ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        శివగిరి తీర్థయాత్ర 90వ వార్షికోత్సవం మరియు బ్రహ్మ విద్యాలయ యొక్కస్వర్ణోత్సవం సందర్బం లో సంవత్సరం పొడవునా నిర్వహించేటటువంటి సంయుక్త కార్యక్రమంతాలూకు ప్రారంభోత్సవం నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో జరుగనుండగా ఆ వేడుక లోపాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                25 APR 2022 7:07PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో శివగిరి తీర్థయాత్ర యొక్క 90వ వార్షికోత్సవం మరియు బ్రహ్మ విద్యాలయ స్వర్ణోత్సవం సందర్భం లో ఏడాది పొడవునా నిర్వహించేటటువంటి సంయుక్త కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవం లో పాలుపంచుకోనున్నారు. ప్రధాన మంత్రి ఏడాది పొడవునా జరిగే సంయుక్త కార్యక్రమాల తాలూకు గుర్తింపు చిహ్నాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. మహా సామాజిక సంస్కరణవాది శ్రీ నారాయణ గురు యొక్క సంరక్షణ మరియు మార్గదర్శకత్వం తో శివగిరి తీర్థయాత్ర ను, బ్రహ్మ విద్యాలయ ను ప్రారంభించడం జరిగింది.
శివగిరి తీర్థయాత్ర ను ప్రతి సంవత్సరం లో డిసెంబర్ నెల 30వ తేదీ మొదలుకొని మూడు రోజుల పాటు తిరువనంతపురం లోని శివగిరి లో నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీ నారాయణ గురు చెప్పిన ప్రకారం, తీర్థ యాత్ర యొక్క ఉద్దేశ్యం ప్రజల లో విస్తృత జ్ఞానాన్ని ప్రసరింపచేయడం మరియు వారి సమగ్ర అభివృద్ధి కి, సమృద్ధి కి తోడ్పడడమూను. ఈ కారణం గా ఈ తీర్థ యాత్ర ఎనిమిది అంశాల పైన శ్రద్ధ వహిస్తుంది. ఆ ఎనిమిది విషయాలు ఏవేవి అంటే అవి విద్య, స్వచ్ఛత, ధర్మపరాయణత్వం, చేతివృత్తులు, వ్యాపారం, ఇంకా వాణిజ్యం, వ్యవసాయం, విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం లతో పాటు సంఘటిత ప్రయాస లు అనేవే.
కొద్ది మంది భక్తుల తో 1933వ సంవత్సరం లో ఈ తీర్థయాత్ర ను మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశం లో ప్రస్తుతం ఇది ప్రధానమైన కార్యక్రమాల లో ఒకటి గా మారిపోయింది. ప్రతి సంవత్సరం లో ప్రపంచ వ్యాప్తం గా లక్షల కొద్దీ భక్త జనులు వారు ఏ కులం, ఏ వర్గం, ఏ ధర్మం మరియు ఏ భాష కు చెందిన వారు అనే వాటికి అతీతం గా తీర్థయాత్ర లో పాల్గొనడం కోసం శివగిరి కి తరలి వస్తున్నారు.
అన్ని ధర్మాల సిద్ధాంతాలను సమానమైన విధం గా నేర్పించాలని శ్రీ నారాయణ గురు తలచారు. ఈ ఈ దృష్టికోణాన్ని సాకారం చేయడం కోసం శివగిరి లో బ్రహ్మ విద్యాలయాన్ని స్థాపించడమైంది. బ్రహ్మ విద్యాలయ లో శ్రీ నారాయణ గురు యొక్క కార్యాలు, ప్రపంచం లోని అన్ని ప్రధాన ధర్మాల గ్రంథాలు సహా భారతీయ తత్వశాస్త్రంపై 7 సంవత్సరాల పాఠ్యక్రమాన్ని బోధించడం జరుగుతున్నది. 
 
 
 
                
                
                
                
                
                (Release ID: 1820314)
                Visitor Counter : 160
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam