ప్రధాన మంత్రి కార్యాలయం

సివిల్ సర్వీసెస్ డే నాడు, ప్రభుత్వ పరిపాలన లో శ్రేష్ఠత్వాని కి గానుప్రధాన మంత్రి తరఫున పురస్కారాల ను ప్రదానం చేయనున్న ప్రధాన మంత్రి 

Posted On: 20 APR 2022 10:09AM by PIB Hyderabad

సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 21వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రభుత్వ పరిపాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ప్రధాన మంత్రి తరఫు న ఇచ్చే పురస్కారాల ను ప్రదానం చేస్తారు. ఆయన ఈ కార్యక్రమం లో సివిల్ అధికారుల ను ఉద్దేశించి ప్రసంగం కూడా చేయనున్నారు.

ప్రభుత్వ పాలన లో ప్రావీణ్యాని కి గాను ప్రధాన మంత్రి తరఫున ప్రకటించేటటువంటి పురస్కారాల ను సామాన్య పౌరుల సంక్షేమం కోసం జిల్లా లు/కార్యాచరణ విభాగాలు మరియు కేంద్రీయ / రాష్ట్రాల సంస్థలు అమలు పరచినటువంటి అసాధారణమైన కార్యాల ను మరియు కొత్త కొత్త కార్యక్రమాల ను గుర్తించాలి అనే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పురస్కారాల ను గుర్తించిన ప్రాథమ్య కార్యక్రమాలు మరియు నూతన ఆవిష్కరణల ను ప్రభావవంతమైన రీతి లో అమలు పరచినందుకు కూడా ప్రదానం చేయడం జరుగుతున్నది.

ఈ కింద ప్రస్తావించినటువంటి అయిదు గుర్తించిన ప్రాథమ్య కార్యక్రమాల లో చేసిన మార్గదర్శ కప్రాయమైన కార్యాలకు గాను సివిల్ సర్వీసెస్ డే 2022 సందర్భం లో పురస్కారాల ను ప్రదానం చేయడం జరుగుతుంది: (1) పోషణ్ అభియాన్ లో ‘‘జన్ భాగీదారీ’’ లేదా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, (2) ఖేలో ఇండియా పథకం యొక్క మాధ్యమం ద్వారా క్రీడలు మరియు వెల్ నెస్ లో శ్రేష్ఠత్వాన్ని ప్రోత్సహించడం, (3) పిఎమ్ స్వనిధి యోజన లో డిజిటల్ చెల్లింపులు మరియు సుపరిపాలన, (4) ఒక జిల్లా, ఒక ఉత్పత్తి పథకం యొక్క మాధ్యమం ద్వారా సమగ్ర అభివృద్ధి, (5) మానవ ప్రమేయానికి తావు లేకుండానే సేవల ను ఆరంభం నుంచి అంతం వరకు నిరంతరాయంగా ప్రజల కు అందించడం.

ఈ సంవత్సరం లో గుర్తించిన అయిదు ప్రాథమ్య కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పాలన/సేవల అందజేత మొదలైన రంగాల లో నూతన ఆవిష్కరణల కు గాను మొత్తం 16 పురస్కారాల ను ఇవ్వడం జరుగుతుంది.

 

 

***



(Release ID: 1818366) Visitor Counter : 134