ప్రధాన మంత్రి కార్యాలయం
వేడి గాలుల నిర్వహణ కు మరియు వర్షకాల సన్నద్ధత కు సంబంధించిన స్థితి నిసమీక్షించడాని కి ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
వడగాడ్పులు లేదా అగ్ని ప్రమాదాల కారణం గా సంభవించే ప్రాణ నష్టాన్నినివారించడాని కి అన్ని చర్యల ను చేపట్టండి: ప్రధాన మంత్రి
దేశం లోని అడవుల లో మంటలు చెలరేగే ప్రమాదాన్ని తగ్గించడాని కి అన్ని రకాలైనప్రయాస లు అవసరం: ప్రధాన మంత్రి
‘వరదలు వస్తే తగిన విధం గా ప్రతిస్పందించడాని కి ప్రణాళికల ను సిద్ధం చేయాలి’అంటూ రాష్ట్రాల కు ఆయన సలహా ఇచ్చారు
వరద బారిన పడగల రాష్ట్రాల లో బలగాల మోహరింపున కు ప్రణాళిక ను తయారుచేయనున్న ఎన్ డిఆర్ఎఫ్
కోస్తా తీర ప్రాంతాల లో వాతావరణ హెచ్చరికల ను సకాలం లో జారీ చేయడం సహా ముందు జాగ్రతచర్యల ను తీసుకోవాలంటూఆదేశించిన ప్రధాన మంత్రి
ప్రజల ను చైతన్యవంతుల ను చేయడాని కి సామాజిక మాధ్యమాల ను ఉపయోగించుకోవాలి:ప్రధాన మంత్రి
Posted On:
05 MAY 2022 7:54PM by PIB Hyderabad
వేడిగాలు ల నిర్వహణ మరియు వర్షకాలం లో తీసుకోవలసినటువంటి చర్యల కు సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక సమీక్ష ను నిర్వహించారు.
దేశవ్యాప్తం గా ఈ సంవత్సరం మార్చి -మే మధ్య కాలం లో అధిక ఉష్ణోగ్రత లు నమోదు అవుతున్న సంగతి ని గురించిన వివరాల ను భారత వాతారణ అధ్యయన విభాగం (ఐఎమ్ డి) మరియు నేశనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆథారిటి (ఎన్ డిఎమ్ఎ) ఈ సమావేశం లో తెలియజేశాయి. రాష్ట్రాల స్థాయి లో, జిల్లాల స్థాయి లో మరియు నగరాల స్థాయి లో ఒక ప్రమాణీకృత ప్రతిస్పందన కోసం హీట్ యాక్శన్ ప్లాన్స్ ను రూపొందించవలసింది గా రాష్ట్రాల కు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కు సలహా ను ఇవ్వడం జరిగింది. నైరుతి రుతుపవనాల తాలూకు సన్నాహక చర్యల కు సంబంధించినంత వరకు వరదల కాలం లో తగిన సన్నద్ధత ప్రణాళికల ను సిద్ధం చేయడం తో పాటుగా తత్సంబంధి చర్యల ను చేపట్టాలని అన్ని రాష్ట్రాల కు సూచన చేయడమైంది. వరదల బారిన పడగల రాష్ట్రాల లో బలగాల మోహరింపు విషయం లో ప్రణాళిక ను రూపొందించాలని నేశనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డిఆర్ఎఫ్) కు సలహా ఇవ్వడం జరిగింది. ప్రజల ను చైతన్యవంతం చేసేందుకు గాను సామాజిక మాధ్యమాల ను చురుకు గా ఉపయోగించుకోవాలి అని సమావేశం లో పేర్కొనడమైంది.
వడగాడ్పులు లేదా అగ్ని ప్రమాదాల వల్ల సంభవించగల మరణాల ను నివారించడం కోసం అన్ని చర్యల ను మనం తీసుకోవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరహా సంఘటనలు ఏవైనా తలెత్తినప్పుడు మన ప్రతిస్పందన కాలం అనేది కనీస స్థాయి లో ఉండాలి అని కూడా ఆయన చెప్పారు.
వాతావరణం లో వేడిమి అంతకంతకు పెరుగుతూ ఉన్నందువల్ల ఆసుపత్రుల లో మంటల సంబంధి భద్రతపరమైన ఆడిట్ లను క్రమం తప్పక నిర్వహిస్తుండాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. దేశం లో వేరు వేరు ప్రాంతాల లో గల వనాల లో మంటలు చెలరేగే ప్రమాదాల ను గణనీయం గా తగ్గించే దిశ లో కృషి చేయవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఒక వేళ మంటలు గనుక చెలరేగితే అటువంటి ప్రమాదాల ను సకాలం లో గుర్తించడం, మరి అలాగే మంటల ను ఆర్పడం కోసం మరియు మంటలు రేగిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల ను వేగవంతం గా అమలు చేయడం కోసం అటవీ సిబ్బంది కి, సంబంధిత సంస్థల కు ఉన్న సామర్ధ్యాల ను వృద్ధి చేయాలని ఆయన చెప్పారు.
రాబోయే వర్ష రుతువు ను దృష్టి లో పెట్టుకొని తాగునీటి నాణ్యత ను పర్యవేక్షించే ఏర్పాటు లు చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి ఆదేశించారు. ఆ ఏర్పాటులను చేయడం ద్వారా జలం కలుషితం కాకుండా చూడవచ్చు, అలాగే నీటి వల్ల జనించే వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజల ను కాపాడవచ్చు అని ఆయన అన్నారు.
వడగాడ్పుల ను మరియు రాబోయే వర్ష కాలాన్ని దృష్టి లో పెట్టుకొని ఎటువంటి సంఘటన తలెత్తినా ఎదుర్కోవడాని కి అన్ని వ్యవస్థలు తయారు గా ఉండేటట్లు చూడడం కోసం కేంద్రీయ సంస్థ లు మరియు రాష్ట్ర వారీ సంస్థ లు చక్కటి సమన్వయం తో పని చేయవలసిన అవసరం గురించి సమావేశం లో చర్చించడం జరిగింది.
ఈ సమావేశం లో ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, ప్రధాన మంత్రి కి సలహాదారులు, కేబినెట్ సెక్రట్రి, హోం శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జల శక్తి శాఖ ల కార్యదర్శులు, ఎన్ డిఎమ్ఎ సభ్యులు, ఎన్ డిఎమ్ఎ మరియు ఐఎమ్ డి డిజి లతో పాటు ఎన్ డిఆర్ఎఫ్ డిజి కూడా పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 1823187)
Visitor Counter : 207
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam