ప్రధాన మంత్రి కార్యాలయం
‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
‘‘భారతదేశం ప్రస్తుతం ‘సంభావ్యత మరియు సామర్ధ్యం’ లను మించి ముందుకు సాగిపోతోంది; అది ప్రపంచ సంక్షేమం అనే ఒక పెద్దప్రయోజనం కోసం కృషి చేస్తోంది’’
‘‘దేశం ప్రస్తుతం ప్రతిభ ను, వ్యాపారాన్ని మరియు సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తోంది’’
‘‘ఆత్మనిర్భర్ భారత్ అనేది మన బాటే కాక మన సంకల్పం కూడాను’’
‘‘ఇఎఆర్ టి హెచ్ (అర్థ్) కోసం పని చేద్దాం; ఇక్కడ అర్థ్ అనేది పర్యావరణాని కి, వ్యవసాయాని కి, రీసైక్లింగు కు, సాంకేతిక విజ్ఞానాని కి మరియు ఆరోగ్య సంరక్షణకు ఒక సంకేతచిహ్నం గా ఉంది’’
Posted On:
06 MAY 2022 12:34PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జైన్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ ఆర్గనైజేశన్ ఆధ్వర్యం లో ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న జరుగుతూ ఉన్న కార్యక్రమం తాలూకు ఇతివృత్తం లో ‘సబ్ కా ప్రయాస్’ భావన ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశం యొక్క అభివృద్ధి సంకల్పాల ను ప్రపంచం తన లక్ష్యాల సాధన కు ఒక మాధ్యమం గా తలుస్తోంది అని కూడా ఆయన అన్నారు. ప్రపంచ శాంతి కావచ్చు, ప్రపంచ సమృద్ధి కావచ్చు.. ప్రపంచ సవాళ్ళ కు సంబంధించిన పరిష్కారాలు కావచ్చు, లేదా ప్రపంచ సరఫరా వ్యవస్థ ను బలపరచడం కావచ్చు.. భారతదేశాని కేసి ప్రపంచం ఎంతో భరోసా తో చూస్తున్నది అని ఆయన అన్నారు. ‘‘ ‘అమృత కాలాని’కై భారతదేశం తీసుకొన్న సంకల్పాన్ని గురించి నేను అనేక యూరోపియన్ దేశాల కు వెల్లడించి కొద్ది సేపటి క్రితం స్వదేశాని కి తిరిగి వచ్చాను’’ అని ఆయన అన్నారు.
ప్రావీణ్యం అవసరమైన రంగం, ఆందోళన ను రేకెత్తిస్తున్న రంగం లేదా ప్రజల ఆలోచనల లో ఎంతటి భిన్నత్వం అయినా కావచ్చు, అయితే అవి అన్నీ కూడాను న్యూ ఇండియా యొక్క ఉన్నతి అనే అంశం తో పెనవేసుకొని ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశం ఇది సాధ్యమా?, మరి దీనికి అవసరమైన సత్తా ఉందా? అనేటటువంటి అంశాల కు అతీతం గా పయనిస్తున్నది. ప్రపంచ సంక్షేమం అనే ఒక అతి పెద్ద ప్రయోజనం కోసం కృషి చేస్తున్నది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సరి అయినటువంటి ఉద్దేశ్యాలు, స్పష్టమైన అభిమతం మరియు అనుకూలమైనటువంటి విధానాలతో ముడిపడ్డ తన మాటల ను ఆయన పునరుద్ఘాటిస్తూ, ప్రస్తుతం దేశం సాధ్యమైనంత విస్తృత స్థాయి లో ప్రతిభ ను, వ్యాపారాన్ని మరియు సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఇప్పుడు దేశం లో ప్రతి రోజు డజన్ ల కొద్దీ స్టార్ట్-అప్స్ నమోదు అవుతున్నాయి. ప్రతి వారం లో ఒక యూనికార్న్ రూపుదాల్చుతోంది అని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్.. అదే, జిఇఎమ్ పోర్టల్ (GeM portal) ఆరంభం అయినప్పటి నుంచి కొనుగోళ్ళు అన్నీ కూడాను అందరి సమక్షం లో ఒక ప్లాట్ ఫార్మ్ పైన జరుగుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇప్పుడు మారుమూల గ్రామాల కు చెందిన