మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం

Posted On: 08 MAY 2022 3:35PM by PIB Hyderabad

2022 జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై ) సన్నాహక కార్యక్రమంగా మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ 9 మే 2022న యోగా  కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.దేశానికి స్వాతంత్య్రం సిద్దించి   75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న   'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  

మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న కార్యక్రమాలను 2022 మే 9వ తేదీన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ పరషోత్తం రూపాల గుజరాత్ లోని పోర్‌బందర్‌లో ప్రారంభిస్తారు.  మత్స్యశాఖ కార్యదర్శి శ్రీ జెఎన్‌ స్వైన్ నేతృత్వంలో శాఖకి చెందిన పలువురు అధికారులు మంత్రితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సమాంతరంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, తమిళనాడులోని మహాబలిపురం లలో సన్నాహక కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు.  

 

మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ నిర్వహించనున్న సన్నాహక కార్యక్రమాల్లో 1000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. చేపల పెంపకం దారులు, మత్స్యకారులు, మత్స్య అనుబంధ పరిశ్రమలు మరియు పౌర సమాజ సంస్థలు మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థ లోని సంబంధిత వర్గాలకు చెందిన వారితో  సహా  ప్రజలు, ప్రభుత్వ అధికారులు మరియు యువత మరియు మహిళలతో సహా స్థానిక ప్రజలు అన్ని ప్రదేశాలలో కౌంట్‌డౌన్ యోగా ఈవెంట్‌లలో భౌతికంగా పాల్గొంటారు. మరికొంతమంది వర్చువల్ విధానంలో కార్యక్రమంలో పాల్గొంటారు.   21 జూన్ 2022న  అంతర్జాతీయ యోగా దినోత్సవం  (ఐడీవై) జరగనున్నది. దీనికి  ముందు నిర్వహించనున్న సన్నాహక కార్యక్రమాలు  దైనందిన జీవితంలో యోగా  ప్రాధాన్యతపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం మరియు అవగాహనను కల్పించి  మరియు సంపూర్ణ అభివృద్ధి మరియు ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా  ఆచరించేలా చేయడం లక్ష్యంగా జరుగుతాయి. యునెస్కో కూడా యోగాను  ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. 



(Release ID: 1823787) Visitor Counter : 137