కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
2022 సంవత్సరానికి చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్ మరియు కోల్‌కతా కేంద్రాలలో నిర్వహించనున్న ఆర్టీఆర్ (ఏ) పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన , టెలికమ్యూనికేషన్స్ విభాగం డబ్ల్యుపీసీ విభాగం
Posted On:
09 MAY 2022 12:12PM by PIB Hyderabad
2022 సంవత్సరానికి చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్ మరియు కోల్‌కతా కేంద్రాలలో నిర్వహించనున్న రేడియో టెలిఫోనీ రెస్ట్రీకేటెడ్ (ఏరో) పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటీసు టెలికమ్యూనికేషన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. ( https://dot.gov.in/ spectrummanagement/release- rtr-exam-schedule-chennai-new- delhi-hyderabad-and-kolkata- centres-year )
ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ (కమర్షియల్ రేడియో ఆపరేటర్స్ సర్టిఫికేట్ అఫ్ ప్రొఫిషియెన్సీ, వైర్ లెస్ టెలిగ్రాఫీ నిర్వహణ లైసెన్స్) నియమాలు, 1954 మరియు ఆ తర్వాత చేసిన తదుపరి సవరణలు ప్రకారం ఏరో మొబైల్ సర్వీస్‌లో పనిచేసేందుకు అవసరమైన రేడియో టెలిఫోనీ రిస్ట్రిక్టెడ్ (ఏరో) ప్రావీణ్యం మరియు లైసెన్స్ కోసం టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్ల విభాగం వైర్‌లెస్ ప్లానింగ్ మరియు కో-ఆర్డినేషన్ వింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. పరీక్ష షెడ్యూల్ ఇలా ఉంది:
టేబుల్ 1
క్ర. నం
|
కేంద్రం
|
పరీక్ష ప్రారంభ తేదీ (తాత్కాలిక)
|
సంబంధిత ఆర్ఎల్ఓ లో అప్లికేషన్ హార్డ్ కాపీని స్వీకరించడానికి నిర్ణయించిన తాత్కాలిక తేదీలు
|
నోటీసులో పేర్కొన్న టేబుల్-2 ప్రకారం హార్డ్ కాపీ ని పంపాల్సిన ప్రాంతీయ లైసెన్సింగ్ అధికారి
|
ప్రారంభ తేది
|
చివరి తేదీ
|
1.
|
చెన్నై
|
27-06-2022
|
07-05-2022
|
21-05-2022
|
చెన్నై
|
2.
|
న్యూఢిల్లీ
|
22-08-2022
|
15-06-2022
|
30-05-2022
|
న్యూఢిల్లీ
|
3.
|
హైదరాబాద్
|
17-10-2012
|
15-08-2022
|
30-08-2022
|
హైదరాబాద్
|
4.
|
కోల్‌కతా
|
12-12-2022
|
15-10-2022
|
30-10-2022
|
కోల్‌కతా
|
“పై తేదీలు (టేబుల్‌లో పేర్కొన్నవి) తాత్కాలికమైనవి. వీటిలో మార్పు చేసే అవకాశం ఉంది. అయితే, ఆమోదించిన అభ్యర్థులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం వెబ్‌సైట్ ద్వారా పరీక్షల తేదీల సమాచారం తెలియజేయడం జరుగుతుంది. పరీక్షా తేదీలు, కేంద్రాల పూర్తి వివరాలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం వెబ్‌సైట్ లో పొందుపరచబడతాయి." అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది.
అభ్యర్థులు, ఎగ్జామినర్లు, కోఆర్డినేటర్లు మరియు పరీక్షకు సంబంధించిన ఇతర సిబ్బంది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు/ఎస్ ఓ పీ లను పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
పైన పేర్కొన్న టేబుల్-1లో పేర్కొన్న విధంగా నిర్ణీత వ్యవధిలో దరఖాస్తు హార్డ్‌కాపీని సంబంధిత (ప్రాంతీయ లైసెన్సింగ్ అధికారులు) లకు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.
నోటీసు
***
(Release ID: 1823833)
Visitor Counter : 201