ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
Posted On:
07 MAY 2022 1:55PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“"మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో అగ్నిప్రమాదం సంభవించడం చాలా బాధ కలిగించింది. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. PM @narendramodi” అని పేర్కొంది.
***
DS/VJ/AK
(Release ID: 1823578)
Visitor Counter : 161
Read this release in:
Gujarati
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil