సంఖ్య 8,735కి పెరిగింది. పిఎంబీజేపీ కింద దేశంలోని 739 జిల్లాలు కవర్ చేయబడ్డాయి.


image.png
పిఎంబిజెకెల్లో అవసరమైన ఔషధాల నిరంతరాయ లభ్యతను నిర్ధారించడానికి పిఎంబిఐ కట్టుబడి ఉంది.  2014-15 సంవత్సరంలో రూ. 8 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ప్రయాణం ప్రారంభించిన పిఎంబిఐ..మే, 2022 నెలలో తన అత్యధిక నెలవారీ అమ్మకాల టర్నోవర్‌ రూ.100 కోట్లు సాధించింది. తద్వారా దేశంలో ప్రజలు రూ.600 కోట్లను ఆదా చేసుకోగలిగారు.  మే, 2021లో మొత్తం అమ్మకాలు రూ. 83.77 కోట్లు మరియు అది కొవిడ్-19 రెండవ వేవ్ పీరియడ్. ఈ ఉదాత్తమైన పథకంతో ప్రభుత్వ జోక్యంతో ప్రజలు తమ జేబులో మందుల ఖర్చును తగ్గించుకోగలిగారు. ప్రస్తుతం, ఈ కేంద్రాలు న్యూట్రాస్యూటికల్స్, ఆయుష్ ఉత్పత్తులు మరియు ఒక్కో ప్యాడ్‌ రూ.1/ విలువ కలిగిన సువిధ శానిటరీ ప్యాడ్‌లతో సహా 1600 కంటే ఎక్కువ మందులు మరియు 250 సర్జికల్ పరికరాలను అందుబాటులో ఉంచుతున్నాయి.

పిఎంబిజెపి కింద దేశంలోని ప్రతి పౌరుడికి జన్ ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించడానికి 406 జిల్లాల్లోని 3579 బ్లాక్‌లను కవర్ చేయడానికి కొత్త దరఖాస్తులు కూడా ఆహ్వానించబడ్డాయి. చిన్న పట్టణాలు మరియు బ్లాక్‌ల ప్రధాన కార్యాలయాల నివాసితులు ఇప్పుడు జన్ ఔషధి కేంద్రాలను తెరవడానికి అవకాశాన్ని పొందవచ్చు. ఈ పథకం ప్రోత్సాహకంగా రూ. 5.00 లక్షలు మరియు ప్రత్యేక ప్రోత్సాహకాలు  మహిళలు, ఎస్సీ/ఎస్టీ, హిల్ జిల్లాలు, ద్వీప జిల్లాలు మరియు ఈశాన్య రాష్ట్రాలతో సహా వివిధ వర్గాలకు రూ2.00 లక్షలు అందించబడుతుంది. ఇది దేశంలోని ప్రతి మూలలో ప్రజలకు సరసమైన వైద్యం సులభంగా చేరేలా చేస్తుంది.

దీని ప్రకారం పిఎంబిఐ  గురుగ్రామ్, చెన్నై, గౌహతి మరియు సూరత్‌లలో నాలుగు గిడ్డంగులను ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా గొలుసు వ్యవస్థను బలోపేతం చేసింది. అదనంగా, భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో సకాలంలో సరఫరాలను నిర్ధారించడానికి భారతదేశం అంతటా 39 పంపిణీదారులతో బలమైన పంపిణీదారుల నెట్‌వర్క్ ఉంది.


 

****



(Release ID: 1829934) Visitor Counter : 165