వారు, చిన్న దుకాణదారులు, స్వయం సహాయ సమూహాలు వారి వారి ఉత్పత్తుల ను ప్రభుత్వాని కి నేరు గా అమ్మేందుకు అవకాశం ఉంది. మరి ఇవాళ 40 లక్షల మంది కి పైగా అమ్మకందారు సంస్థ లు జిఇఎమ్ పోర్టల్ తో చేతులు కలిపాయి అని ఆయన వివరించారు. పారదర్శకత్వం తో కూడినటువంటి ‘ఫేస్ లెస్’ (మానవ ప్రమేయాని కి తావు లేనటువంటి) పన్ను నిర్ధారణ, ‘ఒక దేశం-ఒక పన్ను’, ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకాల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
భవిష్యత్తు దిశ గా సాగిపోవడానికి మనం అనుసరిస్తున్న మార్గం మరియు గమ్యస్థానం అనేవి స్పష్టం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఆత్మనిర్భర్ భారత్ అనేదే మనం నడచి వెళ్తున్న బాట; అదే మన సంకల్పం కూడాను. గడచిన కొన్ని సంవత్సరాల లో మనం దీని కోసం అవసరమైన వాతావరణాన్ని ఏర్పరచడం లో నిరంతరం పాటుపడుతూ వచ్చాం’’ అని ఆయన అన్నారు.
ఇఎఆర్ టిహెచ్ (అర్థ్) కోసం కృషి చేయవలసిందంటూ సభికుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని గురించి ఆయన మరింత విశదీకరిస్తూ, ‘ఇఎఆర్ టిహెచ్’ అనే పదం లో ‘ఇ’ అనే అక్షరం పర్యావరణం యొక్క సమృద్ధి ని సూచిస్తుంది అన్నారు. వచ్చే సంవత్సరం లో ఆగస్టు 15వ తేదీ నాటి కల్లా ప్రతి జిల్లా లో కనీసం 75 అమృత్ సరోవరాల ను ఏర్పాటు చేయాలి. మరి ఈ ప్రయత్నాల కు మద్ధతు గా నిలబడడం ఎలా అనేది చర్చించుకోండి అని సభికుల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ‘ఇఎఆర్ టిహెచ్’ లో ‘ఎ’ అంటే వ్యవసాయాన్ని మరింత లాభసాటి గా మార్చడం అని చెప్తూ, ప్రాకృతిక వ్యవసాయం లో, వ్యవసాయ సంబంధ సాంకేతిక పరిజ్ఞానం లో, ఫూడ్ ప్రోసెసింగ్ సెక్టర్ లో మరింత అధిక పెట్టుబడి ని పెట్టడం అని వివరించారు. ‘ఆర్’ అనేది రీసైక్లింగ్ యొక్క, చక్రీయ ఆర్థికవ్యవస్థ యొక్క ప్రాధాన్యాన్ని చాటుతుంది. మరి ‘పునర్వినియోగం , తక్కువ గా ఉపయోగించడం, రీసైకిల్ ల కోసం కృషి చేయడాన్ని ‘ఆర్’ చాటిచెప్తుంది. ‘టి’ అంటే టెక్నాలజీ ని సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల వద్ద కు తీసుకు పోవడమే అని అర్థం అని ప్రధాన మంత్రి వివరించారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అన్య ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకాస్త ఎక్కువ సులభం గా ఎలాగ మలచగలమో అనేది ఆలోచించవలసిందంటూ ఆయన ప్రజల ను కోరారు. ఇక ‘హెచ్’ అంటే - హెల్థ్ కేయర్ అనగా ఆరోగ్య సంరక్షణ అని అర్థం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం దేశం లోని ప్రతి జిల్లా లో ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య కళాశాల ల వంటి వ్యవస్థ ల నెలకొల్పేందుకు చాలా కృషి చేస్తోంది అని ఆయన చెప్పారు. సభికులు వారి సంస్థ దీనిని ఏ విధం గా ప్రోత్సహించగలదో అనేది ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు.
***
DS/AK
(Release ID: 1823273)
Visitor Counter : 243
Read this release in:
Bengali
,
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam