ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కుషీనగర్‌లోని మహాపరినిర్వాణ స్తూపం వద్ద ప్ర‌ధాన మంత్రి ప్రార్థన

Posted On: 16 MAY 2022 7:19PM by PIB Hyderabad

   బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని కుషీన‌గ‌ర్‌లోగల మహాపరినిర్వాణ స్తూపం వద్ద ప్రార్థన చేశారు. అంతకుముందు ఈ తెల్లవారుజామున నేపాల్‌లోని బుద్ధుని జన్మస్థలం లుంబినీని సందర్శించిన ప్రధాని అక్కడి మాయాదేవి ఆలయంలోనూ ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా లుంబినీ సాధువులకు సంబంధించిన ప్రదేశంలో భారత అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతి-వారసత్వ కేంద్రం నిర్మాణ సూచకంగా ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సంయుక్తంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా నేపాల్ ప్రధానమంత్రితో కలసి లుంబినీలోని అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలలోనూ శ్రీ మోదీ పాల్గొన్నారు.

   కాగా, కుషీనగర్‌లో మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“కుషీనగర్‌లోని మహా పరినిర్వాణ స్తూపం వద్ద ప్రార్థన చేశాను. ఈ ప్రదేశాన్ని మరింత మంది పర్యాటకులు, యాత్రికులు సందర్శించే విధంగా కుషీనగర్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది” అని ప్రధాని పేర్కొన్నారు.


(Release ID: 1825903) Visitor Counter : 137