యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడల పోటీల్లో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో మాట్లాడిన శ్రీ అనురాజ్ ఠాకూర్ క్రీడల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన శ్రీ ఠాకూర్
క్రీడాకారులకు అసౌకర్యం కలగకుండా కలకాలం గుర్తిండిపోయేలా కేయూజి 2021 నిర్వహించాలి : శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
24 APR 2022 4:41PM by PIB Hyderabad
ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడల పోటీలు జరగనున్న జైన్ యూనివర్సిటీ గ్లోబల్ క్యాంపస్ ను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఆకస్మికంగా సందర్శించారు, కొత్తగా చేర్చిన మల్లకుంబ మరియు యోగాసనాలతో సహా 13 విభాగాలలో పోటీలు జరగనున్నాయి.
స్వతహాగా అథ్లెటిక్ అయిన క్రీడల శాఖ మంత్రి పోటీలు జరగనున్న వివిధ ప్రాంగణాలను సందర్శించి వాటిలో కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా తెలుసుకున్నారు. పోటీల్లో పాల్గొంటున్న వారు తీపి గుర్తులతో వెళ్లే విధంగా కేయూజి 2021 నిర్వహించాలని ఆయన అన్నారు. క్రికెటర్ గా తన అనుభవాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. " ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడల పోటీలు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి జైన్ యూనివర్సిటీ అత్యుత్తమ ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ క్రీడాకారులను చూసిన తర్వాత నాకు నేను విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో క్రికెట్ ఆడిన రోజులు గుర్తు వస్తున్నాయి. బిహార్‌లోని దర్భంగా మరియు సమస్తిపూర్ వంటి ప్రదేశాలలో జరిగిన కొన్ని టోర్నమెంట్‌లు జరిగాయి. అయితే,సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రస్తుతం దేశంలో క్రీడా సౌకర్యాలు మెరుగు పడ్డాయి. ఇక్కడ క్రీడాకారులకు అత్యుతమ సౌకర్యాలను కల్పిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కేయూజి 2021 పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాము." అని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
"క్రీడా స్ఫూర్తితో ఆడండి. పరిశుభ్రమైన క్రీడలను ప్రచారం చేయండి. ప్రతిభ కనబరిచేందుకు డ్రగ్స్‌ని ఉపయోగించవద్దు." అని వర్ధమాన అథ్లెట్లకు శ్రీ ఠాకూర్ సలహా ఇచ్చారు. అందుకే అథ్లెట్లకు సరైన సమాచారం అందించడానికి మేము నాడా ద్వారా కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో యువ క్రీడాకారులకు డోపింగ్ గురించి మరింత అవగాహన కల్పించాల్సి ఉంటుందని మంత్రి అన్నారు.
వివిధ విశ్వవిద్యాలయాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన వారితో మంత్రి మాట్లాడారు. వారు పాల్గొంటున్న ఈవెంట్‌లు మరియు క్రీడల వివరాలను మంత్రి తెలుసుకున్న శ్రీ ఠాకూర్ వారి ఆశయాల అడిగి తెలుసుకున్నారు.
శ్రీ అనురాగ్ ఠాకూర్ తో ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం వాలీ బాల్ బృందం సభ్యుడిగా ఉన్న ఎస్. సంతోష్ మాట్లాడారు. దీనిపై మాట్లాడిన సంతోష్ " క్రీడల శాఖ మంత్రితో మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్రం మరియు విశ్వవిద్యాలయాల కోసం కష్టపడి ఆడుతూనే ఉండాలి అని ఆయన మమ్మల్ని ప్రోత్సహించారు. మంత్రి స్వయంగా మా వద్దకు వచ్చి మా క్రీడల గురించి మాట్లాడి మాకు క్రీడా స్ఫూర్తి కల్పించారు. అథ్లెట్‌తో కలిసి ఒక సీనియర్ మంత్రి మైదానంలో ఉండడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రోజు మాకు కలిగిన అనుభవం కలకాలం గుర్తుండి పోతుంది" అని అన్నారు.
మహిళల విభాగంలో హెచ్‌ఆర్‌ఎం(హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ), ఏడబ్ల్యూయూ (అడమస్ యూనివర్శిటీ వెస్ట్ బెంగాల్), పురుషుల విభాగంలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ చెన్నై, ఏడబ్ల్యూయూ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో క్రీడా మంత్రి ఉదయం వాలీబాల్ వేదిక వద్దకు వచ్చారు. అతను రెండు జట్ల సభ్యులతో మాట్లాడి రాబోయే మ్యాచ్‌లలో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు . రిఫరీలు, ప్రేక్షకులతో కూడా మంత్రి మాట్లాడారు. అంతే కాకుండా శ్రీ ఠాకూర్ ఒక రౌండ్ వాలీబాల్ ఆడారు.
***
(Release ID: 1819601)
Visitor Counter : 135