ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 21న జరిగిన ఆయుష్మాన్ భారత్ బ్లాక్ స్థాయి హెల్త్ మేళాలలో 4.82 లక్షల మందికి పైగా పాల్గొన్నారు; 587 బ్లాక్‌లు దేశవ్యాప్తంగా నాలుగో రోజు ఆరోగ్య మేళాలను నిర్వహించాయి


66,000కు పైగా ఎబిహెచ్ఏ ఆరోగ్య ఐడీలు సృష్టించబడ్డాయి; 18,000 పీఎంజేఏవై గోల్డెన్ కార్డ్‌లు జారీ చేయబడ్డాయి, 33,000 టెలికన్సల్టేషన్‌లు పూర్తయ్యాయి

Posted On: 22 APR 2022 12:47PM by PIB Hyderabad

16 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ 2022 వరకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో అమృత మహోత్సవాల్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ (AB-HWCs) నాలుగేళ్ల వార్షికోత్సవాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో నిర్వహించబడ్డాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిరాష్ట్రాలు/యూటీల ఆరోగ్య మంత్రిఎంపీలుఎమ్మెల్యేలుకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులుప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీలు/ రాష్ట్రాలు/యూటీల ఆరోగ్య కార్యదర్శులురాష్ట్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులుప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. AB-HWC లు ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించడంలో ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

 

ఏప్రిల్ 18-222022 నుండిరాష్ట్రం/యుటిలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక బ్లాక్‌లో లక్ష కంటే ఎక్కువ AB-HWCలలో బ్లాక్ స్థాయి ఆరోగ్య మేళాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. ప్రతి బ్లాక్ స్థాయి ఆరోగ్య మేళా ఒక రోజు పాటు నిర్వహించబడింది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి బ్లాక్ ఇందులో భాగస్వామ్యమయింది.

 

నాల్గవ రోజు హెల్త్ మేళాలో4 లక్షల 82 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 587 బ్లాక్‌లలో ఆరోగ్య మేళాలు నిర్వహించాయి. 66,000 కంటే ఎక్కువ ఏబిహెచ్ఏ ఆరోగ్య ఐడీలు సృష్టించబడ్డాయి. 18,000 పిఎంజేఏవై గోల్డెన్ కార్డ్‌లు జారీ చేయబడ్డాయిఅలాగే అధిక రక్తపోటుమధుమేహం మొదలైన వాటి కోసం వేల సంఖ్యలో స్క్రీనింగ్‌లు చేయబడ్డాయి.

 

ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లలో 16 ఏప్రిల్ 2022న ఇ-సంజీవని ప్లాట్‌ఫారమ్ ద్వారా ఒక రోజులో 3 లక్షల టెలికన్సల్టేషన్‌లు జరిగాయి. AB-HWC లలో ఒకే రోజు జరిగిన అత్యధిక టెలికన్సల్టేషన్‌లు ఇవే. ఇంతకుముందు రికార్డు రోజుకు 1.8 లక్షల టెలికన్సల్టేషన్‌లను ఇది అధిగమించింది. 21 ఏప్రిల్ 2022నదేశవ్యాప్తంగా 33,000 కంటే ఎక్కువ టెలికన్సల్టేషన్‌లు జరిగాయి.

 

21.04.2022 నాటికి రాష్ట్రాల వారీగా బ్లాక్ హెల్త్ మేళా నివేదిక క్రింది విధంగా ఉంది:

 

****




(Release ID: 1819299) Visitor Counter : 156