ఆయుష్
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్ సందర్భంగా హైదరాబాద్ లో వేలాది మంది తో యోగా ఉత్సవ్


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 24 గంటల పాటు అన్ని యోగా వేడుకలను సుదూర తూర్పు నుండి సుదూర పశ్చిమానికి తీసుకురావడానికి గార్డియన్ రింగ్ - రిలే యోగా స్ట్రీమింగ్ ఈవెంట్ -

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారతదేశంలోని 75 ప్రముఖ ప్రదేశాలలో జరిగి రన్ అప్ యోగా ఉత్సవ్ లలో 25 కోట్ల మందికి పైగా ఔత్సాహికులు

యోగా ప్రధాన విజయాలు , వివిధ అంశాలను ప్రముఖంగా ప్రదర్శించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మైసూరులో ‘డిజిటల్ యోగా ఎగ్జిబిషన్’

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2022 12:21PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై 2022)కు 25 రోజుల కౌంట్ డౌన్ ను పురస్కరించుకుని అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ఈ రోజు హైదరాబాద్ లో  యోగా ఉత్సవ్ లో పాల్గొన్నారు. తెలంగాణ

ప్రభుత్వ క్రియాశీల సహకారం తో భారత

ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ

కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌,  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య  ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి; ఆయుష్ , డబ్లూ సి డి శాఖల సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్; తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య ,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మీ జీవితంలో యోగాను భాగం చేసుకోండి.’ అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎం డి ఎన్ ఐ వై) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది, ఇందులో 10,000 మందికి పైగా యోగా ఔత్సాహికులు కామన్ యోగా ప్రోటోకాల్ (సి వై పి ) ప్రదర్శించారు.ఈ సెషన్ కు ఎండీఎన్ ఐవై డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి.బసవరాడ్డి దర్శకత్వం వహించారు. యోగా లోని వివిధ కోణాలు , మానవ జీవితాలను సుసంపన్నం చేసే దాని సామర్థ్యం గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి" అనే ఇతివృత్తం తో కూడిన ఈ ఉత్సవ్ కు క్రీడలు, సినిమా,  సాంస్కృతిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై ఇతర యోగా ఔత్సాహికులతో కలిసి సివైపిని ప్రదర్శించారు.

 

ఈ సందర్భంగా శ్రీ శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మన సుసంపన్న మైన వారసత్వాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఇది మన ఆరోగ్యాన్ని, మనస్సును వికసింప చేస్తుందని అన్నారు.

జూన్ 21న మైసూరులో జరిగే 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈరోజు కౌంట్ డౌన్ ఉత్సవం విజయవంతం కావడం మరింత ఊపునిస్తుందని, అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు, అభ్యాసకులు యోగాను విస్తృతంగా నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు.ఈ యోగా ఉత్సవ్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మన వేల సంవత్సరాల నాగరికత అందించిన అద్భుతమైన బహుమతి యోగాను స్వీకరించేలా ప్రజలను

ప్రోత్సహించడమని, , తద్వారా వారు వారి జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చునని కేంద్ర మంత్రి అన్నారు.

 

"గార్డియన్ రింగ్" అని పిలువబడే మరొక ప్రధాన ఆకర్షణను శ్రీ సోనోవాల్ ప్రకటించారు, దీని ద్వారా యోగా దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా జరిగే యోగా వేడుకలు ఆ రోజు అంతటా ప్రసారం చేయబడతాయి.ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విదేశాల్లోని మిషన్లు యోగా కార్యకలాపాలను నిర్వహిస్తాయి. గార్డియన్ రింగ్ వివిధ మిషన్‌ల నుండి ఫీడ్‌ని కలిపి స్ట్రింగ్ చేస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు సూర్యోదయ భూమి అయిన జపాన్ నుండి స్ట్రీమింగ్ మొదలవుతుంది.ఆపై, పశ్చిమం వైపు కదులుతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు, ఇతర దేశాల నుండి ప్రసారం అవుతుంది. డీడీ ఇండియాలో ఇది ప్రత్యక్ష ప్రసారమవుతుంది. "ది గార్డియన్ రింగ్" "ఒక సూర్యుడు, ఒక భూమి" భావనను ఆవిష్కరిస్తుంది. యోగా ఏకీకరణ శక్తిని ప్రదర్శిస్తుంది.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారతదేశం అంతటా 75 ప్రముఖ ప్రదేశాలలో రన్ అప్ ఈవెంట్‌ గా జరిగే ఈ యోగా ఉత్సవ్‌లలో దాదాపు 25 కోట్ల మందికి పైగా పాల్గొంటారని మంత్రి తెలిపారు.

యోగా ఉత్సవ్ ను ఐదు పురావస్తు ప్రదేశాలలో -రాఖీగారి (హర్యానా), హస్తినాపూర్ (ఉత్తర ప్రదేశ్), శివసాగర్ (అస్సాం), ధోలవీర (గుజరాత్) ఆదిచనల్లూర్ (తమిళనాడు)-  లో కూడా నిర్వహించారు. ఇవి భారతదేశం లో "ఐకానిక్" సైట్‌లుగా గుర్తింపు పొందాయి. ఐ డి వై 2022కి 100 రోజుల కౌంట్‌డౌన్ గుర్తుగా కర్టెన్ రైజర్ ఈవెంట్ మార్చి 13న జరుపుకోగా, ఢిల్లీలోని ఎర్రకోటలో 75 రోజుల కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించబడింది. దీని తర్వాత మే 2, 2022న అస్సాం శివసాగర్‌లోని శివ దౌల్ ఆలయ సముదాయంలో 50 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమం జరిగింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో జరగనున్నాయి, అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ సామూహిక యోగా ప్రదర్శనకు నాయకత్వం వహిస్తారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం మునుపటి ఎడిషన్‌ల ముఖ్యాంశాలు , విజయాలను ప్రదర్శించడానికి మైసూరులో డిజిటల్ యోగా ప్రదర్శనను కూడా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.ఎగ్జిబిషన్‌లో యోగా బలం, ఉత్తమ అభ్యాసం, పరిశోధన ముఖ్యాంశాలు, సాధారణ యోగా ప్రోటోకాల్ మొదలైనవి కూడా ఉంటాయి.

 

ప్రపంచవ్యాప్తంగా యోగా సందేశాన్ని విస్తృత జనావళికి తీసుకెళ్లడానికి మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎనిమిదవ  ఎడిషన్‌ ఊరించి  అనేక కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా భారతదేశ బ్రాండ్‌కు పునరుజ్జీవం కల్పించడానికి యోగా ఉత్సవ్‌ను చారిత్రక ప్రాముఖ్యత కలిగిన 75 వారసత్వ ప్రదేశాలలో జరుపుకుంటున్నారు.యోగా ద్వారా వెల్నెస్ దిశగా సాగే ఈ ఉద్యమాన్ని గొప్ప విజయవంతం  చేసేందుకు ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, రక్షణ దళాలు , ఇతర యూనిఫాం సేవా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

 

ఈ ఉద్యమం పరిధిలోకి ప్రతి ఒక్కరినీ తీసుకురావడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలతో మమేకం అవుతోంది. ఇది ఉద్యమాన్ని పట్టణ ప్రాంతాలను దాటి భారతదేశ నడి మధ్యకు తీసుకెళ్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి మరింత ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

 

****


(రిలీజ్ ఐడి: 1828919) సందర్శకుల సూచీ సంఖ్య : : 187
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Tamil , Malayalam