వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మే 10 నుండి 14, 2022 మధ్య భారతదేశాన్ని సందర్శించనున్న ఒమన్ ఉన్నత స్థాయి, బహుళ రంగాల ప్రతినిధి బృందం
ఇండియా-ఒమన్ జాయింట్ కమీషన్ మీటింగ్ (జేసీఎం), జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (జేబీసీ) సమావేశం మరియు అనేక బి2బి కార్యక్రమాలు, మరియు ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌లు, పెట్టుబడిదారుల సమావేశాలు ఎజెండాలో ఉన్నాయి.
భారతదేశం మరియు ఒమన్ మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత మరియు డైనమిక్ ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడం మరియు మరింత బలోపేతం చేయడంలో సహాయపడటం లక్ష్యం
Posted On:
10 MAY 2022 11:30AM by PIB Hyderabad
సుల్తానేట్ ఆఫ్ ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి అయిన శ్రీ మిస్టర్ కైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బహుళ-విభాగ ప్రతినిధి బృందం మే 10-14, 2022 మధ్య భారతదేశాన్ని సందర్శిస్తుంది. 48 మంది సభ్యుల బృందంలో ఫార్మాస్యూటికల్స్, మైనింగ్, టూరిజం, టెలికమ్యూనికేషన్, ఎనర్జీ, షిప్పింగ్ మరియు రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాలకు చెందిన సీనియర్ అధికారులు మరియు వ్యాపార ప్రతినిధులు ఉన్నారు.
ఈ పర్యటన సందర్భంగా 11 మే 2022న న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా-ఒమన్ జాయింట్ కమిషన్ మీటింగ్ (జేసీఎం) 10వ సెషన్‌లో ఇరువైపుల సీనియర్ అధికారులు పాల్గొంటారు, దీనికి గౌరవనీయులైన సహ-అధ్యక్షుడు మినిస్టర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ టెక్స్‌టైల్స్ శ్రీ పీయూష్ గోయల్ తో పాటు గౌరవనీయులైన ఒమన్ సుల్తానేట్ వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రి మిస్టర్ శ్రీ కైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్ పాల్గొంటారు.
2021-2022 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 82% వృద్ధి చెంది యూఎస్ $ 9.94 బిలియన్లకు చేరిన నేపథ్యంలో ఒమానీ ప్రతినిధి బృందం పర్యటన వచ్చింది. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత మరియు డైనమిక్ ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.
12 మే, 2022న, ఇండియా-ఒమన్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (జేబీసీ) సమావేశం ఫిక్కి మరియు ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించబడుతుంది. రెండు వైపుల నుండి గౌరవనీయులైన మంత్రుల భాగస్వామ్యం జేబీసీలో ఉంటుంది. వారు కూడా ఈ సమావేశంలో ప్రసంగిస్తారు మరియు భారతదేశం మరియు ఒమన్ వ్యాపార సంఘాలతో సంభాషిస్తారు. న్యూ ఢిల్లీ మరియు ముంబైలలో బి2బి ఈవెంట్‌లు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌లు, ఇన్వెస్టర్ సమావేశాలు వాటితో సహా అనేక ఇతర కార్యక్రమాలు భారతదేశంలో ఉన్న సమయంలో సందర్శించే ఒమానీ ప్రతినిధి బృందం కోసం షెడ్యూల్ చేయబడ్డాయి.
****
(Release ID: 1824108)
Visitor Counter : 168