ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా- జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ప్లీనరీ సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ప్రధానమమంత్రి శ్రీ నరేంద్రమోదీ
Posted On:
02 MAY 2022 8:08PM by PIB Hyderabad
ఇండియా - జర్మనీ 6 వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ప్లీనరీ సమావేశానికి (ఐజిసి) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మన్ ఫెడరల్ రిపబ్లిక్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో కలసి సహ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం సందర్భంగా ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన కీలక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమమ అభిప్రాయాలను వారు పంచుకున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమ ప్రసంగంలో, ఇండియా -జర్మనీ భాగస్వామ్యం సంక్లిష్ట ప్రపంచంలో విజయానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. భారత్ సాగిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో పాల్గొనవలసిందిగా జర్మనీని ప్రధానమంత్రి ఆహ్వానించారు.
ఇరు వైపుల నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు , అధికారులు, ఐజిసి కి సంబంధించి వివిధ అంశాలపై సాగించిన సమావేశాల నివేదికలను సమర్పించారు. అవి:
-విదేశీవ్యవహారాలు, భద్రత,
-ఆర్థిక , ద్రవ్య విధానం, శాస్త్ర విజ్ఞానం, సోషల్ ఎక్స్చేంజ్,
- వాతావరణం, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, ఇంధనం
ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మాలసీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ , భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, డిపిఐఐటి కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ లు భారతదేశం వైపు నుంచి తమ ప్రెజెంటేషన్ లు ఇచ్చారు.
హరిత, సుస్థిరాభివృద్ధి భాగస్వామ్యాన్ని ఏర్పరచేందుకు సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (జెడిఐ)పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మన్ ఛాన్సలర్ షోల్జ్ సంతకాలు చేయడంతో ప్లీనరీ ముగిసింది.
ఈ భాగస్వామ్యం కింద ఇండియా- జర్మనీ లమధ్య సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ కార్యాచరణకు సంబంధించి వివిధ మంత్రిత్వశాఖల సమన్వయంతో మొత్తంగా కార్యకలాపాలు చేపడతారు. దీనికి సంబంధించి జర్మనీ 2030 వరకు అదనపు అభివృద్ధి సహాయంగా, కొత్తగా 10 బిలియన్ యూరోలను ముందస్తు చెల్లింపునకు హామీ ఇచ్చింది. ఈ సంయుక్త ఆసక్తి వ్యక్తీ కరణ ప్రకటన -జెడిఐ , ఐజిసి ఫ్రేమ్ వర్క్ కు లోబడి ఒక మంత్రిత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఈ భాగస్వామ్యానికి సంబంధించి ఉన్నతస్థాయి సమన్వయానికి, రాజకీయ దిశా నిర్దేశాన్ని అందించేందుకు ఉపకరిస్తుంది.
ఐజిసి లో చేపట్టిన సంయుక్త ప్రకటనను ఇక్కడ చూడవచచ్చు.
ద్వైపాక్షిక సమావేశాల సందర్భంగా పలు ఒప్పందాలు జరిగాయి. వాటి జాబితాను ఇక్కడ గమనించవచ్చు.
***
(Release ID: 1822447)
Visitor Counter : 159
Read this release in:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam