ప్రధాన మంత్రి కార్యాలయం

గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ ఎండ్ ఇనొవేశన్ సమిట్ ను గాంధీ నగర్ లోప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రజారోగ్యం రంగం లో నూతన ఆవిష్కరణల శక్తి ని ఉపయోగించుకొన్నందుకు భారతప్రభుత్వాన్ని మరియు ప్రధాన మంత్రి ని ప్రశంసించిన డబ్ల్యుహెచ్ఒ డిజి

‘‘మీరు విజేత గా నిలవడం అనేది సాంప్రదాయిక మందుల వాడకం లో చెప్పుకోదగినమార్పు ను తీసుకు వస్తుంది’’ అని ప్రధాన మంత్రి కి చెప్పిన డిజి

డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయసస్ కు ‘తులసీ భాయి’ అనే ఒక గుజరాతీ పేరు ను ఇచ్చిన ప్రధానమంత్రి

‘‘ఆయుష్ రంగం లో పెట్టుబడి కి మరియు నూతన ఆవిష్కరణల కు అంతులేనటువంటిఅవకాశాలు ఉన్నాయి’’

‘‘ఆయుష్ రంగం 2014వ సంవత్సరం లో 3 బిలియన్ డాలర్ కంటే తక్కువ గా ఉన్నస్థాయి నుంచి 18 బిలియన్ డాలర్ కు పైగా వృద్ధి చెందింది’’

‘‘భారతదేశం ఓషధీయ మొక్కల కు ఒక ఖజానా గా ఉంది, అది ఒక రకం గా మన ‘హరిత స్వర్ణం’ అన్నమాట’’

‘‘గత కొన్నేళ్ళ లో వివిధ దేశాల తో 50 కి పైగా ఎమ్ఒయు లను కుదుర్చుకోవడమైంది.  మన ఆయుష్నిపుణులు భారతీయ ప్రమాణాల మండలి సహకారం తో ఐఎస్ఒ ప్రమాణాల ను అభివృద్ధిపరుస్తున్నారు.  ఇది 150 కి పైగా దేశాల లో ఆయుష్ కు ఒక భారీఎగుమతి బజారు కు తలుపులను తెరుస్తుంది’’

‘‘ఎఫ్ఎస్ఎస్ఎఐ కి చెందిన ‘ఆయుష్ ఆహార్’ అనేది హెర్బల్ న్యుట్రిశనల్సప్లిమెంట్స్ యొక్క నిర్మాతల కు ఎంతో సహకరిస్తుంది’’

‘‘ప్రత్యేకమైనటువంటి ఆయుష్ చిహ్నం ప్రపంచం అంతటా ప్రజల కు నాణ్యమైనటువంటి ఆయుష్ఉత్పత్తుల తాలూకు బరోసా ను ఇస్తుంది’’

‘‘ఆయుష్ ఉత్పత్తుల తయారీ, వ్యాప్తి మరియు పరిశోధనల ను ప్రోత్సహించడం కోసంప్రభుత్వం దేశవ్యాప్తం గా ఆయుష్ పార్కుల నెట్ వర్క్ ను ప్రభుత్వం అభివృద్ధిపరుస్తుంది’’

‘‘ఆయుష్ చికిత్స కోసం భారతదేశాని కి వచ్చే ప్రజల సహకారార్థం భారతదేశం ఒకప్రత్యేకమైన ఆయుష్ వీజా కేటగిరీ ని ప్రవేశపెట్టబోతోంది’’

‘‘ఆయుర్వేద యొక్క సమృద్ధి కి దోహదపడ్డ ప్రధాన కారణాల లో ఒక కారణం దాని ఓపన్సోర్స్ నమూనా’’

‘‘రాబోయే 25 సంవత్సరాల అమృత కాలం సాంప్రదాయిక మందుల కు సువర్ణకాలం గా రుజువు అవుతుంది’’

Posted On: 20 APR 2022 1:24PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ ఎండ్ ఇనొవేశన్ సమిట్ను ఈ రోజు న గుజరాత్ లోని గాంధీనగర్ లో గల మహాత్మ మందిర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయసస్ లు హాజరు అయ్యారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవియా, శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ ముంజపారా మహేంద్ర భాయి లతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్ కూడా ఉన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిఖర సమ్మేళనం 5 సర్వ సభ్య సమావేశాల కు, 8 రౌండ్ టేబుల్ సమావేశాల కు, 6 వర్క్ శాపుల కు, ఇంకా 2 గోష్ఠుల కు వేదిక కానుంది. సుమారు 90 మంది ప్రముఖ వక్తల తో పాటు 100 మంది ఎగ్జిబిటర్ లు ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొంటారు. ఈ శిఖర సమ్మేళనం పెట్టుబడి తాలూకు సామర్థ్యాన్ని వెలికి తీయడానికి తోడ్పడి, నూతన ఆవిష్కరణ, పరిశోధన కు, అభివృద్ధి కి (ఆర్ ఎండ్ డి), స్టార్ట్- అప్ ఇకోసిస్టమ్ కు, వెల్ నెస్ ఇండస్ట్రీ కి ఊతాన్ని ఇస్తుంది. ఇది పరిశ్రమ నేతల ను, విద్యావేత్తల ను మరియు పరిశోధకుల ను ఒక చోటు కు చేర్చుతుంది. భవిష్యత్తు సహకారాల కోసం ఒక వేదిక గా వ్యవహరించనుంది.

 

మహాత్మ గాంధీ కి చెందిన రాష్ట్రాని కి మరియు దేశాని కి తాను విచ్చేసినందుకు డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయసస్ తన సంతోషాన్ని ప్రకటించారు. మహాత్మ గాంధీ కి చెందిన గడ్డ దేశానికి గర్వకారణం అని ఆయన అభివర్ణించారు. భారతదేశం అనుసరిస్తున్న వసుధైవ కుటుంబకమ్అనే సూత్రమే నిన్నటి రోజు న జామ్ నగర్ లో డబ్ల్యుహెచ్ఒ గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్ (జిసిటిఎమ్) ప్రారంభాని కి వెనుక ఉన్న చోదక శక్తి అని ఆయన అన్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమైంది, ఇది ఒక మేలు మలుపు ను ఆవిష్కరించగలుగుతుంది అని ఆయన అన్నారు. సాక్ష్యం, సమాచారం మరియు సాంప్రదాయిక ఔషధాల తాలూకు సమాచారం, మన్నిక మరియు ఆ మందుల వాడకాన్ని గరిష్ఠ స్థాయి కి తీసుకు పోవడం అనే కార్యాల ఆచరణ కు ఒక ఇంజను గా ఉండాలి అనే ధ్యేయం తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. సార్వజనిక స్వాస్థ్య సంరక్షణ రంగం లో నూతన ఆవిష్కరణ శక్తి ని ఉపయోగించుకొంటున్నందుకు భారత ప్రభుత్వాన్ని మరియు ప్రధాన మంత్రి ని డిజి ప్రశంసించారు. భారతదేశం లోని ఆసుపత్రుల లో డేటా మరియు ఏకీకృత‌ సమాచార పంపకం వ్యవస్థల వినియోగాన్ని ఆయన అభినందించారు. సాంప్రదాయిక ఔషధాల లో పరిశోధన కోసం డేటా ను సేకరించేందుకు సంబంధించినటువంటి ఉత్సాహాన్ని వర్ధిల్లజేస్తున్నందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ను ఆయన మెచ్చుకొన్నారు. ఆయుష్ ఉత్పాదనల కు ప్రపంచం లో పెరుగుతున్న డిమాండు ను మరియు పెట్టుబడి ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, యావత్తు ప్రపంచం భారతదేశాని కి తరలి వస్తున్నది, మరి భారతదేశం ప్రపంచం లో అన్ని దిక్కుల కు వెళ్తోంది అన్నారు. ఆరోగ్య రంగం లో మరీ ముఖ్యం గా సాంప్రదాయిక ఔషధాల లో నూతన ఆవిష్కరణలు దీర్ఘకాలిక పెట్టుబడి, ఇనొవేశన్ ఇకో సిస్టమ్; పర్యావరణాని కి కీడు చేయని విధం గాను, సమాన అవకాశాలు లభించేటట్లుగాను ఆవిష్కర్త లు, పరిశ్రమ మరియు ప్రభుత్వం సాంప్రదాయిక మందుల ను అభివృద్ధిపరచడం; ఈ తరహా సంప్రదాయాల ను వెలుగు లోకి తీసుకు వచ్చినటువంటి సముదాయాల ప్రయోజనాల ను పరిరక్షించడం జరగాలి అంటూ ఆయన నొక్కిచెప్పారు. ఈ మందుల ను బజారు కు తీసుకు వచ్చినప్పుడు మేధోసంపత్తి ఫలాల ను పంచుకోవడం సహా ఆయా మందుల ను వెలుగు లోకి తీసుకువచ్చినటువంటి సముదాయాలు కూడా లాభపడాలి అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తూ డిజి తన ఉపన్యాసాన్ని ముగించారు. ‘‘ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని సమర్ధిస్తున్నందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. సాంప్రదాయిక మందుల వాడకం లో ఒక్క కేంద్రం అనే కాకుండా మీ యొక్క సమర్థన చెప్పుకోదగినటువంటి మార్పు ను తీసుకు వస్తుంది అని నేను నమ్ముతున్నాను.’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో డబ్ల్యుహెచ్ఒ డిజి అన్నారు. సాంప్రదాయిక ఔషధాల పట్ల నిబద్ధత కు గాను మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ ను కూడా ఆయన పొగడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పాటిస్తున్న సంవత్సరం లోనే డబ్ల్యుహెచ్ఒ కు 75 ఏళ్ళు రావడం అనేది సంతోషదాయకమైన సంయోగం’’ అని కూడా ఆయన పేర్కొన్నారు.

