మంత్రిమండలి
బయోఫ్యూయల్స్ తాలూకు జాతీయ విధానం-2018 లో సవరణల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
18 MAY 2022 1:14PM by PIB Hyderabad
బయోఫ్యూయల్స్ తాలూకు జాతీయ విధానం-2018 లో సవరణల ను చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా 2009వ సంవత్సరం లో ప్రకటించినటువంటి బయోఫ్యూయల్స్ సంబంధి జాతీయ విధానం స్థానం లో ‘‘బయోఫ్యూయల్స్ తాలూకు జాతీయ విధానం-2018’’ ని పెట్రోలియమ్ మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ 2018 వ సంవత్సరం జూన్ 4వ తేదీ నాడు నోటిఫై చేసింది.
బయోఫ్యూయల్స్ రంగం లో చోటు చేసుకొన్న ప్రగతి ని దృష్టి లో పెట్టుకొని నేశనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటి (ఎన్ బిసిసి) యొక్క అనేక సమావేశాల లో బయోఫ్యూయల్ ఉత్పత్తి ని పెంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే విధం గా 2023వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాటి నుంచి దేశవ్యాప్తం గా 20 శాతం ఇథెనాల్ పాళ్లు ఉండేటటువంటి ఇథెనాల్ కలిపిన పెట్రోలు కోసం ముందంజ వేసే విషయమై స్థా యి సంఘం యొక్క సిఫార్సు లపైన కూడా నిర్ణయం తీసుకోవడమైంది. వాటిని పరిశీలించి బయోఫ్యూయల్స్ తాలూకు జాతీయ విధానం లో సవరణల ను చేస్తున్నారు.
బయోఫ్యూయల్స్ తాలూకు జాతీయ విధానం కోసం స్వీకారం తెలిపినటువంటి ముఖ్య సవరణ లు ఈ కింది విధం గా ఉన్నాయి:
i. బయోఫ్యూయల్స్ ఉత్పత్తి కి గాను అధిక ఫీడ్ స్టాక్స్ కు అనుమతిని ఇవ్వడం,
ii. పెట్రోలు లో 20 శాతం ఇథెనాల్ ను కలపాలి అనే లక్ష్యాన్ని ఇఎస్ వై 2030 కన్నా ముందు 2025-26 లోనే సాధించడం కోసం ముందంజ వేయడం,
iii. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం లో భాగం గా ప్రత్యేక ఆర్థిక మండలాలు (ఎస్ఇజడ్.. ‘సెజ్’)/ ఎగుమతి ప్రధాన యూనిట్ (ఇఒయు) స్ ద్వారా బయోఫ్యూయల్స్ ఉత్పత్తి ని ప్రోత్సహించడం,
iv. నేశనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటి (ఎన్ బిసిసి) లో కొత్త సభ్యుల ను జోడించడం,
v. ప్రత్యేక వ్యవహారాల లో బయోఫ్యూయల్స్ యొక్క ఎగుమతి కి అనుమతి ని ఇవ్వడం, మరియు
vi. నేశనల్ బయోఫ్యూయల్స్ కోఆర్డినేశన్ కమిటీ సమావేశాల లో తీసుకొన్న నిర్ణయాల కు అనుగుణం గా విధానం లో కొన్ని పదబంధాల ను తీసివేయడం / సవరించడం.
ఈ ప్రతిపాదన తో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కి ఆకర్షణ పెరగడం తో పాటు సామర్థ్యం వృద్ధి చెందుతుంది. తద్ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార ఉద్యమానికి మార్గం సుగమం అవుతుంది. తదనుగుణంగా మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడగలవు.
ఇప్పటి బయోఫ్యూయల్స్ సంబంధి జాతీయ విధానం 2018వ సంవత్సరం లో ఉనికి లోకి వచ్చింది. ఈ ప్రతిపాదిత సవరణ తో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార ఉద్యమానికి మార్గం సుగమం కాగలదు. ఇంకా, బయోఫ్యూయల్స్ ను అధిక స్థాయి లో ఉత్పత్తి చేయడం ద్వారా పెట్రోలియమ్ ఉత్పాదన ల దిగుమతి లో తగ్గింపు సాధ్యమవగలదు. బయోఫ్యూయల్స్ ను ఉత్పత్తి చేయడం కోసం అవసరమైన ఫీడ్ స్టాక్స్ ను అన్నిటికి అనుమతి ని ఇవ్వడం జరుగుతున్నది. ఈ చర్య వల్ల ‘ఆత్మనిర్భర్ భారత్’ కు ప్రోత్సాహం లభిస్తుంది. అంతే కాదు, భారతదేశం 2047వ సంవత్సరానికల్లా ‘శక్తి విషయం లో స్వతంత్రం’ గా నిలవాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి ఉత్తేజం అందగలదు.
***
(Release ID: 1826428)
Visitor Counter : 365
Read this release in:
Assamese
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada