మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

“గో కశ్త్” యంత్రాన్ని ప్రాజెక్ట్ అర్త్, ఎనాక్టస్ ఐఐటీ దిల్లీ విద్యార్థులకు అందజేసే కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి

Posted On: 06 MAY 2022 12:28PM by PIB Hyderabad

కేంద్ర మత్స్యపశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా నేడు ప్రాజెక్ట్ అర్త్ మరియు ENACTUS ఐఐటీ ఢిల్లీ విద్యార్థులకు ఆవు పేడ లాగ్ మిషన్, "గో కాశ్త్" యంత్రాన్ని అందజేశారు.

ఆవు పేడ లాగ్ మెషిన్, ఆవు పేడ-ఆధారిత ఇంధన కలపను పొడవాటి ఆకృతిలో తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఆవు పేడ మరియు పశువుల వ్యర్థాల మిశ్రమం (గడ్డి వంటివి) ఈ యంత్రం యొక్క ఇన్‌లెట్ (హాపర్)లో చేర్చబడుతుంది. యంత్రం దానిని చిన్న ముక్కలుగా చేసి కలుపుతుంది. మిశ్రమాన్ని లాగ్చెక్క ముక్కల) ఆకారంలో కుదించబడుతుంది. ఈ లాగ్ అప్పుడు ఎండబెట్టి మరియు తరువాత వివిధ పరిస్థితులలో ఇంధన కలపగా ఉపయోగించవచ్చు.

ఈ యంత్రం ప్రతిరోజూ 3000 కిలోల ఆవు పేడను ప్రాసెస్ చేయగలదు1500 కిలోల ఆవు పేడ ఆధారిత కర్రలను ఉత్పత్తి చేస్తుందివీటిని 5-7 మృతదేహాలను దహనం చేయడానికి కట్టెలుగా ఉపయోగించవచ్చుప్రతి దహన సంస్కారాలలో దాదాపు 2 చెట్లను ఆదా చేయవచ్చు. అంటే ప్రతి నెలా దాదాపు 1,50,000 నుండి 1,70,000 కిలోల ఆవు పేడను తీసేసేందుకు ఇది గోశాలకు సహాయపడుతుంది.

ఆవు పేడ ఆధారిత లాగ్ మెషీన్‌ను ఉపయోగించడం వల్ల గోశాల వారి వ్యర్థాల నిర్వహణ సమస్యలను తీర్చడానికిఅదుంలో పనిచేసే వారికి లేదా సమీపంలోని గ్రామస్తులకు అదనపు ఉపాధిని అందించడానికి మరియు అటవీ నిర్మూలనను తగ్గించడంలో దోహదపడుతుంది.

ఇది పాలు ఇవ్వని ఆవులను ఆర్థిక కార్యకలాపాలలో నిమగ్నం చేయడంలో సహాయపడుతుందిగోశాలలోని అన్ని ఆవులను ఆదుకోవడానికి నిధులను ఉత్పత్తి చేస్తుంది.

***



(Release ID: 1823271) Visitor Counter : 148