 

శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ సాంప్రదాయిక మందుల రంగం లో భారతదేశం మరియు గుజరాత్ ల తోడ్పాటు ను కొనియాడారు. మారిశస్ లో ఆరోగ్య రంగం లో భారతదేశం యొక్క సమర్ధన ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతదేశం తో మారిశస్ కు గల ఉమ్మడి ప్రాచీనత ను గురించి మారిశస్ ప్రధాని చెప్తూ, తమ దేశం లో ఆయుర్వేదాని కి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని గురించి నొక్కిచెప్పారు. మారిశస్ లో ఒక ఆయుర్వేద ఆసుపత్రి ని ఏర్పాటు చేసిన సంగతి ని ఆయన వెల్లడి చేస్తూ, లాక్ డౌన్ ఒకటో దశ లో సాంప్రదాయిక ఔషధాల ను విరాళం గా ఇచ్చినందుకు భారతదేశాని కి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇది సంఘీభావం తాలూకు అనేకమైన చొరవల లో ఒకటి. దీనికి గాను భారత ప్రభుత్వాని కి, మరీ ముఖ్యం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కి మేం ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం’’ అని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ అన్నారు.

 

ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మహమ్మారి కాలం లో ప్రజల లో వ్యాధి నిరోధక శక్తి ని మెరుగు పరచడం కోసం అవసరమైన ఒక బలమైన మద్దతు ను ఆయుష్ అందించింది. మరి ఆ కాలం లో ఆయుష్ ఉత్పత్తులంటే ఆసక్తి, ఇంకా గిరాకీ ఉన్నట్టుండి పెరిగిపోయాయి. అప్పుడు గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ ఎండ్ ఇనొవేశన్ సమిట్ ను ఏర్పాటు చేయాలి అనే ఆలోచన తనకు తట్టింది అన్నారు. మహమ్మారి ని ఎదుర్కోవడం కోసం భారతదేశం లో చేపట్టిన ప్రయత్నాల ను గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఆధునిక ఔషధ నిర్మాణ కంపెనీలు మరియు టీకామందు తయారీదారు సంస్థ లు వాటికి గనుక వాటికి సరి అయిన కాలం లో పెట్టుబడి లభించిన పక్షం లో చొరవ ను తీసుకొంటామంటూ వాగ్దానం చేశాయని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘అంత త్వరగా కరోనా టీకా మందు ను మేం అభివృద్ధి చేయగలుగుతాం అని ఎవరు మాత్రం ఊహించి ఉంటారు?’’ అని ఆయన అడిగారు.

 

