ప్రధాన మంత్రి కార్యాలయం
జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ అంతర్జాతీయ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచబ్యాంకు డిజి
ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం ఇండియాలో ఏర్పాటవుతున్నందుకు ఇండియాకు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ నాయకులు.
ఈ రంగంలో భారతదేశం సాగించిన అద్బుత కృషికి గుర్తింపుగా వచ్చినదే ప్రపంచ సంప్రదాయ ఔషధ కేంద్రం
మొత్తం మానవాళికి సేవలు అందించే బృహత్తర బాధ్యతను ఇండియా తీసుకుంది.
స్వస్థత విషయంలో జామ్‌నగర్‌చేసిన కృషికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ ప్రపంచ కేంద్రం రావడం అంతర్జాతీయ గుర్తింపులభించినట్టు.
"ఒక గ్రహం, మన ఆరోగ్యం అన్న పిలుపుతో భారతీయ దార్శనికత అయిన ఒక ధరిత్రి, ఒక ఆరోగ్యం నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమోట్ చేసినట్టు అయింది."
"భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థ కేవలం చికిత్సకు పరిమితమైనది కాదు. ఇది జీవితానికి సంబంధించిన పరిపూర్ణశాస్త్రం."
Posted On:
19 APR 2022 6:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జామ్‌నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ విధాన అంతర్జాతీయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మారిషస్ ప్రధానమంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగనౌత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయేసుస్ ల సమక్షంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రపంచం మొత్తం మీద సంప్రదాయ ఔషధ తొలి, ఒకే ఒక గ్లోబల్ ఔట్ పోస్టు జిసిటిఎం అవుతుంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ప్రధానమంత్రులు పంపిన వీడియో సందేశాలు, మాల్దీవ్‌ల అధ్యక్షుడు పంపిన వీడియో సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, శ్రీ శర్వానంద్‌సోనోవాల్, శ్రీముంజపర మహేంద్రభాయ్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీభూపేంద్రభాయ్ పటేల్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ కేంద్రం ఏర్పాటుకు అన్ని విధాల మద్దతు నిచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయెసుస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రం నిజమైన అంతర్జాతీయ ప్రాజెక్టుగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 107 సభ్యదేశాలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తాయి. అంటే సంప్రదాయ ఔషధ రంగంలో ఇండియా నాయకత్వం కోసం అవి ఇక్కడికి వస్తాయి. సంప్రదాయ వైద్య ఉత్పత్తులు అంతర్జాతీయంగా అందుబాటులోకి రానున్నాయని, ఈ కేంద్రం సంప్రదాయ ఔషధాలను ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చేదిశగా ఫలవంతం కానుందని అన్నారు. ఈ కొత్త కేంద్రం సమాచారం, ఆవిష్కరణలు, సుస్థిరతపై దృష్టి పెడుతుంది. అలాగే సంప్రదాయ ఔషధాలను గరిష్ఠంగా ఉపయోగం లోకి తెస్తుందని అన్నారు. ఈ కేంద్రానికి గల ఐదు ప్రధాన అంశాలు, పరిశోధన, నాయకత్వం, ఆధారాలు, నేర్చుకోవడం, సమాచారం, విశ్లేషణ, సుస్థిరత, ఈక్విటి, ఆవిష్కరణలు, సాంకేతికత అని డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయెసుస్ అన్నారు.
మారిషస్ ప్రధానమంత్రి శ్రీ ప్రవింద్‌కుమార్ జుగనౌత్ ఈ కార్యక్రమంలో మారిషస్‌నుకూడా చేర్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశీయ వైద్య వ్యస్థలు, వివిధ సంస్కృతులలో వనమూలికల ఉత్పత్తుల ప్రాధన్యత గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు ఇంతకుమించిన మంచి సమయం ఏదీ ఉండదని ఆయన అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు విషయంలో స్వయంగా నాయకత్వ పాత్ర పోషించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మేం, ప్రధానమంత్రి శ్రీ మోదీజీకి , భారతప్రభుత్వానికి, భారత ప్రజలకు ఈ రంగంలో వారి కృషికి ఎంతో రుణపడి ఉన్నాము అని పేర్కొన్నారు. 1989 నుంచి ఆయుర్వేదానికి మారిషస్ లో చట్టపరమైన గుర్తింపునిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జామ్‌నగర్ లో ఆయుర్వేద వైద్యం చదువుకునే వారికి గుజరాత్ రాష్ట్రం స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డాక్టర్ టెడ్రొస్ ఘెబ్రెయెసుస్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ టెడ్రొస్‌హెబ్రెయెసుస్ ఇండియాతో అనుబంధం కలిగి ఉన్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్ర ప్రాజెక్టులో(జిసిటిఎం) ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. ఆయన అభిమానం, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం ఏర్పాటులో ప్రతిఫలించిందని అన్నారు.ఆయన ఆకాంక్షలను ఇండియా నెరవేరుస్తుందని ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ అన్నారు.
మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగనౌత్, వారి కుటుంబంతో మూడు దశాబ్దాలుగా గల అనుబంధాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి చెప్పిన మాటలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు సందర్బంగా తమ వీడియో సందేశాలు పంపిన నాయకులకు కూడా ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది సంప్రదాయ ఔషధ రంగంలో భారత దేశ కృషి, సామర్ధ్యానికి లభించిన గుర్తింపు అని ప్రధానమంత్రి అన్నారు. ఇండియా ఈ భాగస్వామ్యాన్ని మొత్తం మానవాళికి సేవ చేసేందుకు లభించిన బృహత్తర బాధ్యతగా భావిస్తుందని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఈ కేంద్రం ఏర్పాటు అవుతున్న ప్రాంతం పై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి, స్వస్తత విషయంలో జామ్‌నగర్ , ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రంతో అంతర్జాతీయ గుర్తింపును పొందుతుందని అన్నారు. ఐదు దశాబ్దాల క్రితం ప్రపంచం లోనే తొలి ఆయుర్వేద విశ్వవిద్యాలయం జామ్‌నగర్ లో ఏర్పాటైందని అన్నారు. ఆయుర్వేదంలో పరిశోధన,బోధన రంగంలో ఉన్నత ప్రమాణాలు గల సంస్థ జామ్ నగర్ లో ఉందని అన్నారు.
మన అంతిమ లక్ష్యం స్వస్థత సాధించడమని ప్రధానమంత్రి అన్నారు. వ్యాధులు లేకుండా జీవించడం జీవితంలో ప్రధానమైనదని అయితే అంతిమ లక్ష్యం స్వస్తత అని ఆయన అన్నారు. స్వస్థత ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి , కోవిడ్ మహమ్మారి సమయంలో దీని ప్రాధాన్యత తెలిసిందన్నారు. ప్రపంచం ఇవాళ ఆరోగ్య సంరక్షణ సేవల అందుబాటులో కొత్త కోణం వైపు చూస్తున్నది. ఒక ప్లానెట్, అవర్ హెల్త్ అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవ్వడం ద్వారా భారతీయ దార్శనికత అయిన వన్ ఎర్త్, వన్ హెల్త్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోత్సహించినట్టు అయిందన్నారు.
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశపు సంప్రదాయ వైద్య విధానం కేవలం చికిత్సకు మాత్రమే సంబంధించినది కాదని, ఇది జీవితానికి సంబంధించిన సంపూర్ణ శాస్త్రమని అన్నారు. ఆయుర్వేదం వ్యాధిని నయం చేయడం, చికిత్సను మించి న దని ఆయన అన్నారు. ఆయుర్వేద నయం చేయడం, చికిత్సను అందించడంతోపాటు సామాజిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సంతోషం, పర్యావరణ ఆరోగ్యం, జాలి, కరుణ, ఉత్పాదకత అన్నీ కలగలసినదని అన్నారు. ఆయుర్వేదం జీవన విజ్ఞానమని ఇది ఐదో వేదమని అన్నారు. మంచి ఆరోగ్యం సమతుల ఆహారంతో ముడిపడినదని ప్రధానమంత్రి అన్నారు. మన పూర్వీకులు ఆహారంలోనే సగం చికిత్స ఉందని భావించారన్నారు. మన వైద్య వ్యవస్థలు ఆహార సలహాలతో నిండి ఉన్నాయన్నారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం భారతదేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇది మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నదని ఆయన అన్నారు.
ఆయుర్వేద, సిద్ద, యునాని ఫార్ములేషన్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, చాల దేశాలు, మహమ్మారిని ఎదుర్కోవడంలో సంప్రదాయ ఔషధాల ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నాయన్నారు. అలాగే యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నదన్నారు. డయాబిటిస్, ఊబకాయం, మానసిక ఒత్తిడి వంటి వాటిని ఎదుర్కోవడంలో యోగా ఎంతో ఉపయోగకారిగా ఉందని రుజువు అవుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, మానసిక స్థితిని సమతూకంలో ఉంచడంలో ,చైతన్యవంతంగా ఉంచడంలో యోగా ఉపయోగకారిగా ఉందన్నారు.
ఈ కేంద్రానికి ప్రధానమంత్రి ఐదు లక్ష్యాలను ప్రకటించారు. అవి మొదటిది, సంప్రదాయ విజ్ఞానానికి సంబంధించి సాంకేతికత ఉపయోగించి డాటాబేస్ ను రూపొందించడం, రెండోది జిసిటిఎం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సంప్రదాయ ఔషధాలకు టెస్టింగ్, సర్టిఫికేషన్ సదుపాయం కల్పించడం. దీనివల్ల ప్రజలలో ఈ ఔషధాలపై విశ్వాసం పెరుగుతుంది. మూడోది జిసిటిఎం, అంతర్జాతీయంగా సంప్రదాయ ఔషధ రంగంలో నిపుణులైన వారిని ఒక చోటికి చేర్చి వారి అనుభవాలను పంచుకోవడం, అలాగే ఏటా సంప్రదాయ ఔషధ ఉత్సవాలను నిర్వహించే అంశాన్ని పరిశీలించడం, నాలుగోది జిసిటిఎం సంప్రదాయ ఔషధ రంగంలో పరిశోధనకు అవసరమైన నిధులను సమీకరించడం, చివరగా జిసిటిఎం ప్రత్యేకించి కొన్ని రకాల వ్యాధులకు సంపూర్ణ చికిత్సకుసంబంధించిన ప్రొటోకాల్స్‌ను అభివృద్ధి చేయడం. దీనివల్ల పేషెంట్లు అటు సంప్రదాయ ఇటు ఆధునిక వైద్యం ద్వారా ప్రయోజనం పొందడానికి వీలు కలుగుతుంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వసుధైవ కుటుంబకమ్ అన్నసూక్తిని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచం అంతా ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన ప్రార్థించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకుచెందిన జిసిటిఎం ఏర్పాటుతో ఈ సంప్రదాయం మరింత సుసంపన్నం అవుతుందని ఆయన అన్నారు.
(Release ID: 1818384)
Visitor Counter : 274
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam