ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్యొక్క నాలుగో అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి


‘‘మేం తదుపరి తరాని కి చెందిన మౌలిక సదుపాయాలను నిర్మించి నిరుపేద లు మరియు అత్యంత అపాయం ఎదురవగల వర్గాల అవసరాలను దృష్టి లోపెట్టుకొని వారి  ఆకాంక్షల ను నెరవేర్చడంకోసం డానికి మా వచనబద్ధత కు కట్టుబడివున్నాం’’

‘‘మౌలిక సదుపాయాల కల్పన తాలూకు ఏ వృద్ధి గాథ కైనా కీలక స్థానం లో ప్రజలే ఉండాలి.  భారతదేశం సరిగ్గాఇదే చేస్తున్నది’’

‘‘ఒకవేళ మనం మౌలిక సదుపాయాల కల్పన ను ఆటు పోటుల ను ఎదుర్కొనగలిగేటట్టుచేశామనుకోండి, అప్పుడు ఒక్క మన కోసం అనే కాకుండా రాబోయే అనేక తరాల కు కూడాను విపత్తులను అడ్డుకోగలం’’

Posted On: 04 MAY 2022 10:28AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్తాలూకు నాలుగో అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఈ రోజున వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. సమ్మేళనం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, ఘనా అధ్యక్షుడు శ్రీ నానా ఎడో డంక్ వా అకూఫో-ఎడో, జపాన్ ప్రధాని శ్రీ ఫూమియో కిశీదా మరియు మేడాగాస్కర్ అధ్యక్షుడు శ్రీ ఆంద్రో నిరీనా రాజోలినా లు కూడా ప్రసంగించారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ఆరంభం లో, ఏ ఒక్కరు వెనుకపట్టున ఉండిపోరాదన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల తాలూకు సంకల్పాన్ని సభికుల కు గుర్తు చేశారు. ‘‘ఈ కారణం గా మనం తదుపరి తరానికి చెందిన మౌలిక సదుపాయాల ను నిర్మించి పేదలు మరియు అత్యంత అపాయం ఎదురవగల వర్గాల వారి అవసరాల ను దృష్టి లో పెట్టుకొని వారి ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం మన వచనబద్ధత విషయం లో కట్టుబడివున్నాం.’’ అని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కు కేంద్ర స్థానం లో ప్రజలు ఉండాలి, మరి ప్రజల కు సమానత్వం ప్రాతిపదిక న మంచి నాణ్యత, బరోసా తో కూడినటువంటి మరియు నిరంతర సేవల ను అందజేయాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఏ మౌలిక సదుపాయాల కల్పన గాథలో అయినా కేంద్ర స్థానం లో ప్రజలు ఉండాలి. భారతదేశం సరిగ్గా ఇదే చేస్తోంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం విద్య, ఆరోగ్యం, తాగునీరు, స్వచ్ఛత, విద్యుత్తు, రవాణా రంగాల లో, ఇంకా మరెన్నో రంగాల లో మౌలికమైనటువంటి సేవల ను సమకూర్చడాన్ని అదే పని గా పెంచుకుంటూ పోతున్న నేపథ్యం లో, ‘‘మేం జలవాయు పరివర్తన తో కూడాను ఎంతో స్పష్టమైనటువంటి పద్ధతి లో ఎదుర్కొంటూ ఉన్నాం. ఇదే కారణం తో మేం సిఒపి-26 లో మా అభివృద్ధి ప్రధాన ప్రయాసల కు సమానాంతరం గా 2070వ సంవత్సరాని కల్లా నెట్ జీరోను సాధించాలి అని సంకల్పించాం.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మానవ సామర్ధ్యాల ను జాస్తి గా ఉపయోగించుకోవడం లో మౌలిక సదుపాయాల కల్పన కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మౌలిక సదుపాయాల కు నష్టం వాటిల్లిందా అంటే అది కొన్ని తరాల పాటు వెంటాడుతూనే ఉంటుంది అన్నారు. ఇదే సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ‘‘మనకు అందుబాటు లో ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానం మరియు జ్ఞానం ల దన్ను తో మనం పరిస్థితులకు ఎదురొడ్డేటటువంటి మౌలిక సదుపాయాల ను నిర్మించలేమా?’’ అన్నారు. ఈ సవాలు సిడిఆర్ఐ ని ఏర్పాటు చేయడానికి పునాదిరాయి గా ఉంది అని ఆయన అన్నారు. సంకీర్ణ కూటమి పరిధి పెరిగింది, అది విలువైనటువంటి తోడ్పాటుల ను కూడా అందించింది అని ఆయన అన్నారు. సిఒపి-26 లో మొదలుపెట్టిన ‘ఇన్ ఫ్రస్ట్రక్చర్ ఫార్ రిజిలియంట్ ఐలండ్ స్టేట్స్కార్యక్రమాన్ని గురించి, అలాగే ప్రపంచం అంతటా 150 విమానాశ్రయాల కు సంబంధించి రిజిలియంట్ ఎయర్ పోర్ట్ స్ విషయం లో సిడిఆర్ఐ చేస్తున్న పనిపాటుల ను గురించి ఆయన ప్రస్తావించారు. సిడిఆర్ఐ నాయకత్వం లో సాగుతున్న గ్లోబల్ అసెస్ మెంట్ ఆఫ్ డిజాస్టర్ రిజిలియన్స్ ఆఫ్ ఇన్ ఫ్రస్ట్రక్చర్ సిస్టమ్స్కార్యక్రమం వల్ల ప్రపంచ జ్ఞానాన్ని సిద్ధం చేయడం లో సాయం అందగలదు, ఆ సాయం చాలా విలువ కలిగింది గా ఉండగలదు అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

మనం మన భవిష్యత్తు ను ప్రతి ఒక్క పరిస్థితి కి తగినది గా ఉండేలా మలచుకోవాలి అంటే గనుక, మనం రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్ ట్రాంజీశన్దిశ లో కృషి చేయవలసి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి పరిస్థితి లో పనిచేయగలిగినటువంటి మౌలిక సదుపాయాల ను మన విస్తృత సమాయోజక ప్రయాసల తాలూకు కేంద్ర స్థానంలో నూ ఉంచవచ్చును. ‘‘మనం మౌలిక సదుపాయాల ను పరిస్థితుల కు ఎదురొడ్డేందుకు తగినవి గా సిద్ధం చేశామా అంటే, అప్పుడు ఒక్క మన కోసం అనే కాకుండా, రాబోయే అనేక తరాల కోసం విపత్తుల ను అడ్డుకోగలుగుతాం’’ అని ఆయన అన్నారు.

***

DS/AK

 

 


(Release ID: 1822649) Visitor Counter : 150