నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పీఎం -కుసుమ్ పథకం గురించి సాధారణ ప్రజలకు సూచన జారీ చేసిన ఎంఎన్ఆర్ఈ
Posted On:
27 MAY 2022 1:26PM by PIB Hyderabad
నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్) పథకాన్ని అమలు చేస్తోంది, ఈ పథకం కింద స్వతంత్ర సోలార్ పంపుల ఏర్పాటుకు మరియు వ్యవసాయ పంపుల సోలారైజేషన్ కోసం సబ్సిడీ అందించబడుతుంది. రైతులు రెండు మెగావాట్ల వరకు గ్రిడ్-కనెక్ట్ చేయబడిన సోలార్ పవర్ ప్లాంట్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నియమించబడిన ఆయా శాఖలచే అమలు చేయబడుతోంది. ఇలా నియమించబడిన విభాగాల వివరాలు ఎంఎన్ఆర్ఈ వెబ్‌సైట్ www.mnre.gov.inలో అందుబాటులో ఉన్నాయి. పథకం ప్రారంభించిన తర్వాత, కొన్ని మోసపూరిత వెబ్‌సైట్‌లు పీఎం-కుíసుమ్ పథకం కోసం తాము రిజిస్ట్రేషన్ పోర్టల్‌గా పేర్కొంటున్నట్టుగా మంత్రిత్వ శాఖ గమనించింది. ఇటువంటి అనధికార వెబ్‌సైట్‌లు పథకంపై ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి డబ్బు మరియు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు, ఎంఎన్ఆర్ఈ గతంలో పబ్లిక్ నోటీసులు జారీ చేసింది, ఇలాంటి మోసపూరితమైన వెబ్‌సైట్‌లలో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును జమ చేయవద్దని లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సాధారణ ప్రజలకు సూచించింది. ఇలాంటి ఫిర్యాదుల స్వీకరించి, అక్రమార్కులపై కూడా చర్యలు తీసుకున్నారు. అనేక నకిలీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లను బ్లాక్ చేశారు. ఇలాంటి మోసపూరిత వెబ్‌సైట్‌లతో పాటు, సంభావ్య లబ్ధిదారులను తప్పుదారి పట్టించడానికి వాట్సాప్, ఇతర మార్గాలను కూడా ఉపయోగిస్తున్నారు. అందువల్ల, పీఎం-కుసుమ్ స్కీమ్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని అందించడానికి లేదా డబ్బు డిపాజిట్ చేయడానికి ముందు వెబ్‌సైట్ యొక్క ప్రామాణికతను తనిఖీ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ గట్టిగా సూచించింది. పీఎం-కుసుమ్ స్కీమ్ కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్ అని క్లెయిమ్ చేసే వాట్సాప్/ ఎస్ఎంఎస్ ద్వారా స్వీకరించబడిన ఏదైనా ధ్రువీకరించని లేదా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దని మంత్రిత్వ శాఖ ఇంకా సూచించింది. ఈ మేటి పథకంలో పాల్గొనడానికి అర్హత, అమలు ప్రక్రియకు సంబంధించిన సమాచారం ఎంఎన్ఆర్ఈ, వెబ్‌సైట్ http://www.mnre.gov.in లేదా పీఎం-కుసుమ్ సెంట్రల్ పోర్టల్ https://pmkusum.mnre.gov.inలో అందుబాటులో ఉంది: లేదా టోల్-ఫ్రీ సంఖ్య 1800-180-3333కు డయల్ చేయండి
***
(Release ID: 1828922)
Visitor Counter : 240