ఆయుష్ రంగం వేసిన ముందడుగుల ను గురించి ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, ‘‘ఆయుష్ మందులు, సప్లిమెంట్ లు, ఇంకా కాస్మెటిక్స్ ఉత్పత్తి లో మనం ఇప్పటికే ఇదివరకు ఎరుగనటువంటి వృద్ధి ని చూస్తున్నాం. 2014వ సంవత్సరం లో, ఆయుష్ రంగం 3 బిలియన్ డాలర్ కంటే తక్కువ సామర్ధ్యం తో ఉన్నది కాస్తా ప్రస్తుతం 18 బిలియన్ డాలర్ ను మించిన స్థాయి లో వృద్ధి చెందింది’’ అని ఆయన అన్నారు. సాంప్రదాయిక మందుల రంగం లో స్టార్ట్-అప్ సంస్కృతి ని ప్రోత్సహించడం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రధానమైన చర్యల ను అనేకం గా చేపట్టింది అని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం ఆల్ ఇండియా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అభివృద్ధి పరచినటువంటి ఒక ఇంక్యూబేశన్ సెంటరు ను ప్రారంభించడమైంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వర్తమాన కాలాన్ని గురించి ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, ఇది యూనికార్న్ ల కాలం అన్నారు. ఒక్క 2022వ సంవత్సరం లోనే ఇతవరకు భారతదేశం నుంచి 14 స్టార్ట్-అప్స్ ఈ యూనికార్న్ క్లబ్ లో చేరాయి అని ఆయన పేర్కొన్నారు. ‘‘మన ఆయుష్ స్టార్ట్-అప్స్ లో అతి త్వరలోనే యూనికార్న్ స్ తప్పక వృద్ధి లోకి వస్తాయి అనే విశ్వాసం నాలో ఉంది’’ అని ఆయన అన్నారు. ఔషధీయ మొక్కల ఉత్పత్తి అనేది రైతుల ఆదాయాన్ని మరియు బతుకు తెరువు ను వృద్ధి చేసుకొనేందుకు ఒక చక్కని మాధ్యమం అవుతుంది, ఇంకా దీనిలో ఉపాధి కల్పన కు అవకాశం ఉంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఔషధీయ మొక్కల ఉత్పత్తి లో పాలుపంచుకొన్న రైతులు ఇట్టే జతపడేటటువంటి ఒక బజారు ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన అన్నారు. దీని కోసం, ప్రభుత్వం ఆయుష్ ఇ-మార్కెట్ ప్లేస్ ను ఆధునీకరించే మరియు విస్తరించే దిశ లో కృషి చేస్తోంది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం మూలికా వృక్షాల కు ఒక ఖజానా గా ఉంది; అది, ఒక రకం గా మన ఆకుపచ్చ బంగారం అన్నమాట’’ అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

 

ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతి ని ప్రోత్సహించడాని కి గత కొన్ని సంవత్సరాల లో అంతకు ముందు ఎన్నడూ ఎరుగని రీతి లో ప్రయాసలు జరిగాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇతర దేశాల తో కలసి ఆయుష్ ఔషధాల కు పరస్పరం గుర్తింపు ను ఇవ్వడం కోసం ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరిగింది. దీని కోసం గత కొన్ని సంవత్సరాల లో వివిధ దేశాల తో 50 కి పైగా ఎమ్ఒయు లు కుదుర్చుకోవడమైంది. ‘‘మన ఆయుష్ నిపుణులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ‌ర్డ్స్ (బిఐఎస్‌) సహకారం తో ఐఎస్ఒ ప్రమాణాల ను అభివృద్ధి పరుస్తున్నారు. ఇది 150కు పైగా దేశాల లో ఆయుష్ కు ఒక భారీ ఎగుమతి బజారు కు తలుపుల ను తెరవగలుగుతుంది.’’ అని ఆయన అన్నారు.

 

ఎఫ్ఎస్ఎస్ఎఐ కిందటి వారం లో తన నిబంధనావళి లో ఆయుష్ ఆహార్పేరు తో ఒక కొత్త కేటగిరీ ని ప్రకటించింది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇది హెర్బల్ న్యుట్రిశనల్ సప్లిమెంట్ స్ ఉత్పత్తిదారుల కు ఎంతో సహకరించగలదు. అదే విధం గా, భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుష్ చిహ్నాన్ని కూడా రూపుదించబోతున్నది. ఈ చిహ్నాన్ని అత్యున్నతమైన నాణ్యత కలిగినటువంటి, భారతదేశం లో తయారు అయ్యేటటువంటి ఆయుష్ ఉత్పత్తుల కు వర్తింప చేయడం జరుగుతుంది. ఈ ఆయుష్ చిహ్నాని కి ఆధునిక సాంకేతికత తాలూకు నిబంధనల ను అనుసరించడం జరుగుతుంది. ‘‘ఇది ఆయుష్ ఉత్పత్తుల యొక్క నాణ్యత పై ప్రపంచవ్యాప్తం గా ప్రజల కు విశ్వాసాన్ని ఇస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

ఆయుష్ ఉత్పత్తుల తయారీ, వ్యాప్తి, ఇంకా పరిశోధనల ను దేశం అంతటా ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఆయుష్ పార్కుల నెట్ వర్క్ ను అభివృద్ధి చేయనుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ ఆయుష్ పార్కులు భారతదేశం లో ఆయుష్ తయారీ కి కొత్త దిశ ను ఇస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

సాంప్రదాయిక మందుల యొక్క శక్తి ని గురించి ప్రధాన మంత్రి మరింతగా వివరిస్తూ, కేరళ లో పర్యటన రంగం పెరగడం లో సాంప్రదాయిక మందుల భూమిక ను గురించి వివరించారు. ‘‘ఈ సామర్ధ్యం భారతదేశం లో ప్రతి మూలనా ఉంది. హీల్ ఇన్ ఇండియాఈ దశాబ్దం లో ఒక పెద్ద బ్రాండ్ గా మారగలుగుతుంది’’ అని ఆయన అన్నారు. ఆయుర్వేద, యునానీ, సిద్ధ మొదలైన వాటిపైన ఆధారపడ్డ వెల్ నెస్ సెంటర్ స్ అత్యంత జనాదరణ కు నోచుకొనే అవకాశం ఉంది అని ఆయన అన్నారు. దీనిని మరింతగా ప్రోత్సహించడం కోసం ఆయుష్ చికిత్స ప్రయోజనాల కోసం భారతదేశాని కి రాదలచుకొనే విదేశీయుల కై ప్రభుత్వం మరొక కార్యక్రమాన్ని చేపడుతున్నది అని ఆయన అన్నారు. ‘‘అతి త్వరలోనే, భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుష్ వీజా కేటగిరీ ని పరిచయం చేయబోతోంది. ఇది ఆయుష్ థెరపి కోసం భారతదేశాని కి రాక పోక లు జరిపే వారికి సహకరిస్తుంది’’ అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

కెన్యా పూర్వ ప్రధాని శ్రీ రాయ్ లా ఒడింగా కుమార్తె రోజ్ మేరీ ఒడింగా గారు ఆయుష్ చికిత్స ను అందుకొన్న తరువాత తిరిగి తన కంటిచూపున కు నోచుకోవడం తాలూకు ఆయుర్వేద విజయ గాథ ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. రోజ్ మేరీ ఒడింగా గారు కూడా సభికుల లో ఒకరు గా ఉన్నారు. ఆమె ను ప్రధాన మంత్రి శ్రోతల కు పరిచయం చేయడం తోనే శ్రోతలు పెద్దపెట్టున చప్పట్లు చరిచారు. 21వ శతాబ్దపు భారతదేశం తన అనుభవాల ను, తన జ్ఞానాన్ని ప్రపంచం తో పంచుకోవడం ద్వారా ముందుకు దూసుకు పోవాలని తలుస్తోంది అని ఆయన చెప్పసాగారు. ‘‘మా సంప్రదాయం యావత్తు మానవాళి కి ఒక వారసత్వం వంటిది’’ అని ఆయన అన్నారు. ఆయుర్వేద కు వచ్చిన మంచి పేరు వెనుక ఉన్న ప్రధానమైనటువంటి కారణాల లో ఒక కారణం అది అందరికీ అందుబాటులో ఉన్న నమూనా కావడమే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సమాచార సాంకేతికత (ఐటి) రంగం లో గల ఓపన్ సోర్స్ మూవ్ మెంట్ తో దీనిని ప్రధాన మంత్రి పోల్చుతూ, ఆయుర్వేద సంప్రదాయం అనేది జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా ఇతోధిక శక్తి ని సంతరించుకొంది అని స్పష్టం చేశారు. మన పూర్వికుల వద్ద నుంచి ప్రేరణ ను పొందుతూ ఓపన్ సోర్స్ సంబంధి సమధిక ఉత్సాహం తో కృషి చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది అని ఆయన నొక్కిచెప్పారు. రాబోయే 25 సంవత్సరాల అమృత కాలం అనేది సాంప్రదాయిక మందుల కు సువర్ణ కాలం గా రుజువు కాగలదు అనేటటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

 

 

ప్రధానమంత్రి ప్రసంగం స్వీయ అనుభవం తో చాలా ఆసక్తిదాయకమైన విధం గా ముగింపునకు చేరుకొంది. భారతదేశం పట్ల డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయసస్ కు ఉన్న ప్రేమ ను, ఆయన కు గురువులు గా ఉన్న భారతీయుల పట్ల ఆయన కు గల గౌరవాన్ని మరియు గుజరాత్ అంటే ఆయన కు ఉన్న మక్కువ ను గురించి ప్రధాన మంత్రి వెల్లడి చేస్తూ, ఆయన ను తులసీ భాయిఅనే ఒక గుజరాతీ పేరు తో శ్రీ నరేంద్ర మోదీ పిలిచారు. తులసి కి భారతదేశ పరంపర లో ఉన్న శుభప్రదమైన స్థాయిని గురించి, ఉన్నతమైన స్థాయి ని గురించి సభికుల కు, చిరునవ్వులను చిందిస్తూ వెలిగిపోతున్న మోము తో ఉన్న డబ్ల్యు హెచ్ఒ డిజి కి ఆయన వివరించారు. సభ కు హాజరు అయిన డబ్ల్యుహెచ్ఒ డిజి కి, మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ కు శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

 

DS

 

 

 



(Release ID: 1818527) Visitor Counter : 164