ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని సిద్దార్ద‌న‌గ‌ర్‌లో జ‌రిగిన‌రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి


ప్ర‌ధాన‌మంత్రి జాతీయ స‌హాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 22 MAY 2022 10:21AM by PIB Hyderabad

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని సిద్ధార్థ న‌గ‌ర్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాన‌మంత్రి సంతాపం వ్య‌క్తం చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సిద్ధార్థ‌న‌గ‌ర‌ర్ రోడ్డు ప్ర‌మాద బాధితుల‌కు  ప్ర‌ధాన‌మంత్రి జాతీయ స‌హాయ నిధి నుంచి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.
ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి ఒక ట్వీట్ చేస్తూ...
"ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీవ్ర‌ నష్టాన్ని భరించే శక్తిని దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను: PM @ narendramodi"
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని సిద్ధార్థ‌న‌గ‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి స‌మీప బందువుల‌కు పి.ఎం.ఎన్‌.ఆర్‌.ఎఫ్ కింద రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా, గాయ‌ప‌డిన వారికి ఒక్కొక్క‌రికి 50 వేల రూపాయ‌లను ప్రధాన‌మంత్రి ప్ర‌క‌టించారు.

 

 


(Release ID: 1827498) Visitor Counter : 144