ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విశేష వారోత్సవాలకు సన్నాహాలు మెదలు!


పత్రికా సమావేశంతో ఆర్థిక,
కార్పొరేట్ వ్యవహారాల శాఖల శ్రీకారం

‘మీకు ధన్యవాదాలు’ (షుక్రియా) పేరిట
కోవిడ్ వీరులపై గేయం ఆవిష్కరణ

Posted On: 30 MAY 2022 2:47PM by PIB Hyderabad

  75ఏళ్ల స్వాతంత్ర్య సంబరం,-..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎ.కె.ఎ.ఎం.) వేడుకల్లో భాగంగా 2022 జూన్ 6నుంచి 11వ తేదీవరకూ తాము నిర్వహించే విశేష వారోత్సవాలకు సన్నాహంహా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించాయి. పత్రికా సమాచార విభాగం నేషనల్ మీడియా సెంటర్ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం జరిగింది.

 

  భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్బాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 మార్చి 12వ తేదీన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను లాంఛనంగా ప్రకటించారు. 2021నుంచి ఆగస్టు 15నుంచి 2022 ఆగస్టు 2022వరకూ ఏడాది పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. 75వ భారత స్వాతంత్ర్య వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో భాగంగా, మీకు ధన్యవాదాలు (థ్యాంక్యూ-షుక్రియా) అన్న శీర్షికన ఒక గేయాన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందిన సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ముందుకు సాగేలా తోడ్పడుతూ కోవిడ్-19పై పోరాటం సాగించిన వీరులను ప్రశంసిస్తూ ఈ గేయాన్ని రూపొందించారు.

 

  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకూ  సాధించిన విజయాలను, చేపట్టబోయే కొత్త కార్యక్రమాలను వివరిస్తూ వారోత్సవాల్లో ప్రదర్శించబోయే కార్యక్రమాల వివరాలతో రూపొందించిన ఈ-బుక్‌ను కూడా ఈ సందర్భంగా వెలువరించారు. రాబోయే సంవత్సరాల్లో రెండు మంత్రిత్వ శాఖలూ సాగించనున్న అభివృద్ధి పయనాన్ని కూడా ఈ-బుక్ వివరిస్తుంది.  కార్యక్రమాల షెడ్యూల్‌ను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

  విశేష వారోత్సవంలో భాగంగా 2022 జూన్ 6వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో  జరగనున్న ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారు. 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలకు ప్రతీకగా ఈ ప్రారంభోత్సవాన్ని దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ప్రత్యక్షంగా నిర్వహిస్తారు.

   ఆజాదీకా అమృత్ మహోత్సవ్ విశేష వారోత్సవంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విభాగాలు తమ సుసంపన్నమైన చరిత్రను, వారసత్వాన్ని, రానున్న సవాళ్ళను ఎదుర్కొనే సన్నద్ధతను గురించి వివరిస్తాయి. ఉదాహరణకు, భారతదేశంలో సెక్యూరిటీల మార్కెట్ పరిణామాల గురించిన డాక్యుమెంటరీ కార్యక్రమాన్ని వారోత్సవాల్లో 3వ రోజున, అంటే జూన్ 8వ తేదీన నిర్వహిస్తారు. అలాగే, చివరి రోజున అంటే జూన్ 11వ తేదీన ధారోహర్ పేరిట జాతీయ కస్టమ్స్, జి.ఎస్.టి. మ్యూజియం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణా సరుకులను, పురాతన కళాఖండాలను, కస్టమ్స్ వారసత్వ సంపదను ప్రదర్శించి జాతికి అంకితం చేస్తారు.

  విశేష వారోత్సవాల సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రత్వ శాఖలు మరిన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నాయి. ప్రభుత్వ సేకరణ ప్రక్రియలో డాటా అనలిటిక్స్ పాత్ర అన్న అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తారు. ప్రభుత్వ సేకరణ ప్రక్రియలో చేపట్టాల్సిన ఉత్తమ అంతర్జాతీయ విధానాలు, డబ్బుకు మరింత విలువను జోడించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత తీర్చిదిద్దవలసిన అవసరం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చ జరుపుతారు. అలాగే,  ప్రభత్వ వ్యయ నిర్వహణ, ప్రత్యక్ష-పరోక్ష పన్నుల విధింపు తదితర అంశాలపై కూడా చర్చిస్తారు.  

   కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల విశేష వారోత్సవ ప్రారంభానికి కేంద్ర ఆర్థిక, వ్యయ వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కేంద్ర పెట్టుబడుల, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (డి.ఐ.పి.ఎ.ఎం.) కార్యదర్శి తుహిన్ కాంతా పాండే; కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథి; కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  రాజేశ్ వర్మ; కేంద్ర ప్రభుత్వ సంస్థల శాఖ కార్యదర్శి అలీ రజా రిజ్వీ; కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా; కేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్స్ బోర్డు (సి.బి.ఐ.సి.) చైర్‌పర్సన్ వివేక్ జోహ్రి, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సి.బి.డి.టి.) చైర్‌పర్సన్ (అదనపు బాధ్యత) సంగీతా సింగ్, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఉన్నారు.

 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు సంబంధించి విశేష వారోత్సవాలకోసం ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖల ఈ-బుక్‌లెట్:

 

పి.ఐ.బి. ఇండియా(PIB_India)పై పత్రికా సమావేశాన్ని వీక్షించండి:

 

  దిగువన 11 భాషల్లో ఉన్న థ్యాంక్యూ మ్యూజిక్/వీడియోను గమనించండి. (అస్సామీ, బంగ్లా, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు):

 

***

 

 


(Release ID: 1829586) Visitor Counter : 214