వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అన్యాయ, అసమంజస వాణిజ్య పద్ధతుల్లో Ola, Uber  సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ- CCPA.
                    
                    
                        
కేంద్రీయ వినియోగదారుల పరిరక్షణ సంస్థ- CCPA లేవనెత్తిన ప్రధాన సమస్యలు: సరైన వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం లేకపోవడం, సేవలో లోపం, రద్దు ఛార్జీల అసమంజసమైన విధింపు,  ఇంకా ఛార్జీలను వసూలు చేయడానికి ఉపయోగించే పద్ధతులు- న్యాయబద్ధత.
 
CCPA -చెల్లుబాటు అయ్యే ISI గుర్తు లేకుండా వస్తువులను కొనుగోలు చేయడం, నిర్బంధ BIS ప్రమాణాలను ఉల్లంఘించడం వంటి వాటి పట్ల వినియోగదారులను అప్రమత్తం చేయడానికి,  హెచ్చరించడానికి భద్రతా నోటీసుల జారీ చేసే అధికార సంస్థ.
                    
                
                
                    Posted On:
                20 MAY 2022 4:04PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) అసమంజస వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన నివారణ కోసం రెండు ఆన్‌లైన్ రైడ్   అప్లికేషన్ ఇంటర్ఫేస్ లో లైన Ola, Uber లకు నోటీసులు జారీ చేసింది.
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) నుంచి అందిన సమాచారం ప్రకారం, 01.04.2021 నుంచి 01.05.2022 వరకు, వినియోగదారులు Olaకి వ్యతిరేకంగా 2,482 ఫిర్యాదులు, Uber కి వ్యతిరేకంగా 770 ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
గత వారం, 2019, ఇ-కామర్స్ నియమాల ప్రకారం రైడ్-హెయిలింగ్ కంపెనీలైన ఓలా, ఉబెర్, రాపిడో, మేరుక్యాబ్స్, జుగ్నూతో జరిగిన సమావేశంలో వినియోగదారులకు మెరుగైన ఫిర్యాదుల పరిష్కారాన్ని,  వినియోగదారుల రక్షణ చట్టానికి లోబడి ఉండేలా, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌లో కన్వర్జెన్స్ భాగస్వామిగా మారాలని సిసిపిఎ-డిపార్ట్మెంట్ వారిని ఆదేశించింది..
వినియోగదారుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల పట్టిక సారాంశం క్రింది విధంగా ఉంది:-
	
		
			| సంస్థ –ఓలా కాబ్స్ (Ola Cabs) కాల వ్యవధి - 1 ఏప్రిల్ 2021 నుంచి 1 మే 2022 వరకు | 
		
			| సంఖ్య | సేవాలోపాల స్వభావం | నమోదైన చర్చించవలసిన అంశాలు జాబితా | % | 
		
			| 1 | సేవల్లో లోపం | 1340 | 54 | 
		
			| 2 | చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడలేదు | 521 | 21 | 
		
			| 3 | అనధికార ఛార్జీలు | 174 | 7 | 
		
			| 4 | MRP కంటే ఎక్కువ వసూలు చేయడం/ ఓవర్‌ఛార్జ్ చేయడం | 139 | 6 | 
		
			| 5 | వాగ్దానం చేసిన బహుమతి ఇవ్వబడలేదు/తప్పు వాగ్దానాలు | 62 | 2 | 
		
			| 6 | ఖాతా బ్లాక్ చేయబడింది/సేవ నిషేధించబడింది. | 50 | 2 | 
		
			| 7 | ఉత్పత్తి/సేవ డెలివరీలో జాప్యం చేయకపోవడం | 31 | 1 | 
		
			| 8 | మొత్తం డెబిట్ చేయబడింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ చేయలేదు. | 29 | 1 | 
		
			| 9 | మోసపూరిత సమస్య | 12 | 1.0 | 
		
			| 10 | ఇతరులు | 52 | 2 | 
		
			| 11 | సెక్టార్ విచారణ | 72 | 3 | 
		
			|   | సంపూర్ణ మొత్తం | 2482 | 100 | 
	
 
 
	
		
			| సంస్థ – ఉబర్ ఇండియా (Uber India)  కాల వ్యవధి - 1 ఏప్రిల్ 2021 నుంచి 1 మే 2022 వరకు | 
		
			| సంఖ్య | సేవా లోపాల స్వభావం |  నమోదైన చర్చించవలసిన అంశాలు | % | 
		
			| 1 | సేవల్లో లోపం | 473 | 61 | 
		
			| 2 | చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడలేదు | 105 | 14 | 
		
			| 3 | అనధికార ఛార్జీలు | 38 | 5 | 
		
			| 4 | MRP కంటే ఎక్కువ వసూలు చేస్తోంది. | 37 | 5 | 
		
			| 5 | వాగ్దానం చేసిన బహుమతి ఇవ్వబడలేదు/ తప్పు వాగ్దానాలు | 18 | 2 | 
		
			| 6 | ఉత్పత్తి డెలివరీలో జాప్యం కాదు | 17 | 2 | 
		
			| 7 | ఖాతా బ్లాక్ చేయబడింది/సేవ నిషేధించబడింది. | 14 | 2 | 
		
			| 8 | మోసపూరిత సమస్య | 11 | 1 | 
		
			| 9 | మొత్తం డెబిట్ చేయబడింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ చేయలేదు. | 7 | 1 | 
		
			| 10 | ఇతరులు | 20 | 3 | 
		
			| 11 | సెక్టార్ విచారణ | 30 | 4 | 
		
			|   | సంపూర్ణ మొత్తం | 770 | 100 | 
	
 
నోటీసులలో లేవనెత్తిన ప్రాథమిక అంశాలు: -
• కస్టమర్ సపోర్ట్ నుండి సరైన స్పందన లేకపోవడం, డ్రైవర్ ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లింపును తిరస్కరించడం, నగదు కోసం మాత్రమే పట్టుబట్టడం, గతంలో ఇదే మార్గంలో తక్కువ ఛార్జీతో వెళ్లినప్పటికీ ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం, వృత్తిపరమైన డ్రైవర్ ప్రవర్తన, డ్రైవర్ నిరాకరించడం యాప్‌లో AC రైడ్ చేస్తామని వినియోగదారుకు వాగ్దానం చేసినప్పుడు AC ఆన్ చేయాకపోవడం వంటి సేవాలోపాలు.
•   పేర్కొనడానికి అవసరమైన కస్టమర్ కేర్ నెంబర్, ఫిర్యాదు అధికారి వివరాలు రెండూ లేనప్పుడు ఏం చేయాలో పాలుపోని వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార విధానం.
• రైడ్‌ను రద్దు చేయడానికి అనుమతించబడిన సమయం మొత్తం వినియోగదారులకు చూపని కారణంగా రద్దు ఛార్జ్ అసమంజస విధింపు. రైడ్‌ను బుక్ చేసుకునే ముందు అప్లికేషన్ ఇంటర్ఫేస్ లో రద్దు ఛార్జీ మొత్తం ప్రముఖంగా ప్రదర్శించక పోవడం. డ్రైవర్ రైడ్‌ని అంగీకరించడానికి లేదా పికప్ లొకేషన్‌కు రావడానికి ఇష్టపడకపోవడం వల్ల రైడ్‌ను రద్దు చేయవలసి వచ్చినప్పుడు వినియోగదారులు అనవసరమైన రద్దు చార్జీలు భరించాల్సి వస్తుంది.
• ఇద్దరు వ్యక్తుల నుండి ఒకే రూట్‌కు వేర్వేరు ఛార్జీలను వసూలు చేయడానికి కంపెనీ ఉపయోగించే  పద్ధతి పై ఎలాంటి సమాచారం లేకపోవడం.
• ప్రతి రైడ్‌కు ముందు స్పష్టమైన, నిశ్చయాత్మక చర్య ద్వారా సమ్మతి పొందకుండానే యాడ్-ఆన్ సేవలు చేర్చడం కోసం ముందస్తుగా ఎంపిక చేసిన పెట్టెల ద్వారా యాడ్-ఆన్ సేవలకు ఛార్జీలను చేర్చడం.
 
రైడ్ హెయిలింగ్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ల ద్వారా బుక్ చేసుకున్న వారి రైడ్‌లను ప్రభావితం చేసే బహుళ సమస్యలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు గణనీయమైన సంఖ్యలో ఫిర్యాదు చేశారని పేర్కొనవచ్చు.
CCPA దేశంలో వినియోగదారుల రక్షణ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది. ఇటీవల, CCPA ఆన్‌లైన్ అప్లికేషన్ ఇంటర్ఫేస్  లో వైర్‌లెస్ జామర్‌ల అక్రమ విక్రయానికి వ్యతిరేకంగా నియమాలు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) రూల్స్, 2020లోని 6వ నిబంధనలోని సబ్-రూల్ (5) ప్రకారం అమ్మకందారుల వివరాలు  పేరు, సంప్రదింపు నంబర్‌తో సహా అన్ని మార్కెట్ ప్లేస్ ఇ-కామర్స్ సంస్థలకు CCPA కూడా ఒక విధానాన్ని జారీ చేసింది. ఫిర్యాదు అధికారి స్పష్టంగా, యాక్సెస్ చేయగల పద్ధతి అప్లికేషన్ ఇంటర్ఫేస్ లోని వినియోగదారులకు నియమాలు ప్రముఖంగా ప్రదర్శనమౌతుంది.
అంతేకాకుండా, చెల్లుబాటు అయ్యే ISI మార్క్ లేని తప్పనిసరి BIS ప్రమాణాలను ఉల్లంఘించే వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను అప్రమత్తం చేయడానికి, హెచ్చరించడానికి CCPA చట్టంలోని సెక్షన్ 18(2)(j) కింద భద్రతా నోటీసులు కూడా జారీ చేసింది. హెల్మెట్‌లు, ప్రెషర్ కుక్కర్లు, వంట గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి మొదటి సేఫ్టీ నోటీసు 06.12.2021న జారీ అయ్యింది. రెండవ సేఫ్టీ నోటీసు 16.12.2021న జారీ అయ్యింది, విద్యుత్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్‌లు, కుట్టు మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్‌లతో సహా గృహోపకరణాలకు సంబంధించి. LPG తో గృహ గ్యాస్ స్టవ్‌లు మొదలైనవి ఈ పరిధిలోకి వస్తాయి.
 
***
                
                
                
                
                
                (Release ID: 1828103)
                Visitor Counter : 220