ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి మే 26 వ తేదీ నాడు హైదరాబాద్ ను మరియు చెన్నై ను సందర్శించనున్నారు


తమిళ నాడు లో 31,400 కోట్ల రూపాయల కు పైగా విలువైన 11 ప్రాజెక్టుల లో కొన్నిటిని దేశ ప్రజలకు అంకితం చేయడం తో పాటు వాటి లో కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు

ఆయా ప్రాజెక్టు లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కి అండ గా నిలుస్తాయి; కనెక్టివిటీని పెంపొందింపచేస్తాయి మరియు ఆ ప్రాంతం లో జీవన సౌలభ్యాని కి ఉత్తేజాన్ని అందిస్తాయి

ఐఎస్ బి హైదరాబాద్ కు 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొనబోతున్నారు;  2022వ సంవత్సరం పిజిపి క్లాస్ గ్రాడ్యుయేట్సెరిమనీ ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు

Posted On: 24 MAY 2022 3:19PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీ నాడు హైదరాబాద్ ను మరియు చెన్నై ని సందర్శించనున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) హైదరాబాద్ కు 20 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా గురువారం మధ్యాహ్నం ఇంచుమించు 2 గంటల వేళ కు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు. 2022వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పిజిపి) కు సంబంధించిన గ్రాడ్యుయేట్ సెరిమని ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. 31,400 కోట్ల రూపాయల కు పైగా వ్యయం అయ్యే 11 ప్రాజెక్టుల లో కొన్నిటి ని ఇంచుమించు గా సాయంత్రం 5:45 గంటల కు చెన్నై లోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియమ్ లో ఏర్పాటైన ఓ కార్యక్రమం లో ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు.

చెన్నై లో ప్రధాన మంత్రి

మౌలిక సదుపాయాల అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశ లోను, సంధానాన్ని పెంపొందిస్తూను, మరి అదే విధం గా ఆ ప్రాంతం లో జీవన సౌలభ్యాని కి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటట్లుగాను రూపొందించినటువంటి 31,400 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 11 ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి చెన్నై లో శంకుస్థాపన చేయడం/దేశ ప్రజల కు అంకితం చేయడం చేస్తారు. ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో సామాజిక- ఆర్థిక సమృద్ధి ని చెప్పుకోదగిన రీతి లో మెరుగు పరచడం లో సహాయకారి అవుతాయి. అనేక రంగాల లో పరివర్తన పూర్వక ప్రభావాన్ని ప్రసరింపచేస్తాయి; అంతేకాక, ఉద్యోగావకాశాల ను కూడా ఏర్పరచడం లో కూడాను దోహదపడనున్నాయి.

చెన్నై లో, 2900 కోట్ల రూపాయల కు పైగా విలువైన అయిదు ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. 500 కోట్ల రూపాయల కు పైగా ప్రాజెక్టు వ్యయం తో నిర్మించిన 75 కి.మీ. పొడవైన మదురై - తేని (రైల్ వే గేజ్ కన్వర్శన్ ప్రాజెక్ట్) ఆ ప్రాంతం లో పర్యటన కు దన్ను గా ఉంటుంది. 590 కోట్ల రూపాయల కు పైగా ప్రాజెక్టు వ్యయం తో తాంబరమ్-చెంగల్ పట్టు ల మధ్య నిర్మించిన 30 30 కి.మీ. పొడవైన మూడో రైల్ వే లైను మరిన్ని సబ్ అర్బన్ సర్వీసుల ను నడపడాని కి తోడ్పడుతుంది. తద్ద్వారా ప్రయాణికుల కు మరిన్ని ఐచ్ఛికాలు అందుబాటులోకి వస్తాయి. వారికి సౌకర్యం కూడా పెరగనుంది.

ఇటిబిపిఎన్ఎమ్ టి సహజవాయు సరఫరా సంబంధి గొట్టపు మార్గం లో సుమారు 850 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తో నిర్మించిన 115 కిలో మీటర్ ల పొడవైన ఎణ్నూర్-చెంగల్ పట్టు సెక్షను ను మరియు 910 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తో నిర్మాణం జరిగిన 271 కిలో మీటర్ ల పొడవైన తిరువళ్ళూర్-బెంగళూరు సెక్షను లు తమిళ నాడు , కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో పరిశ్రమల కే కాక వినియోగదారుల కు కూడా ను సహజ వాయువు సరఫరా కు దోహదపడనుంది.

ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ లో భాగం గా, 116 కోట్ల రూపాయల వ్యయం తో లైట్ హౌస్ ప్రాజెక్టు-చెన్నై లో భాగం గా నిర్మాణం జరిగిన 1152 గృహాల కు ప్రారంభోత్సవం సైతం జరుగనుంది.

ప్రధాన మంత్రి 28,500 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మాణం జరిగే ఆరు ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు.

వీటి లో 262 కి.మీ. పొడవైన బెంగళూరు- చెన్నై ఎక్స్ ప్రెస్ వే ను 14,870 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు ల గుండా సాగుతుంది. ఇది బెంగళూరు కు మరియు చెన్నై కు మధ్య ప్రయాణ కాలాన్ని 2- 3 గంటల మేర కు తగ్గించడం లో సహాయకారి కానుంది. చెన్నై పోర్టు ను మదురవోయల్ తో (ఎన్ హెచ్-4) కలిపేందుకు ఉద్దేశించినటువంటి 4 దోవల డబల్ డెకర్ ఎలివేటెడ్ రోడ్డు ను 5850 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. దీని పొడవు దాదాపు గా 21 కిలో మీటర్ లు ఉంటుంది. ఈ రహదారి వల్ల సరకుల రవాణా వాహనాలు రోజు లో ఇరవై నాలుగు గంటలూ ఎటువంటి అంతరాయం లేకుండా చెన్నై పోర్టు కు చేరుకొంటూ ఉండేందుకు వెసలుబాటు కలుగుతుంది. సుమారు 3870 కోట్ల రూపాయ ల వ్యయం తో నిర్మాణం లో ఉన్న ఎన్ హెచ్-844 లోని 94 కి.మీ. పొడవైన 4 దోవ ల నెరలూరు టు ధర్మపురి సెక్శను మరియు సుమారు 720 కోట్ల రూపాయల వ్యయం తో ఎన్ హెచ్-227 లోని మీన్ సూరుట్టి టు చిదంబరమ్ సెక్శను తాలూకు పేవ్ డ్ శోల్డర్స్ ను కలిగివుండే 2 దోవ ల మార్గాలు ఆ ప్రాంతం లో నిరాఘాట సంధానాన్ని అందుబాటులోకి తీసుకురాగలుగుతాయి.

అయిదు రైల్ వే స్టేశన్ ల కు పునర్ వికాసానికి కూడా ఇదే కార్యక్రమం లో భాగం గా శంకు స్థాపన లు చేయనున్నారు. ఆ అయిదు రైల్ వే స్టేశన్ లు చెన్నై ఎగ్మూర్, రామేశ్వరం, మదురై, కాట్ పాడి, కన్యాకుమారి. ఈ ప్రాజెక్టు ను 1800 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రయాణికుల కు ఆధునిక సదుపాయాల ను సమకూర్చడం ద్వారా సౌకర్యాన్ని పెంపొందింపచేసే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు ను చేపట్టడం జరుగుతోంది.

చెన్నైలో 1400 కోట్ల రూపాయల కు పైగా విలువైన ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణాని కి కూడా ప్రధాన మంత్రి పునాదిరాయి వేయనున్నారు. ఇది సరకు రవాణా లో అంతరాయాల కు తావు ఉండని ఇంటర్ మోడల్ ఫ్రైట్ మూవ్ మెంట్ ను అందించడం తో పాటు గా బహుళ కార్య సాధకం గా రూపుదిద్దుకోబోతోంది.

హైదరాబాద్ లో ప్రధాన మంత్రి

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి), హైదరాబాద్ కు 20 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా ఏర్పాటైన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొననున్నారు. 2022వ సంవత్సర పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పిజిపి) తాలూకు గ్రాడ్యుయేట్ సెరిమని ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. ఐఎస్ బి ని 2001వ సంవత్సరం లో డిసెంబర్ 2వ తేదీ నాడు పూర్వ ప్రధాని శ్రీ. అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రారంభించారు. దేశం లోని అగ్రగామి బిజినెస్ స్కూల్స్ లో ఒకటి గా గుర్తింపు ను తెచ్చుకొన్న ఐఎస్ బి శిక్షణ ను ఇవ్వడం కోసం మరియు మానవ వనరుల సామర్ధ్యం నిర్మాణం పెంపుదల లో తోడ్పడడం కోసం ప్రభుత్వానికి చెందిన అనేక మంత్రిత్వ శాఖ ల, ప్రభుత్వ విభాగాల తో సమన్వయాన్ని ఏర్పరచుకొంది.

 

 

***


(Release ID: 1827991) Visitor Counter : 264