రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డిఆర్డిఓ, భారత నావికా దళం దేశీయంగా అభివృద్ధి చేసిన నౌకాదళ నిరోధక క్షిపణి తొలి గగన తల పరీక్షను ఒడిశా తీరం నుండి విజయవంతంగా నిర్వహించాయి

Posted On: 18 MAY 2022 1:02PM by PIB Hyderabad

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ),  భారత నావికా దళం  మే 18, 2022న ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్ ) నుండి నావల్ హెలికాప్టర్ నుండి స్వదేశీంగా అభివృద్ధి చేసిన నావల్ యాంటీ షిప్ మిస్సైల్  తొలి గగనతల -పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. మిషన్ దాని అన్ని లక్ష్యాలను ఛేదించింది. ఇది భారత నావికాదళం కోసం స్వదేశీ గగనతల ప్రయోగ నిరోధక క్షిపణి వ్యవస్థ.

 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PIC(1)95MG.jpg

 

క్షిపణి లక్షిత సముద్రపు స్కిమ్మింగ్ పథాన్ని అనుసరించింది, అధిక స్థాయి ఖచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది, నియంత్రణ, మార్గదర్శకత్వం, మిషన్ అల్గారిథమ్‌లను ధృవీకరించింది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి. పరీక్ష పరిధి, ఇంపాక్ట్ పాయింట్ దగ్గర అమర్చిన సెన్సార్లు క్షిపణి పథాన్ని ట్రాక్ చేసాయి.  అన్ని దశలను  సంగ్రహించాయి.

హెలికాప్టర్ కోసం దేశీంగా అభివృద్ధి చేసిన లాంచర్‌తో సహా క్షిపణి అనేక కొత్త సాంకేతికతలను ఉపయోగించింది,  క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి. పరీక్షను డిఆర్డిఓ, ఇండియన్ నేవీ సీనియర్ అధికారులు వీక్షించారు.

తొలి డెవలప్‌మెంటల్ ఫ్లైట్ టెస్ట్ కోసం డిఆర్డిఓ, ఇండియన్ నేవీ,  అనుబంధ బృందాలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి వ్యవస్థల స్వదేశీ రూపకల్పన, అభివృద్ధిలో భారతదేశం ఉన్నత స్థాయి సామర్థ్యాన్ని సాధించిందని ఆయన అన్నారు. మిషన్ లక్ష్యాలను విజయవంతంగా రుజువు చేయడం కోసం ప్రాజెక్ట్ బృందం కృషిని రక్షణ శాఖ కార్యదర్శి, డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. ప్రాజెక్ట్‌కు మద్దతు ఇచ్చినందుకు భారత నావికాదళం, నావల్ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌ను ఆయన అభినందించారు.

 

 ****



(Release ID: 1826525) Visitor Counter : 230