ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబాయిలో జరిగిన ఒక కార్యక్రమంలో లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం అందుకున్న ప్రధానమంత్రి
తరతరాలకు ప్రేమను కానుకగా అందించిన లతా దీదీ నుంచి సోదరిగా ఆమె ప్రేమను పొందడం కంటే గొప్ప విశేషం ఏముంటుంది”
నేను ఈ అవార్డును దేశ ప్రజలందరికీ అంకితం చేస్తున్నాను. లతా దీదీ ప్రజలమనిషి. ఆమె పేరుమీద ఇచ్చిన ఈ అవార్డు కూడా ప్రజలకే చెందుతుంది.
స్వాతంత్య్రానికి పూర్వం భారత్ గొంతుకగా ఉన్నారు.ఈ 75 ఏళ్ల దేశ ప్రస్థానం కూడా ఆమె గొంతుకతో ముడిపడి ఉంది.
లతా జీ సంగీతాన్ని ఆరాధించారు, కానీ దేశభక్తి, దేశ సేవకు సంబంధించి ఆమె పాటలు ప్రేరణగా నిలిచాయి.
లతాజీ , ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కు సుమధుర అభివ్యక్తికి ప్రతిరూపం
లతాజీ దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేశారు. అంతర్జాతీయగా , ఆమె భారత్‌కు సాంస్కృతిక రాయబారి.
Posted On:
24 APR 2022 7:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముంబాయిలో మాస్టర్ దీనానాత్ మంగేష్కర్ అవార్డుల ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి లతా దీనానాత్ మంగేష్కర్ తొలి అవార్డును ప్రదానం చేశారు. భారత రత్న లతా మంగేష్కర్ స్మృత్యర్థం ఈ అవార్డును నెలకొల్పారు. జాతి నిర్మాణానికి విశేష కృషి చేసిన వ్యక్తికి ఈ అవార్డును బహుకరిస్తారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్‌సింగ్ కోష్యారి, లతామంగేష్కర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, సంగీతం గురించి తనకు లోతుగా తెలియనప్పటికీ, సాంస్కృతికంగా చూసినపుడు, సంగీతం ఒక సాధన, ఒక భావోద్వేగం అని ఆయన అన్నారు. "వ్యక్తీకరించలేని వాటిని వ్యక్తీకరించేది పదం. వ్యక్తీకరించబడిన శక్తిని చైతన్యంతో నింపేది 'నాద్ అని ఆయన అన్నారు. చైతన్యాన్ని భావోద్వేగం భావాలతో నింపి, సృష్టి ,సున్నితత్వాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లేది 'సంగీతం'. సంగీతం మీలో శౌర్యాన్ని, వాత్సల్యాన్ని నింపగలదు.
ఇది దేశభక్తి కర్తవ్య భావాన్ని ఉన్నత స్థితికి తీసుకెళుతుంది. "లతా దీదీ రూపంలో సంగీతం ఈ సామర్థ్యం , శక్తిని చూడటం మా అదృష్టం" అని ప్రధానమంత్రి అన్నారు. “నాకు లతా దీదీ ‘సుర్ సామ్రాజ్ఞి’ అలాగే నా సోదరి. తరతరాలకు ప్రేమను, భావాలను కానుకగా అందించిన లతా దీదీ నుంచి సోదరి ప్రేమను పొందడం కంటే గొప్ప విశేషం ఏముంటుంది” అని ఆయన అన్నారు.
అవార్డులు అందుకోవడం తనకు అంతగా ఇష్టముండదని అంటూ ప్రధానమంత్రి, అయితే లతా మంగేష్కర్ కుటుంబ సభ్యలు తనను కలసి, లతాదీదీ వంటి సోదరి పేరుమీద అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించారని, దానితో ఇది ఆమె ప్రేమ, వాత్సల్యానికి గుర్తుగా భావించానని ఆయన అన్నారు. అందువల్ల తాను దీనికి కాదని చెప్పలేకపోయానని అన్నారు. ఈ అవార్డును దేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. లతాదీది ప్రజల మనిషి అయినందున, ఈ అవార్డు కూడా ప్రజలకే అంకితమని ప్రధానమంత్రి అన్నారు. సాంస్కృతిక ప్రపంచానికి లతా దీదీ చేసిన విశిష్ట సేవలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. మన దేశం స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో లతాజీ భౌతిక ప్రయాణం పరిపూర్ణమైందని, ఈ 75 సంవత్సరాల దేశ ప్రయాణం ఆమె కంఠంతో ముడి పడి ఉంటూ వచ్చిందని ఆయన అన్నారు.
లతా మంగేష్కర్ జీ కుటుంబంలో దేశభక్తి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాటతోపాటు లతా దీదీ గొప్ప దేశభక్తురాలన్నారు. ఇందుకు ఆమె తండ్రి ప్రేరణ అన్నారు. వీర సావర్కర్ రాసిన పాటను , స్వాతంత్ర సమర కాలంలో బ్రిటిష్ వైస్రాయ్ పాల్గొన్న కార్యక్రమంలో దీనానాథ్ జీ పాడారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. బ్రిటిష్ పాలనను సవాలు చేస్తూ వీరసావర్కర్ రాసిన పాట అది అని ఆయన అన్నారు. దీనానాథ్‌జీ వారసత్వంగగా తన కుటుంబ సభ్యులకు దేశభక్తిని అందించారని ఆయన అన్నారు. లతాజీ సంగీతాన్ని ఆరాధించారని, అయితే దేశభక్తి, దేశ సేవ ఆమె పాటల ద్వారా ప్రేరణ పొందాయని అన్నారు.
లతాదీదీ అద్భుత సంగీత ప్రయాణం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, లతాజీ ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ కుసంగీత రూపమని ఆయన అన్నారు. హిందీ, మరాఠీ, సంస్కృతం, తదితర 30 కి పైగా భారతీయ భాషలలో ఆమె పాటలు పాడారని ఆయన తెలిపారు, ఆమె స్వరం ఇంటింటా వినపడుతుందన్నారు. సంస్కృతి నుంచి విశ్వాసం వరకు, తూర్పునుంచి పశ్చిమం వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు లతాదీ పాటలు దేశం మొత్తాన్ని ఐక్యంగా ఉంచడానికి కృషి చేశాయన్నారు. అంతర్జాతీయంగా కూడా ఆమె భారత్ సాంస్కృతిక రాయబారి అని ఆయన అన్నారు. ప్రతి రాష్ట్రంలో , ప్రతి ప్రాంతానికి చెందిన వారి ఆలోచనలకు ప్రేరణ నిచ్చారని అన్నారు. భారతీయతతో సంగీతానికిగల విడదీయలేని బంధాన్ని ఆమె రుజువుచేశారని అన్నారు. లతా దీదీ కుటుంబ సభ్యులు చేస్తున్నధార్మిక సేవాకార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.
భారతదేశపు అభివృద్ధి అంటే, సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్ , సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అని ప్రధానమంత్రి అన్నారు. ఇది వసుధైవ కుటుంబకం, విశ్వ శ్రేయస్సుకు పాటుపడుతుందని అన్నారు. ఇలాంటి భావనతో కూడిన అభివృద్ధి కేవలం భౌతిక పరమైన సామర్ధ్యాల ద్వారా సాధించలేమని అన్నారు. ఇందుకు ఆథ్యాత్మిక చైతన్యం కీలకమని అన్నారు. అందువల్ల ఇండియా యోగ, ఆయుర్వేద, పర్యావరణం వంటి వాటివిషయంలో నాయకత్వాన్ని అందిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు.
“భారతదేశ కృషిలో సంగీతం కూడా ఒక ముఖ్యమైన భాగం అదే విలువలతో ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచుదాం , దానిని ముందుకు తీసుకువెళ్లి, ప్రపంచ శాంతికి ఒక మాధ్యమంగా దానిని మారుద్దాం”, అని ప్రధాన మంత్రి అన్నారు.
(Release ID: 1819837)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam