ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది

Posted On: 24 MAY 2022 2:23PM by PIB Hyderabad

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది ఈరోజు టోక్యో లో సమావేశం అయ్యారు. సామరస్యపూర్వక వాతావరణంలో ఇద్దరు నాయకుల మథ్య చర్చలు జరిగాయి. రెండు దేశాలకు సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశం రెండు దేశాల మద్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విథంగా జరిగాయి. 2021 సెప్టెంబర్ లో వాషింగ్టన్ లో ఇద్దరు నాయకులు చివరసారి వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. ఆ తరువాత ఇద్దరు నాయకుల మద్య జి 20, కాప్ 26 సదస్సులో చర్చలు జరిగాయి. 2022 ఏప్రిల్ 11 న వీరిద్దరి మద్య వర్చువల్ విధానంలో చర్చలు జరిగాయి. భారతదేశం, అమెరికా దేశాల మద్య సంబంధాలు ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, చట్ట నియమాలు, నిబంధనల అమలు, అంతర్జాతీయ నిబంధనల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ అమలు జరుగుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు అమలు జరుగుతున్న తీరు పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందంపై సంతకాలు జరగడం పట్ల బైడన్,మోది హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, ఎస్ఎంఈ, మౌలిక సదుపాయాల రంగాల్లో అమెరికా డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టుబడులు పెడుతుంది. ఇరుదేశాలు కీలకమైన, కొత్తగా అభివృద్థి చెందుతున్న సాంకేతిక అంశాలపై కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఈ రంగంలో మరింత సహకారంతో పని చేసేందుకు గల అవకాశాలను అన్వేషించాలని కూడా రెండు దేశాలు నిర్ణయించాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ (స్వయం సమృద్ధ భారత్) కార్యక్రమాల్లో పాల్గొని పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామిక వర్గాలకు ప్రధానమంత్రి విజ్ఙప్తి చేశారు. దీనివల్ల రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయని అన్నారు.

ఆరోగ్య రంగంలో సహకారాన్ని కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి.  వాక్సిన్ అభివృద్థి, సంబంధిత రంగాలపై కుదిరిన ఒప్పందాన్ని 2027 వరకు కొనసాగించి బయో మెడికల్ రంగంలో సంయుక్త పరిశోధన లు చేపట్టే అంశంపై కూడా రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది. 

రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా చూసేందుకు ఉన్నత విద్యారంగ అభివృద్థి కి సహకారం అందించాలని ప్రధానమంత్రి కోరారు. దీనివల్ల రెండు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి అన్నారు. 

దక్షిణ ఆసియా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ అంశాలపై నాయకులు అభిప్రాయాలను అందజేసుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛగా అందిరికి అందుబాటులో ఉండాలన్న రెండు దేశాల అభిప్రాయాన్ని నాయకులు పునరుధ్ఘాటించారు.

ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రోస్పరిటీ ప్రారంభం కావడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని భాగస్వామ్య దేశాల తో కలిసి భారతదేశం పని చేస్తుందని హామీ ఇచ్చారు. 

భారత్- అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అయ్యేలా చూసేందుకు చర్యలు కొనసాగించాలని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చారు.

***

 (Release ID: 1828110) Visitor Counter : 46