సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రండి, మీ సినిమాలను భారతదేశంలో చిత్రీకరించండి: కేన్స్‌లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్

Posted On: 23 MAY 2022 6:07PM by PIB Hyderabad

కేంద్ర సమాచార  ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈరోజు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ఇండియా పెవిలియన్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం అత్యధికంగా 20కి పైగా భాషల్లో సినిమాలను నిర్మిస్తుందన్నారు. తమ దేశంలో వందకోట్ల మంది వీక్షకులు ఉంటారని చెబుతూ ఇండియా సినీ మార్కెట్ ప్రాముఖ్యతను కూడా తెలియజేశారు. ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ 2014లో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినీ పరిశ్రమకు మేలు చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్టార్టప్‌లకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ కావడానికి  ప్రభుత్వం ఫిల్మ్ మేకింగ్ రంగం నుండి ప్రతిభావంతులైన భారతీయ స్టార్టప్‌లను కేన్స్‌కు తీసుకువచ్చిందని అన్నారు.

విదేశీ చిత్రనిర్మాతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సినిమాల నిర్మాణం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రోత్సాహకాల గురించి కూడా డాక్టర్ మురుగన్ మాట్లాడారు  భారతదేశంలో విదేశీ చిత్రాల షూటింగ్ కోసం ఇస్తున్న ప్రోత్సాహకాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాలో రామాయణం  మహాభారతం వంటి ఇతిహాసాల కాలం నుంచే కథలు పుట్టాయని వివరించారు. "ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ వంటి కార్యక్రమాలకు ఒకే విండోలో వివిధ అనుమతులను పొందే విధానాన్ని సజావుగా అమలు చేస్తున్నాం" అని ఆయన అన్నారు. ఇకపై భాష అవరోధం కాదని, భారతదేశంలోని ప్రాంతీయ సినిమాలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని డాక్టర్ మురుగన్ ప్రేక్షకులకు తెలియజేశారు.తమ దేశానికి వచ్చి సినిమాలు చిత్రీకరించాలని  భారతదేశంలోని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొనాలని మంత్రి పాల్గొనే వారందరినీ ఆహ్వానించారు.

డాక్టర్ ఎల్. మురుగన్‌తో పాటు, రౌండ్ టేబుల్‌కు కింది వారు హాజరయ్యారు:

1. సెల్వాగ్గియా వెలో, డైరెక్టర్, రివర్ టు రివర్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్లోరెన్స్, ఇటలీ

2. కోలిన్ బర్రోస్, ఫిల్మ్ ప్రొడ్యూసర్  డైరెక్టర్, స్పెషల్ ట్రీట్స్ ప్రొడక్షన్స్, యూకే.

3. మైకేల్ స్వెన్సూన్, ఫిల్మ్ కమిషనర్, సదరన్ స్వీడన్ ఫిల్మ్ కమిషన్

4. అమ్మీ జాన్సన్, ప్రాజెక్ట్ మేనేజర్, థీమాటిక్ కమ్యూనికేషన్ యూనిట్, స్వీడన్ శాఖ              కమ్యూనికేషన్

5. మేరీ లిజా డినో, ఫిల్మ్ కమిషనర్, ఫిలిప్పీన్స్

6. జూడీ గ్లాడ్‌స్టోన్, ఎగ్జిక్యూటివ్  ఆర్టిస్టిక్ ఫౌండర్, ఏజ్‌లెస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, యూఎస్ఏ

7. స్టెఫాన్ ఒట్టెన్‌బ్రూచ్, ఇండో జర్మన్ చిత్రాల దర్శకుడు

8. కేరీ సాహ్నీ, డైరెక్టర్, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్

 
***
 

(Release ID: 1827824) Visitor Counter : 163